మోగుబాయి కుర్దికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోగుబాయి కుర్దికర్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంమోగుబాయి కుర్దికర్
జననంజులై 15, 1904
మూలంకుర్దీ, గోవా
మరణంఫిబ్రవరి 10, 2001
సంగీత శైలిహిందుస్థానీ సంగీతము - ఖయల్
వృత్తిహిందుస్థానీ సంప్రదాయ సంగీత కళాకారిణి

గాన తపస్విని మోగుబాయి కుర్దికర్ (జులై 15, 1904 – 2001 ఫిబ్రవరి 10) ప్రముఖ హిందుస్థానీ సంప్రదాయ సంగీత కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలోని జైపూర్-అత్రౌలీ ఘరానా సంప్రదాయానికి చెందిన గాయకురాలు ఆమె.[1]

తొలినాళ్ళ జీవితం, నేపధ్యం[మార్చు]

పోర్చ్యుగీస్ పాలనలోని గోవాలో కుర్దీ గ్రామంలో గోవన్ మరాఠా కుటుంబంలో జన్మించింది మోగుబాయి.[2] 1913లో, ఆమెకు తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు, ఆమె తల్లి జయశ్రీబాయి జంబౌలింలోని ఒక గుడిలో ఉండే పూజారి దగ్గర సంగీతం నేర్చుకునేందుకు చేర్చింది. ఆ తరువాత మోగుబాయిని చంద్రేశ్వర్ భూతనాథ్ సంగీత మండలీ అనే ట్రావెలింగ్ నాటక కంపెనీలో చేర్చింది ఆమె తల్లి. ఆ కంపెనీలో మోగుబాయి నటిగా పనిచేసింది.

ఆమె ఆ నాటక మండలిలో పనిచేసేటప్పుడు, 1914లో మోగు తల్లి మరణించింది.[3] కొందరి ప్రకారం[1] ఆమె తల్లి మరణశయ్యపై ఉన్నప్పుడు, మోగు ప్రముఖ గాయకురాలు కావాలని కోరిందనీ, అదే ఆమె తల్లి చివరి కోరిక. ఆ తరువాత కొన్నాళ్ళకే ఆ నాటక సమాజం దివాళా తీయడంతో, దానికి ప్రత్యర్థి అయిన సతర్కర్ స్ట్రీ సంగీత మండలి మోగును నటిగా తీసుకుంది.

మూలాలు[మార్చు]

  1. https://scroll.in/article/718188/four-versions-of-vande-mataram-by-hindustani-maestros-mark-national-week
  2. "rediff.com: Veteran singer Mogubai Kurdikar dies at 96". www.rediff.com. Retrieved 2017-02-04.
  3. http://www.marathisrushti.com/profiles/mogubai-kurdikar/

ఇతర లింకులు[మార్చు]