నాగావ్
నాగావ్
నౌగాంగ్ | |
---|---|
నగరం | |
Coordinates: 26°21′01″N 92°40′47″E / 26.3503828°N 92.6795912°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | నాగావ్ జిల్లా |
Government | |
• Body | నాగావ్ పురపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | అస్సామీ, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 782001 to 782003 |
టెలిఫోన్ కోడ్ | 03672 |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్ 02 |
నాగావ్ (నౌగాంగ్ ), అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలోని ఒక నగరం, పురపాలక సంస్థ. దీని జనాభా 147,231గా ఉంది. ఇది తూర్పు గువహాటికి 121 కి.మీ. (75 మైళ్ళ) ల దూరంలో ఉంది. నాగాన్ నగరంలో మొత్తం అక్షరాస్యులు 98,068 ఉండగా, అందులో 52,690 మంది పురుషులు కాగా, 45,378 మంది మహిళలు ఉన్నారు. నాగాన్ నగరంలో సగటు అక్షరాస్యత 93.43 శాతంగా ఉండగా, ఇందులో స్త్రీ, పురుషుల అక్షరాస్యత 98.58, 88.08 శాతంగా ఉంది.
నాగాన్ నగరం పురపాలక సంస్థ ఆధీనంలో ఉంటుంది. ఇది నాగాన్ అర్బన్ అగ్లోమెరేషన్ పరిధిలోకి వస్తుంది. గువహాటి, సిల్చార్, దిబ్రుగర్ నగరాల తరువాత జనాభా, విస్తీర్ణం పరంగా ఇది అస్సాం రాష్ట్రంలోని 4వ అతిపెద్ద నగరం. ఇది శ్రీమంత శంకర దేవ జన్మస్థలం.
భౌగోళికం
[మార్చు]బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా ఉన్న కోలాంగ్ నది ఈ నాగావ్ నగరం మీదుగా ప్రవహిస్తోంది. కోలాంగ్ నది ఈ నగరాన్ని నాగావ్, హైబర్గావ్ అనే రెండు విభిన్న ప్రాంతాలుగా విభజిస్తోంది. నాగావ్ నగరానికి ఉత్తరాన సోనిత్పూర్ జిల్లా, బ్రహ్మపుత్ర నది సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ కార్బి ఆంగ్లాంగ్ జిల్లా, దిమా హసాయో, హోజాయ్ జిల్లాకు సరిహద్దుగా ఉన్నాయి. తూర్పున తూర్పు కార్బి ఆంగ్లాంగ్ జిల్లా, గోలాఘాట్ జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. పశ్చిమాన మారిగావ్ జిల్లా సరిహద్దుగా ఉంది.
జిల్లాలో అనేక ప్రాంతాలలో బీళ్ళు, చిత్తడి ప్రాంతాలు, చిత్తడి నేలలు ఉన్నాయి. వీటిలో మరికాలంగ్, పొటకాలంగ్, హరిభాంగా, జోంగల్‌బాలాహు, సమగురి బీల్, గతంగ బీల్ ఉరిగాఢంగ్, నవ్‌బాంగా ప్రాంతాలు ఉన్నాయి. ఈ చిత్తడి నేలలు కోలాంగ్, కోపిలి నదుల పూర్వ కాలువలకు సంబంధించినవి.
రవాణా
[మార్చు]రోడ్డుమార్గం
[మార్చు]జాతీయ రహదారి 36, 37లతో ఈ నాగాన్ నగరం కలుపబడి జాతీయ రహదారి వ్యవస్థలో విలీనం చేయబడింది. దీనిద్వారా అస్సాంలోని ముఖ్యమైన ప్రదేశాలకు సులభంగా చేరుకోవచ్చు. నాగావ్ నగరం నుండి అస్సాంలోని అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ బస్సులు నడుపబడుతున్నాయి.
రైల్వేమార్గం
[మార్చు]నగరంలోని హైబోర్గావ్ (ధింగ్ గేట్), నాగాన్ ప్రాంతాలలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సమీప రైల్వే జంక్షన్ సెన్సువా, మరొకటి చపర్ముఖ్ వద్ద ఉంది.
విమానాశ్రయం
[మార్చు]తేజ్‌పూర్ విమానాశ్రయం నగరానికి సమీపంలో ఉంది. గువహాటిలో లోక్ ప్రియా గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
జనాభా
[మార్చు]2011నాటి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం[1] ఈ నగరంలో 147,231 జనాభా ఉంది. ఇది అస్సాం రాష్ట్రంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. కర్బీ, తివా (లాలుంగ్) వంటి గిరిజన వర్గాలతో పాటు స్వదేశీ అస్సామీ వర్గాలు నగరవాసులు ఉన్నారు.
రాజకీయాలు
[మార్చు]నాగావ్ నగరం నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[2]
విద్య
[మార్చు]మొట్టమొదటిసారిగా పంతొమ్మిదవ శతాబ్దంలో మైల్స్ బ్రోన్సన్, నాథన్ బ్రౌన్ వంటి క్రైస్తవ మిషనరీలతో జిల్లాలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టారు. అస్సామీ సాహిత్యంలో ప్రధాన వ్యక్తి అయిన ఆనందరాం ధేకియల్ ఫుకాన్ తన జీవితంలో ఎక్కువ భాగం నాగావ్‌లో గడిపాడు, అస్సామీ మేధావి గుణభిరామ్ బారువా నాగాన్‌లో సుమారు రెండు దశాబ్దాలు పనిచేశాడు.
పాఠశాలలు
[మార్చు]1846లో మైల్స్ బ్రోన్సన్ చేత స్థాపించబడిన నౌగాంగ్ మిషన్ హై స్కూల్ అస్సాంలోని పురాతన పాఠశాల. అస్సాంలో మూడవ పురాతన ప్రభుత్వ పాఠశాలగా 1865లో నౌగాంగ్ ప్రభుత్వ బాలుర ఉన్నత మాధ్యమిక పాఠశాల స్థాపించబడింది. డాసన్ హయ్యర్ సెకండరీ & మల్టీపర్పస్ స్కూల్ కూడా పురాతన పాఠశాల. కేంద్రీయ విద్యాలయ నాగాన్, లయోలా హైస్కూల్, క్రైస్ట్ జ్యోతి పాఠశాలల ఉత్తమ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా ఉన్నాయి. హైబర్గావ్ బజార్ సమీపంలో ఉన్న మార్వారీ హిందీ హై స్కూల్ ఉత్తమ హిందీ పాఠశాలగా ఉంది.
పేరున్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు :
- కేంద్రీయ విద్యాలయం, నాగాన్ Archived 2019-09-30 at the Wayback Machine
- క్రీస్తుజ్యోతి పాఠశాల
- నౌగాంగ్ మిషన్ హైస్కూల్
- సెయింట్ ఇగ్నేషియస్ లయోలా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్
- సెయింట్ ఆంటోనీస్ హైస్కూల్
- లిటిల్ ఫ్లవర్ స్కూల్
- మోడల్ ఇంగ్లీష్ స్కూల్
- నాగాన్ ఇంగ్లీష్ అకాడమీ
- సందీపణి విద్యామందిర్
- రివర్‌డేల్ అకాడమీ
పేరున్న ఇతర పాఠశాలలు:
- నాగాన్ శంకర్ దేవ్ విద్యానికేతన్
- నేషనల్ అకాడమీ నాగాన్
- నౌగాంగ్ ప్రభుత్వ బాలుర ఉన్నత మాధ్యమిక పాఠశాల
- నౌగాంగ్ ప్రభుత్వ బాలికల ఉన్నత మాధ్యమిక పాఠశాల
- నాగాన్ బెంగాలీ బాలుర ఉన్నత మాధ్యమిక పాఠశాల
- నాగాన్ బెంగాలీ బాలికల ఉన్నత మాధ్యమిక పాఠశాల
- ప్రభుత్వ పట్టణ ప్రాథమిక పాఠశాల
- డాసన్ హయ్యర్ సెకండరీ, మల్టీపర్పస్ స్కూల్
- ఓం ప్రకాష్ జాజోడియా బాలికల హిందీ హైస్కూల్
- మార్వారీ హిందీ ఉన్నత పాఠశాల
- నవరూప్ జాతియా విద్యాపీఠ్
- హైబర్గావ్ ఆదర్శ హైస్కూల్
కళాశాలలు
[మార్చు]- నౌగాంగ్ కళాశాల
- ఆనందరాం ధేకియల్ ఫూకాన్ కళాశాల Archived 2020-12-02 at the Wayback Machine
- ఖగారిజన్ కళాశాల Archived 2021-02-27 at the Wayback Machine
- నౌగాంగ్ బాలికల కళాశాల Archived 2020-07-02 at the Wayback Machine
- నౌగాంగ్ న్యాయ కళాశాల
- నాగాన్ జిఎన్‌డిజి కామర్స్ కళాశాల Archived 2017-10-23 at the Wayback Machine
- పయనీర్ ఆర్ట్స్ కళాశాల
- కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాగాన్
- రామానుజన్ జూనియర్ కళాశాల
- కాన్సెప్ట్ జూనియర్ కళాశాల
- పునరుజ్జీవన జూనియర్ కళాశాల Archived 2018-07-11 at the Wayback Machine
- ఆల్ఫా బీటా జూనియర్ కళాశాల
- కలోంగ్-కపిలి విద్యాపీఠ్ జూనియర్ కళాశాల
- కలోంగ్‌పార్ విద్యాపీఠ్ జూనియర్ కళాశాల Archived 2020-10-25 at the Wayback Machine
- భరాలి అకాడమీ జూనియర్ కళాశాల
- నాగాన్ జూనియర్ కళాశాల
- శ్రీమంత శంకర్ దేవ్ జూనియర్ కళాశాల
- మాధబ్‌దేవ్ జూనియర్ కళాశాల
- గీతాంజలి జూనియర్ కళాశాల
- ద్రోణాచార్య జూనియర్ కళాశాల
- చాణక్య జూనియర్ కళాశాల
- మ్యాట్రిక్స్ జూనియర్ కళాశాల
- డైమెన్షన్ జూనియర్ కళాశాల Archived 2020-11-13 at the Wayback Machine
- జ్ఞాన్పిత్ జూనియర్ కళాశాల
- సి.వి.రామన్ జూనియర్ కళాశాల
- డా. ఎస్.ఆర్.కె జూనియర్ కళాశాల
- ఆనందరం బరువా జూనియర్ కళాశాల
- కమల కాంతా బారువా జూనియర్ కళాశాల
- నోనోయి జూనియర్ కళాశాల
- అభిజ్ఞన్ జూనియర్ కళాశాల
- దాస్వానీ డొమైన్ అకాడమీ
అస్సాం హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి
[మార్చు]నాగావ్‌లోని హైబర్గావ్‌లో ఈఅస్సాం హోమియోపతి కళాశాల ఉంది. ఇది 1968 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది మొత్తం ఈశాన్య భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి హోమియో వైద్య కళాశాల.
నౌగాంగ్ పాలిటెక్నిక్
[మార్చు]అస్సాంలోని పురాతన సాంకేతిక విద్యా సంస్థలలో ఒకటైన నౌగాంగ్ పాలిటెక్నిక్ Archived 2020-10-25 at the Wayback Machine నాగావ్ నగరంలో ఉంది. నాగావ్‌కు పానిగావ్‌లో ఐటిఐ కూడా ఉంది.
ఫిషరీస్ కళాశాల
[మార్చు]మొత్తం ఈశాన్య భారతదేశంలో ఉన్న ఏకైక ఫిషరీస్ కళాశాల రాహాలో ఉంది. ఇది జోర్హాట్ లోని అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయ అకాడెమిక్ మేనేజ్మెంట్ పరిధిలోకి వస్తుంది.
నాగాన్ వైద్య కళాశాల
[మార్చు]2016, ఫిబ్రవరిలో అప్పటి అస్సాం ముఖ్యమంత్రి శ్రీ తరుణ్ గొగోయ్ నాగాన్ వైద్య కళాశాలకి పునాది రాయిని వేశారు. దీని నిర్మాణ పనులు అధికారికంగా 2017, ఫిబ్రవరి 18 నుండి ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల్లో కళాశాల నిర్మాణం పూర్తవుతుంది.
విశ్వవిద్యాలయం
[మార్చు]నాగన్ నగరంలో ప్రతిష్ఠాత్మక మహాపురుష శ్రీమంత శంకరదేవ విశ్వవిదాలయం ఉంది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ స్థాయి కోర్సులు ఉన్నాయి.
ముఖ్యమైన ప్రాంతాలు
[మార్చు]- డింగ్ గేట్
- హైబర్గావ్
- శాంతిపూర్
- లాఖోవా రోడ్
- చంద్మరి రోడ్
- సమద్దర్ పాటీ
- బారా బజార్
- దక్కపట్టి
- నాటున్ బజార్
- జూరియా
- ఇటాచలి
- క్రిస్టియన్ పాటీ
- పానిగావ్
- అమోలపట్టి
- ముకుత్ శర్మ చారియాలి
- బెంగాలీ పాటీ
- ఫౌజ్‌దారీ పాటీ
- చినపట్టి
- మోరికోలోంగ్
- కచులుఖువా
- ఖుటికాటియా
- లఖినగర్
- తరుణ్ ఫుకాన్ రోడ్
- సెంచోవా
- ప్రేమ్ నగర్
- దిమరుగురి
- ఉరియా గావ్
- బోర్ఘాట్
- చోకిటప్
- మౌఖులి
- డిఫోలు
- హటిచుంగ్
- జజోరి
- మజ్ జాజోరి
- డింగ్
- దక్షిణపట్
- పాథోరి
- నోనోయి
క్రీడలు
[మార్చు]నాగాన్ నగరంలోని నూరుల్ అమిన్ స్టేడియానికి క్రీడాకారుడు దివంగత నూరుల్ అమిన్ పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరులలో ప్రతిష్ఠాత్మక స్వాతంత్ర్య దినోత్సవ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ఈ స్టేడియంలో జరుగుతుంది. ఇందులో జాతీయస్థాయిలో పేరొందిన జట్లు చాలా వరకు పాల్గొంటాయి. ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్20 ఛాంపియన్‌షిప్‌లో ట్రాక్ ఈవెంట్‌లో భారత స్ప్రింటర్, బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్ హిమదాస్ నాగావ్‌లో జన్మించింది.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- శ్రీమంత శంకర్ దేవ్ (సెయింట్)
- దేవ్ కాంత్ బారువా (రాజకీయవేత్త)
- గోపీనాథ్ బొర్దొలాయి, (అస్సాం మొదటి ముఖ్యమంత్రి)
- మహీం బోరా (రచయిత)
- మయూర్ బోరా (రచయిత)
- భబేంద్ర నాథ్ సైకియా (రచయిత, దర్శకుడు, సంపాదకుడు)
- లక్ష్మి నందన్ బోరా (నవలా రచయిత)
- లక్ష్మీనాథ్ బెజ్బరోవా (కవి, నవలా రచయిత)
- ఖాగెన్ మహంత (గాయకుడు)
- పబిత్ర కుమార్ దేకా (జర్నలిస్టు, హాస్య రచయిత)
- పర్వీన్ సుల్తానా (శాస్త్రీయ గాయని)
- ప్రఫుల్ల కుమార్ మహంత (రాజకీయవేత్త)
- జతిన్ బోరా (నటుడు)
- పాపోన్ (గాయకుడు, సంగీతకారుడు)
- హిమదాస్ (అథ్లెటిక్స్)
- సౌమర్ సుర్జ్య భ్రాలి (రచయిత)
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-11-07.
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-11-07.