ఆర్తి నాయక్
ఆర్తి నాయక్ | |
---|---|
ఆర్తి నాయక్ | |
వ్యక్తిగత సమాచారం | |
మూలం | భారతదేశం |
సంగీత శైలి | హిందూస్థానీ సంగీతం, నాట్యగీత, భజన్, తుమ్రి, టప్ప, ఇండియన్ క్లాసికల్. |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1993–ప్రస్తుతం |
ఆర్తి నాయక్, ప్రముఖ హిందుస్థానీ సంప్రదాయ సంగీత గాయిని.లియర్ గరానా సంప్రదాయానికి చెందిన సంగీతం నేర్చుకుంది ఆమె. సంగీత నాటకాలకు కూడా ప్రదర్శనలు ఇచ్చింది ఆర్తి.
తొలినాళ్ళ జీవితం[మార్చు]
ఆర్తి నాయక్ సంగీత కుటుంబంలోనే పుట్టింది. ఆమె తండ్రి రామారావు నాయక్ గ్వాలియర్ కిరాణా ఘరానా సంప్రదాయానికి చెందిన గాయకుడు. ఆమె నాయనమ్మ శ్రీమతి ముక్తానాయక్ ఆధ్యాత్మిక గాయని. ఆమె తాత (తల్లి తండ్రి) శ్రీ హనుమంతు కామత్ కూడా రంగస్థల కళకారుడు. [1]
ఆమె తన నాల్గవ యేట ఆమె తల్లి ప్రతిమా నాయక్ వద్ద సంగీత విద్యాభ్యాసం ప్రారంభించింది. 6వ సంవత్సరంలో తన తండ్రి వద్ద సంగీత శిక్షణను పొందింది. తన తండ్రి పండిట్ భాక్షర్భువా (గ్వాలియర్ ఘరారా) శిష్యుడు. ఆమెకు సంగీత జ్ఞానంపై గల అభిరుచిని ఆమె తండ్రితో పాటు పండిట్ పి.కె.అభ్యంకర్-కిరాణా ఘరానా, పండిట్ వి.ఆర్.అథవాల (కిరాణా ఘరానా)లు గుర్తించారు. ఆమె నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి వారు దోహదపడ్డారు. ఆమె తన 9వ యేట తబల, హార్మోనియం లను శిక్షణ లేకుండా నేర్చుకుంది. తరువాత సితార, భరతనాట్యం లను నేర్చుకుంది.[2]
విద్య[మార్చు]
ఆమె ముంబై లోని ఆఖిల భారతీయ గాంధర్వ మహావిద్యాలయ మండల్ లో సంగీత అలంకారాలు, సంగీత విశారదలను చేసింది. ఆమె సంగీత విభాగంలో ఎం.ఎ చేసింది. కామర్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆమె సుధీంద్ర కామత్ అనే ఇంజనీరును వివాహమాడింది. వారు గోవాలోని మడ్గాన్ లో నివసిస్తున్నారు.
పురస్కారాలు - గుర్తింపులు[మార్చు]
- పండిట్ బసవరాజ్ రాజ్‌గురు నేషనల్ యూత్ అవార్డు
- యువ సృజన పురస్కారం - గోవా ప్రభుత్వంచే 2013-2014
- సంగీత రత్న - వారణాశికి చెందిన కాశీ సంగీత సమాజంచే
- గోవా ప్రభుత్వంచే యశాదామిని పురస్కారం.
- సూర్మణి - సూర్ సింగర్ సంసద్, ముంబై.
- సారస్వత్ యువ పురస్కార్ - కొడియల్ ఖబర్ మంగుళూరు
- వామందాజి పురసారం
మూలాలు[మార్చు]
- ↑ "Aarti Nayak Music, Lyrics, Songs, and Videos". reverbnation.com. Retrieved 2014-03-14.
- ↑ "Aarti for the soul". thegoan.net. Archived from the original on 2014-03-30. Retrieved 2018-06-24.