Jump to content

విష్ణు దిగంబర్ పలుస్కర్

వికీపీడియా నుండి
విష్ణు దిగంబర్ పలుస్కర్
వ్యక్తిగత సమాచారం
జననం(1872-08-18)1872 ఆగస్టు 18
కురుంద్వాడ్
మూలంకురుంద్వాడ్, బాంబే ప్రెసిడెన్సీ, భారతదేశం
మరణం1931 ఆగస్టు 21(1931-08-21) (వయసు 59)
సంగీత శైలిహిందుస్తానీ శాస్త్రీయ సంగీతం
వృత్తిగాయకుడు
క్రియాశీల కాలం1890–1931

పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ (1872 ఆగస్టు 18 - 1931 ఆగస్టు 21) ఒక హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. ఇతను రఘుపతి రాఘవ రాజారామ్ భజన యొక్క అసలు వెర్షన్ పాడారు, 1901 లో "గంధర్వ మహావిద్యాలయ"ను స్థాపించారు. వాస్తవంగా ఇతని ఇంటిపేరు గాడ్గిల్, కాని వారు సాంగ్లి సమీపంలో ఉన్న పలూస్ గ్రామానికి చెందిన వారు కావడంతో "పలుస్కర్" కుటుంబానికి చెందిన వారిగా బాగా గుర్తింపు పొందారు.

బాల్య జీవితం, నేపథ్యం

[మార్చు]

విష్ణు దిగంబర్ పలుస్కర్ "కురుంద్వాడ్" యొక్క మరాఠీ కుటుంబంలో జన్మించాడు, ఇది బాంబే ప్రెసిడెన్సీ బ్రిటిష్ పాలన సమయంలో, డెక్కన్ డివిజన్ కింద ఉన్న ఒక చిన్న పట్టణం, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. ఇతని తండ్రి దిగంబర్ గోపాల్ పలుస్కర్ ఒక కీర్తన గాయకుడు. ఇతను ప్రాథమిక విద్య కోసం కురుంద్వాడ్ లోని ఒక స్థానిక పాఠశాలకు వెళ్లాడు. కానీ పలుస్కర్ చిన్న వయసులోనే ఒక విషాదానికి గురైనాడు.

ఒకరోజు దత్తజయంతి పండుగ సందర్భంగా టపాసులు కాల్చుతుంటే ఒక టపాసు అతని ముఖానికి దగ్గరగా పేలడంతో అతని రెండు కళ్లు దెబ్బతిన్నాయి. వీరు ఉంటున్నది చిన్న పట్టణం కావడంతో అక్కడ అందుబాటులో ఎటువంటి తక్షణ చికిత్స సదుపాయాలు లేకపోవడంతో పలుస్కర్ తన కంటి చూపు కోల్పోయారు. అయితే, అతను కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి చూపును పొందాడు[1].

మిరాజ్ యొక్క రాజు ఈ బాలుడి ప్రతిభను గుర్తించి బాలకృష్ణబువ ఇచల్‌కరంజికర్ అనే సంగీతకారుడి ఆధ్వర్యంలో సంగీకారునిగా మలచేందుకు ఇతనిని ఉంచాడు. పలుస్కర్ 1896 వరకు 12 సంవత్సరాల పాటు అతని వద్ద శిక్షణ తీసుకున్నాడు, అంతవరకు వీరిద్దరి మధ్య గురుశిష్యుల సంబంధముండేది, తరువాత విడిపోయారు.

మూలాలు

[మార్చు]
  1. Deva, B. Chaitanya. "An Introduction to Indian Music". Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. Retrieved 2006-05-10.

యివి చదవండి

[మార్చు]
  • Deva, B. Chaitanya (1981). An Introduction to Indian Music. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India.
  • Athavale, V.R. (1967). Pandit Vishnu Digambar Paluskar. National Book Trust.

యితర లింకులు

[మార్చు]