పర్వీన్ సుల్తానా
పర్వీన్ సుల్తానా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1950 మే 24 |
మూలం | అస్సాం, భారతదేశం |
సంగీత శైలి | ఖయాల్, భజనలు, టుమ్రీలు |
వృత్తి | హిందుస్తానీ సంగీతం |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 1962–ప్రస్తుతం |
బేగమ్ పర్వీన్ సుల్తానా (అస్సామీ: বেগম পাৰৱীন চুলতানা) (జననం 10 జూలై 1950) పటియాలా ఘరానాకు చెందిన ఒక అస్సామీ హిందుస్తానీ గాయని.[1] ఈమె భారత ప్రభుత్వంచే పద్మశ్రీ (1976), పద్మభూషణ్ (2014) పురస్కారాలను,కేంద్ర సంగీత నాటక అకాడమీ వారీచే సంగీత నాటక అకాడమీ అవార్డ్ (1998)ను అందుకుంది.
ప్రారంభ జీవితం
[మార్చు]ఈమె అస్సాం రాష్ట్రానికి చెందిన నాగావ్ పట్టణంలో ఇక్రముల్ మాజిద్ (ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు), మరూఫా బేగం (ఇరానీ) దంపతులకు జన్మించింది.[1] ఈమె పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారైనా ఇరాన్ దేశానికి వలస వెళ్ళారు.[1] ఈమె పసివయసులో తండ్రి ఒడిలో కూనిరాగాలు తీయడం గమనించిన తల్లి ఈమెకు సంగీతం నేర్పమని తన భర్తను కోరింది. ఆ విధంగా ఈమె తండ్రి ఈమెకు తొలి సంగీత గురువు అయ్యాడు. అతడు ఈమెకు లతా మంగేష్కర్ వంటి భారతీయ శాస్త్రీయ సంగీతజ్ఞుల పాటలను వినింపించేవాడు. ఈమె తన తాత మొహమ్మద్ నజీఫ్ ఖాన్ వద్ద కూడా కొంత సంగీతాన్ని అభ్యసించింది. పిమ్మట ఈమె బీరేంద్ర కుమార్ ఫుకన్, హీరేన్ శర్మల వద్ద సంగీతాన్ని నేర్చుకుంది.[2] తరువాత తండ్రి ప్రోద్బలం మీద బెంగాల్‌కు చెందిన పండిట్ చిన్మయ్ లాహిరి వద్ద సంగీత సాధన చేసింది. ఒకరోజు పర్వీన్ పండిట్ చిన్మయ్ లాహిరి ఇంటిలో తన తరువాతి గురువు, కాబోయే భర్త దిల్షాద్ ఖాన్ ను కలిసింది. తరువాత అతడు ఈమెను తన శిష్యురాలిగా అంగీకరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఒక సంగీతోత్సవంలో ఈమె మొదటిసారి దిల్షాద్ ఖాన్‌తో కలిసి జుగల్‌బందీని ప్రదర్శించింది.
వృత్తి
[మార్చు]ఈమె తన 12వ యేట 1962లో తొలి సంగీత కచేరీని ఇచ్చింది. 1965 నుండి సంగీతాన్ని రికార్డింగ్ చేస్తున్నది. అబ్దుల్ మాజిద్ తీసిన "మొరొం తృష్ణ" అనే అస్సామీ సినిమాతో సంగీతాన్ని వృత్తిగా స్వీకరించింది. ఈమె గదర్, ఖుద్రత్, దో బూంద్ పాని, పాకీజా మొదలైన బాలీవుడ్ సినిమాలకు, ఇంకా చాలా అస్సామీ చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించింది. విక్రం భట్ తీసిన 1920 అనే సినిమాకు థీమ్ సాంగ్ పాడింది.[3]
ఈమె హెచ్.ఎం.వి., పాలిడార్, మ్యూజిక్ ఇండియా, భారత్ రికార్డ్స్, ఆవిడ్స్, మ్యాగ్నాసౌండ్, సోనోడిస్క్, అమీగో వంటి రికార్డింగు సంస్థలలో పాడి అనేక ఆల్బమ్‌లను వెలువరించింది.
ఈమెకు 25 సంవత్సరాల వయసులోనే 1976లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈమె ఉస్తాద్ దిల్షాద్ ఖాన్ ను వివాహం చేసుకుని ముంబైలో నివసిస్తున్నది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.[4]
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]- 1976 : పద్మశ్రీ పురస్కారం [5]
- 1980 : గాంధర్వ కళానిధి బిరుదు
- 1986: మియా తాన్‌సేన్ బహుమతి
- 1994 : అస్సాం ప్రభుత్వం చే సంగీతా సామ్రాజ్ఞి బిరుదు
- 1981 : ఫిలిం ఫేర్ ఉత్తమ మహిళా గాయని అవార్డు ఖుద్రత్ చిత్రానికి
- 1999 : సంగీత నాటక అకాడమీ అవార్డు.[6]
- 2014: భారత ప్రభుత్వం చే పద్మ భూషణ్ పురస్కారం.[7]
- నారాయణి
- గజల్స్
- యంగ్ వాయ్సస్ ఆఫ్ ఇండియా (మాడ్రన్ గజల్స్)
- బేగం పర్వీన్ సుల్తానా
- ఎథరియల్ డ్యుయో విత్ దిల్షాద్ ఖాన్
- జీనియస్ ఆఫ్ పర్వీన్ సుల్తానా
- హోమేజ్ టు గురు
- ఖయాల్ & టుమ్రీ
- మార్వలెస్ జుగల్బందీ విత్ దిల్షాద్ ఖాన్
- మేఘ్ - మానవి
- వన్ ప్లస్ వన్ ఇన్ హార్మనీ విత్ దిల్షాద్ ఖాన్
- టూ వాయ్సస్ విత్ దిల్షాద్ ఖాన్
- ఫినామినల్ పర్ఫార్మెన్స్
- పర్వీన్ సుల్తానా సింగ్స్ రేర్ మెలోడీస్
- ఖయాల్ సే భజన్ తక్ విత్ దిల్షాద్ ఖాన్
- డ్యుయోలాగ్ ఇన్ రాగా
- ఫ్రమ్ డాన్ అంటిల్ నైట్
- సింప్లీ డివైన్
- సఫర్
- పార్ ఎక్సలెన్స్
- జెన్ హార్మనీ
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ఈమె పాడిన పాటలున్న సినిమాల పాక్షిక జాబితా:
- పాకీజా
- దో బూంద్ పానీ
- పర్వానా
- ముక్తి ఆస్మ్(అస్సామీస్)
- సోన్మా (అస్సామీస్)
- ఖోజ్
- రజియా సుల్తాన్
- ఆశ్రయ్
- తోఫా మొహబ్బత్ కా
- షాదీ కర్ లో
- విజేత
- కళంకిణి కనకబతి (బెంగాలి)
- శారద
- ఖుద్రత్
- అన్‌మోల్
- గదర్: ఏక్ ప్రేమ్ కథా
- 1920
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "About Ourselves:-Begum Parween Sulatana". Archived from the original on 2016-07-24. Retrieved 2017-04-25.
- ↑ পাৰবীন চুলতানা, ধ্ৰুপদী সংগীতৰ প্ৰসিদ্ধ শিল্পী, বহুমুখ, Ajir Asom's Wednesday Special Edition, 16 May, 2012
- ↑ Express Features Service (30 August 2008). "Malhar Magic". Express India. Archived from the original on 21 సెప్టెంబరు 2012. Retrieved 5 June 2012.
- ↑ profile in "swara ganga muisc foundation"[permanent dead link]
- ↑ "MINISTRY OF HOME AFFAIRS (Public Section) Padma Awards Directory (1954-2014) Year-Wise List" (PDF). Archived from the original (PDF) on 2016-11-15. Retrieved 2017-04-25.
- ↑ "list of sangeetha nataka academy awardees- official website". Archived from the original on 2016-03-31. Retrieved 2017-04-25.
- ↑ "Padma Awards Announced". Press Information Bureau, Ministry of Home Affairs. 25 January 2014. Retrieved 26 January 2014.
- ↑ discography of parween sultana
బయటి లింకులు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పర్వీన్ సుల్తానా పేజీ
- All articles with dead external links
- Pages using div col with unknown parameters
- Wikipedia articles with MusicBrainz identifiers
- హిందుస్థానీ సంగీత గాయకులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- 1950 జననాలు
- భారతీయ ముస్లింలు
- జీవిస్తున్న ప్రజలు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- భారతీయ మహిళా గాయకులు
- భారతీయ సినిమా నేపథ్యగాయకులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- హిందీ సినిమా నేపథ్యగాయకులు