హిందుస్తానీ సంగీత గాయకులు - ఘరానాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హిందుస్థానీ సంగీత గాయకులు - ఘరానాలు : హిందుస్తానీ సంగీతంలో ఘరానాలు ఉంటాయి. ఒక్కొక్క ఘరానా ఒక్కొక్క శాస్త్రీయ గాన శైలి మరియు పోకడలను కలిగి ఉంటుంది.

1. గ్వాలియర్ ఘరానా: ఇది అన్నిటిలోకెల్లా పురాతనమైనది.ఇందులోని సుప్రసిద్ధ గాయకులు : బాలకృష్ణ బల్ చల్ కరంజీకర్, (1849 - 1927) అతని శిష్యుడు విష్ణు దిగంబర్ పలుస్కర్, (1872 - 1931) పండిట్ ఓంకార్ నాథ్ ఠాకూర్, (1897 - 1967) వీణా సహస్ర బుద్దే మరియు మాలినీ రాజూర్కర్ లు.

2. కిరాణా ఘరానా : కురుక్షేత్ర్ లోని కిరాణా, కరీంఖాన్ స్వస్థలం. ఇందులోని ప్రసిద్ధ గాయకులు: అబ్దుల్ కరీంఖాన్, (1872 - 1937) హీరాబాయి బరోడేకర్, బేగం అఖ్తర్, భీమ్‌సేన్ జోషి, గంగూబాయి హంగల్ మరియు ప్రభా ఆత్రే లు.

3.అత్రౌలి - జయపూర్ ఘరానా: ఇందులో అల్లాదియా ఖాన్ (1855 - 1943), మల్లికార్జున్ మన్సూర్, కేసర్ బాయి కేర్కర్, కిషోరీ అమోంకర్, శ్రుతి సడోలికర్, పద్మా తల్వార్కర్, మోగుబాయి కుర్దికర్ మరియు అశ్విని భిడె దేశ్ పాండేలు ప్రముఖులు.

4. ఆగ్రా ఘరానా : ఇందులో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ (1886 - 1950), సి.ఆర్.వ్యాస్, ఎస్.ఎన్.రతన్ జన్‌కర్, మరియు జితేంద్ర అభిషేకిలు ప్రసిద్దులు.

5. పటియాలా ఘరానా : అలీ బక్ష్ (1850 - 1920), మరియు ఫతే అలీ ఖాన్ (1850 - 19090) ఈ ఘరానాకు ఆద్యులు. ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ (1901 - 1969). చాలా గొప్పగా పాడే పండిట్ అజయ్ చక్రవర్తి మరియు పర్వీన్ సుల్తానాలు ఈ ఘరానాకు చెందిన వారే.

6. రాంపూర్ - సహస్వాన్ ఘరానా : దీనిని స్థాపించినవాడు ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్ (1849 - 1919). గులాం ముస్తఫా ఖాన్, ఉస్తాద్ నిసార్ హుసేన్ ఖాన్ మరియు ఉస్తాద్ రాషిద్ ఖాన్లు ఈ ఘరానాకు చెందినవారే.

7. మేవాతి ఘరానా: దీనికి మూలపురుషుడు ఘగ్గె నాజిర్ ఖాన్.ఇందులో ఎక్కువగా విష్ణుతత్వ భజనలను ఆలపిస్తారు. ఇందులోని సుప్రసిద్ధ గాయకులు పండిట్ జస్రాజ్, మరియు అతని శిష్యులు సంజీవ్ అభయంకర్, రత్తన్ శర్మ లు.

8.భూండీ బజార్ ఘరానా : ఇందులోని ముఖ్య గాయకులు ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ మరియు అంజనీబాయి మాల్పేకర్ లు.

బయటి లింకులు[మార్చు]