పండిట్ అజయ్ చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పండిట్ అజయ్ చక్రవర్తి ( జననం : 1953 ) పటియాలా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ సంగీత గాయకుడు.

బాల్యం,కుటుంబం[మార్చు]

పండిట్ అజయ్ చక్రవర్తి తండ్రి, అజిత్ చక్రవర్తి భారత స్వాతంత్ర్యానంతరం, బంగ్లాదేశ్ నుండి భారత దేశంలోని శ్యాంనగర్కు తన ఇద్దరు కుమారులతో వలస వచ్చాడు. అజయ్ చక్రవర్తి సోదరుడు సంజయ్ చక్రవర్తి ప్రముఖ సంగీతకారుడు. కూతురు కౌశికి చక్రవర్తి కూడా వర్ధమాన సంగీత కళాకారిణి. అజయ్ చక్రవర్తి కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.

సంగీత ప్రస్థానం[మార్చు]

అజయ్ చక్రవర్తి తన మూడేళ్ళ వయస్సులోనే తండ్రి వద్ద సంగీత పాఠాలు నేర్వడం ప్రారంభించాడు. తరువాత పన్నాలాల్ సామంత, శ్రీ కనైదాస్ బైరాగి వద్ద కొంతకాలం నేర్చి, పద్మభూషణ్ పండిట్ జ్ఞానప్రకాశ్ ఘోష్కు శిష్యుడైనాడు. 1969 లో, ప్రముఖ పటియాలా ఘరానా సంగీత విద్వాంసుడు, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ కుమారుడు మునవర్ అలీఖాన్కు శిష్యరికం చేసాడు. పండిట్ అజయ్ చక్రవర్తి ఇప్పుడున్న పటియాలా ఘరానాకు చెందిన వారిలో మేటి హిందుస్తానీ సంగీత కళాకారుడు.

అవార్డులు, పురస్కారాలు[మార్చు]

  • [1] సంగీత నాటక అకాడమీ అవార్డు - 2000

వనరులు[మార్చు]

1. [2] 2. [3] 3. [4]

బయటి లింకులు[మార్చు]

  • [5][permanent dead link] జీవిత చరిత్ర
  • [6] అజయ్ చక్రవర్తి ; బి.బి.సి.లో
  • [7] అజయ్ చక్రవర్తి జీవిత చరిత్ర - సమీక్షా ఫోరం