Jump to content

దిమా హసాయో జిల్లా

వికీపీడియా నుండి
Dima Hasao District
ডিমা হাছাও জিলা
district
దిమా హసాయో జిల్లాలో బరైల్ కోండలు
దిమా హసాయో జిల్లాలో బరైల్ కోండలు
Countryభారత దేశం
రాష్ట్రంAssam
జిల్లాDima Hasao District
ప్రధాన కార్యాలయంHaflong
District created02-02-1970
Government
 • TypeAutonomous
 • BodyDima Hasao Autonomous Council(DHAC)
 • Chief Executive Member ( CEM )Debojeet Thaosen
విస్తీర్ణం
 • Total4,890 కి.మీ2 (1,890 చ. మై)
Elevation
513 మీ (1,683 అ.)
జనాభా
 (2011)
 • Total2,13,529
 • జనసాంద్రత43.667/కి.మీ2 (113.10/చ. మై.)
భాషలు
 • అధికారAssamese
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
788XXX
టెలిఫోన్ కోడ్91 - (0) 03673
Vehicle registrationAS-08

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో దిమా హసాయో జిల్లా (అస్సామీ: ডিমা হাছাও জিলা) ఒకటి. గతంలో ఇది ఉత్తర కచార్ జిల్లాగా (అస్సామీ: উত্তৰ কাছাৰ পাৰ্বত্য জিলা) పిలువబడేది. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా అస్సాం రాష్ట్రంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

దింసా అంటే రాజరిక వంశావళి పేరు. హసాయో అంటే దింసా భాషలో కొండలు. దింసా హసాయో అంటే దింసా కొండలు అని పూర్తి అర్ధం.

చరిత్ర

[మార్చు]

1832 వరకు జిల్లా కచారీ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. లూషై హిల్స్ దక్షిణ దిశ నుండి జమునా నది ఉత్తరతీరం వరకు, పశ్చిమ దిశలో కోపిల్ వరకు, తూర్పు దిశగా అంగమి & కత్చా నాగా హిల్స్ (ధంసిరి) ఈ నగరం విస్తరించి ఉంది. దింసా, కచారీ రాజులకు దిమాపూర్, మైబాంగ్, కాష్పూర్, హొరితికొర్ రాజధానిగా ఉండేది.

బ్రిటిష్

[మార్చు]

1830లో దింసా రాజు గోబింద తన స్వంత సైన్యాధ్యక్షుడు జనరల్ గంభీర్ సింగ్ చేత కాల్చి చంపబడ్డాడు. తరువాత 1842 ఆగస్టు 14న లప్సి ఆఙతో దింసా రాజ్య దక్షిణభూభాగాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంతో కలుపబడింది. మిగిలిన భూభాగాన్ని చివరి దింసా సైన్యాధ్యక్షుడు తులారాం పాలించాడు. 1837లో తులారాం రాజ్యంలో ఒక భాగం అదనంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపబడింది. ఈ భూభాగాన్ని 1837లో నాగావ్ జిల్లాగా చేసి జిల్లాకేంద్రంగా అసలు నిర్ణయించబడింది. 1854 తులారాం మరణించిన తరువాత మిగిలిన దింసా రాజ్యం అంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపబడి అసలు సబ్‌డివిషనుకు చేర్చబడింది. 1867లో సబ్‌డివిషన్ ఉపసంహారించబడి 4 జిల్లాలుగా (కచార్, కాశి, జెంతీ హిల్స్, నాగావ్) విభజించబడింది. కచార్ జిల్లాతో ఉత్తర కచార్ భూభాగం కలుపబడింది. అసలు వద్ద మాత్రమే ఒక పోలీస్ ఔట్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయబడింది. 1880లో ఈ ప్రాంతం గుంజంగ్ కేంద్రంగా ఉపవిభాగంగా మార్చబడింది.

భూభాగ విభజన

[మార్చు]

1895లో జిల్లాకేంద్రం హఫ్లాంగ్‌ పట్టణానికి మార్చబడింది. తరువాత హాఫ్లాంగ్ నిరంతరంగా జిల్లాకేంద్రంగా పనిచేస్తుంది.

జిల్లా రూపకల్పన

[మార్చు]

1970 ఫిబ్రవరి 2 న దిమా హిసాయో జిల్లాగా ప్రకటించబడింది.

భౌగోళికం

[మార్చు]
దిమా హసాయో జిల్లా కేంద్రం హఫ్లాంగ్ వద్ద దయంగ్ నది పైన పాత రైలు వంతెన

దిమా హసాయో జిల్లా కేంద్రంగా హఫ్‌లాంగ్ ఉంది. దింసాహసాయో జిల్లా వైశాల్యం 4888చ.కి.మీ., [2] వైశాల్యపరంగా జిల్లా బ్రెజిల్ లోని ఈహా గార్డెన్ డూ గురుప వైశాల్యంతో సమానం.[3] అస్సాంలో ఈ జిల్లా వైశాల్యపరంగా 3 వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు జిల్లాలు తూర్పుకర్బి ఆంగ్లాంగ్, సోనిత్‌పూర్ ఉన్నాయి. దింసా హసాయో ఈశాన్య సరిహద్దులో కర్బి ఆంగ్లాంగ్, సరిహద్దులో నాగాలాండ్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో మణిపూర్ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో నాగావ్ జిల్లా, నైరుతీ సరిహద్దులో పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్, పశ్చిమ సరిహద్దులో మేఘాలయ రాష్ట్రం, సరిహద్దులో కచార్ జిల్లాలు ఉన్నాయి.

రాజకీయాలు

[మార్చు]

దింసా హసాయో జిల్లా ఒక అటానిమస్ జిల్లా. ఈ జిల్లాకు 6వ కంస్టిట్యూషన్ హక్కులను కలిగి ఉంది. జిల్లా పాలనా బాధ్యతలను " దింసా హసాయో అటానిమస్ కౌంసిల్ " వహిస్తాడు. అటానిమస్ కౌందిల్ సభ్యులు ప్రజలచేత ఎన్నుకొనబడతారు. అటానిమస్ ప్రభుత్వశాఖల మీద అధికారం కలిగి ఉంటుంది. పోలీస్ శాఖ, చట్టం పరిరక్షణ అటానిమస్కౌంసిల్ అధికారపరిధికి అతీతంగా పనిచేస్తుంది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దిమా హిసాయో జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] . బ్యాక్ వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 213,529, [1]
ఇది దాదాపు. సమోయా దేశ జనసంఖ్యకు సమానం..[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 588వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 44 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.53%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 931:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 78.99%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
  • దింస, జెమే నాగాలు, హ్మార్లు, కుకీలు, బియాట్లు, హ్రంగ్ఖ్వాల్స్, వైఫీలు, కర్బీ, ఖసి-ప్నార్స్, ఖెల్ములు.

భాషలు

[మార్చు]

జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో ప్రధానమైనవి దింసా, అస్సామీ, హ్మర్, హ్రంగ్ఖోల్, కుక్షి, బైటే, ఖెల్మ, హఫ్లాంగ్ హిందీ, బెంగాలీ వంటి ఇండో ఆర్యన్ భాషలు ప్రధానమైనవి. [6]

సంస్కృతి

[మార్చు]

దింసా హసాయో జిల్లా సాంస్కృతిక వైవిధ్యం కలిగినది. జిల్లా ప్రజలలో పలు గిరిజనజాతి ప్రజలు ఉన్నారు. అలాగే వైవిధ్యంగా ఉండే స్వంత భాషాయాస, సంస్కృతి, అలవాట్లు, ఆచారాలు కలిగిన ప్రజలు నివసిస్తున్నారు. గిరిజన ప్రజలతో గిరిజనేతర ప్రజలు కూడా గుర్తించతగినంతగా నివసిస్తున్నారు. గిరిజనేతరులలో అత్యధికులు ఉద్యోగులు, వ్యాపారులు, పశువిక్రేతలు నరం, నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. సూదరమైన గ్రామప్రాంతాలలో అందమైన - ఆదరణ, అంకితభావం, వర్ణరంజితమైన జీవన వైవిధ్యం కలిగిన గిరిజన ప్రజలు నివసిస్తున్నారు.

వీరిలో ప్రధాన తెగలు : దింసా,

దింసా కచారీలు

[మార్చు]

దింసా కచారీలు ఈశాన్య భారతం అంతటా విస్తరించి ఉన్నారు. వీరు బ్రహ్మపుత్ర లోయలో మొదటిగా స్థిరపడ్డారు. కచారీలు ఇండో- మొంగొలాయిడ్ (కిరాత) సమూహానికి చెందినవారని భావిస్తున్నారు. వీరు బోడో, వారికి సంబంధిత గిరిజన జాతులకు చెందిన వారని భావిస్తున్నారు. మొంగొలాయిడ్ ప్రజలు ఎత్తైన బుగ్గల ఎముకలు, చిన్న నేత్రాలు స్వల్పంగా పెరిగిన వెంట్రుకలతో కూడిన శరీరాలు, చిన్న గడ్డాలు కలిగి ఉంటారు. వారిని వారు బ్రహ్మపుత్రా లోయలో బోడో లేక బోడో - ఫిసా అని చెప్పుకుంటారు. అలాగే కచార్, కర్బి- ఆంగ్లాంగ్ జిల్లాలో నివసించే తమని తాము దింసా - ఫిసా లేక సంస్ ఆఫ్ ది గ్రేట్ రివర్ అని చెప్పుకుంటారు. దింసా కచారీలు అధికంగా ఉత్తర దింసా హాసాయో జిల్లా, జంతిగా లోయ, సమీప భూభాగంలో నివసిస్తూ ఉన్నారు. .

దింసా ప్రజలు మాదైని అత్యున్నత శక్తిగా (దైవం) భావిస్తారు. మాదైకి అనుయాయులుగా పలు మాదైలు ఉంటారు. ఇంటి ఇలవేల్పు, ప్రేతాత్మలు కూడా ఉంటాయి. దైకో విధానంలో దింసా ప్రజల మతాచారాలు ప్రతిఫలిస్తుంటాయి. డైఖొ న్యాయాధికారం కలిగిన దైవీక ప్రతినిధి ఆయనను పలువురు శిష్యులు (ఖెల్) అనుసరిస్తుంటారు. ప్రతి దింసా కచారీ కుటుంబం వారి పూర్వీకులను దైవంగాభావించి పూజిస్తుంటారు. వారు వరిపంటను నాటడానికి ముందుగా పూర్వీకులకు పూజలు నిర్వహిస్తుంటారు. దీనిని మాదై ఖెలింబా అంటారు. కుటుంబ సంక్షేమానికి ఈ పూజను నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ ఇది మొత్తం సమూహానికి కూడా క్షేమం కలిగిస్తుందని విశ్వసిస్తారు.

మరణ సంస్కారం

[మార్చు]

దింసా ప్రజలు మరణించినప్పుడు వారిశరీరాలను శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రాలతో అలంకరించి శరీరాన్ని ఇంట్లో చాపమీద పడుకోబెడతారు. ఒక కోడిని చంపి చనిపోయిన వారి కాళ్ళదగ్గర పెడతారు. కోడి చనిపోయిన వారి ఆత్మలకు దేవుడి వద్దకు (స్వర్గానికి) పోవడానికి మార్గం చూపగలదని వారు విశ్వసిస్తారు. చపోయిన పురుషుని భార్య మరణసంస్కారం పూర్తి చేసేవరకు వెంట్రుకలను ముడివేయదు. చనిపోయిన శరీరాన్ని జలప్రవాహం వెంట పూడ్చిపెడతారు.

గృహాలు

[మార్చు]

దింసా ప్రజలు వారిగృహాలను పర్వతసానువులలో జలప్రవాహం సమీపంలో నిర్మించుకుంటారు. మట్టితో నిర్మించబడే ఈ గృహాలు ఒకదానికి ఎదురుగా ఒకటిగా 2 వరుసలుగా నిర్మించబడతాయి. ఒక గృహానికి మరొక గృహానికి మద్య ఖాళీ ప్రదేశం వదిలి నిర్మించబడుతుంది. హాంగ్‌సాయో అనే వ్యవస్థ సాయంతో వారు వ్యవసాయపు పనులను నిర్వహిస్తుంటారు. ఈ వ్యస్థలో యువతీయువకులు కలిసి మెలిసి పొలంపనులు చేస్తుంటారు. వీరు ఒకరి పొలం తరువాత ఒకటిగా అందరి పొలం పనులు పూర్తి చేస్తారు. వీరు సంవత్సరానికి ఒకసారి కొంతకాలం మాత్రమే విశ్రాంతి తీసుకుంటారు.

కళలు

[మార్చు]

దింసా కచారీ ప్రజల జీవితంలో సంగీతం, నృత్యం ప్రధానపాత్ర వహిస్తుంది. బషు, హంగ్‌సో పండుగ సందర్భంలో యువత వారి గృహాలు లేక నద్రాంగ్ లేక గజైబౌ ప్రాంగణంలో ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తుంటారు. పండుగ సందర్భంలో పండుగ నిర్వహినే గృహ యజమానురాలిని " గజైబౌ " అని పిలుస్తారు.

  • పండుగ సందర్భంలో మురి, మురి-వత్సియా, సుపిన్ ఖ్రం, ఖ్రందుబంగ్ మొదలైన వాయిద్యాలను ఉపయోగిస్తారు.
  • దింసా ప్రజలలో బైడిమా, జౌబని, జౌపింబని, రెంగింబని, బైచర్గి, కున్లుబని, దైస్లేలైబని, కమౌతల్కిం, కౌబని, నానాబైరిబని, బౌరుర్నింజా, కైలైబని, హొమౌదయోబని, రొంగ్జైబని, దౌసిపమైకబని, దౌడ్నిగ్జంగ్, దైలైబని, నరింబని, రొంగిడా బిహిమైయాడో, మజౌబని, మైసుబనై, రిచిబ్బని, మిచై బొంతై జబాని, హొమొజింగ్ లదైబని, బెర్మా చరాయో పైబని, మంగుషా బొండైబని, మదైకలిబని మొదలైన నృత్యరీతులు ఉన్నాయి.
  • పురుషులు సంప్రదాయ నృత్యాలను చేసే సమయంలో రిచా, రిచయోసా, పగురి రించౌ, రించయోరామై అనే సంప్రదాయ వస్త్రాలను ధరిస్తుంటారు. స్త్రీలు రిగు, రిజంఫిని, రిజంఫినాబెరన్, రికౌచా, రిఖ్రా, జింగ్సుదు మొదలైన సంప్రదాయ వస్త్రాలను ధరిస్తుంటారు.
  • కౌడిమా, ఖడు, కమౌతై, లొంగ్‌బార్, పన్లౌబర్, చంద్రలాల్, రొంగ్బర్చా, ఎంగ్రాస, జంగ్సమ, లిగ్జయో, జింగ్బ్రి, యౌసిదాం మొదలైన ఆభరణాలు ధరిస్తుంటారు.
  • దింసా నృత్యాలు పలు విధాలుగా ఉంటాయి. అవి పూర్తిగా సంగీత పరికరాల మీద ఆధారపడి ఉంటుంది. పాటలు మాత్రం ఉండవు. ఖ్రం (డ్రం), మురి (ఫిఫ్), నృత్యకారులు ఈ నృత్యాలలో ప్రధాన పాత్ర వహిస్తారు. యువత నాద్రంగ్ ప్రాంగణంలో నృత్యాలు అభ్యాసం చేస్తుంటారు. గ్రామీణ బాలురు వారిని అనుసరిస్తూ అడుగులు వేస్తూ ఆనందిస్తుంటారు.

జెం నాగాలు

[మార్చు]

దింసా హసాయో జిల్లాలో జెంనాగాలు గుర్తినతగినంతగా ఉన్నారు. జిల్లాలో వీరు మణిపూర్, నాగాలాండ్ రాష్ట్ర సరిహద్దులో అధికంగా ఉన్నారు. మానవజాతి శాస్త్రకారులు వీరు కచానాగాల ఉపజాతికి చెందినవారని భావిస్తున్నారు. నాగాలాండ్‌లో నివసిస్తున్న జెంనాగాలు తమను తాము జెలియాంగ్ అని చెప్పుకుంటారు. మణిపూర్ సరిహద్దులో ఉన్న జెంనాగాలు తమనుతాము జెలియంగ్రాంగ్ అని చెప్పుకుంటారు.

జెమ్నాగాలు నాగాలాండ్ నుండి మణిపూర్ మీదుగా వచ్చి ఉత్తర కచార్ జిల్లాలో ఈశాన్యప్రాంతంలో కచారీ రాజుల పురాతన రాజధానిలో స్థిరపడ్డారు. వీరు కొపిలి నదీతీరం వెంట తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. కచారీల ప్రభావం క్షీణించిన తరువాత జెంనాగాలు పొరుగున ఉన్న శక్తిమంతులైన అంగమి నాగాల దోపిడీకి గురైయ్యారు. ఫలితంగా జెంనాగాలలో కొందరు పశ్చిమదిశగా పయనించి డియంగ్ లోయలో స్థిరపడ్డారు. వారికి వారి స్వంత యాసతో కూడిన భాష ఉంది. అలాగే జెంనాగాలు దింసా కచారీ, కుకి, హ్మర్ ప్రజలతో గత రెండు దశాబ్ధాలుగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. జెంనాగాలు మంచి రంగు వత్తైన జుట్టుతో ఆరోగ్యంగా ఉంటారు. జెంనాగాలలో 6 తెగలు ఉంటాయి: నపమె, న్కుమె, హెన్యుమె, న్రియామే, సొగమే, పన్మ. నపమే, న్కుమే ప్రజలు ఒకే వంశానికి చెందినవారు కనుక వారి మద్య వివాహ సంబంధాలు ఉండవు. మిథున్ ప్రజలలో వివాహసమయంలో వధువు తల్లి తండ్రులకు వరుని తల్లితండ్రులు కన్యాశుల్కం చెల్లించాలి.

జెం నాగాలలో విగ్రహారాధన లేదు. వారు దేవుడు స్వర్వశక్తివంతుడని విశ్వసిస్తారు. దేవుని ఆధీనంలో జలం, ఆరోగ్యం వంటి శక్తులు ఉంటాయని విశ్వసిస్తున్నారు. వారు మాంత్రీకం, గారడీ విద్యను విశ్వసిస్తారు. వారు పిశాచాల లోకం ఉందని విశ్వసిస్తుంటారు. మనిషి మరణించిన తరువాత ఈ లోకానికి పోతాడని అక్కడ ఆహారం స్వీకరిస్తాడని విశ్వసిస్తారు. అందువలన వారు విందులలోవారి పూర్వీకుల కొరకు పిశాచాలకు ఒక బుట్టలో ఆహారం నిపుతారు. మరణించిన వారి శరీరాన్ని శవపేటికలో ఉంచి భ్హుమిలో పెట్టి దాని మీద సమాధి కట్టి దానిమీద కొన్ని గుర్తులు ఉంచుతారు. .

గ్రామాలు

[మార్చు]

జెంనాగాల గ్రామాలు కొండశిఖరం మీద నిర్మించబడతాయి. ఒక్కో గ్రామంలో యువతీ యువకుల కొరకు శయనశాలలు ఉంటాయి. యువకులు నివసించే శయనశాలలను " హంగ్సెయుకి ", యువతులు నివసించే శయనశాలలను " లంగ్సెయుకి " అంటారు. అవివాహిత యువతీయువకులు ఈ శయనశాలలలో నిద్రిస్తారు. వివాహం కాగానే యువతి కాని యువకుడు కాని శయనశాలను వదిలి పెడతారు. ఈ శయనశాలలు గ్రామీణ వినోదకేంద్రాలుగా పనిచేస్తుంటాయి. యువతులు అల్లిక, నేత, సంగీతం, నృత్యం నేర్చుకుంటుంటారు. యువకులు శయనశాలలలో మల్లయుద్ధం, వేట, హస్థకళలు నేర్చుకుంటుంటారు. ఈ శయనశాలలు అతిథిగృహాలుగా కూడా ఉపయోగపడుతుంటాయి.

జెం నాగాలలో కొందరు క్రైస్తమతాన్ని స్వీకరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికీ పురాతన ఆచారాలను అనుసరిస్తున్నారు. వీరి పండుగలు, సాంఘిక ఆచారాలు వ్యవసాయ సంబంధితమై ఉంటాయి. సంవత్సరంలో వీరు 6 పండుగలను జరుపుకుంటుంటారు. శయశాలలు పండుగలను నిర్వహించడంలో ప్రధానపాత్ర వహిస్తాయి. జెం నాగాలకు హెలియిబమె, సంగ్బెమె, ఫొక్ఫత్మి, ఎంగ్కంగి, సియామీ, కహగబ వంటి ప్రధాన పండుగలు ఉన్నాయి. పండుగలన్ని వ్యవసాయానికి సంబంధించి ఉంటాయి.

జానపద కళలు

[మార్చు]
  • జానపద నృత్యాలు : హరిపివెలిం, జొహుంపెసెలిం, కంగుయిబెలిం, కెరప్సప్లిం, హక్లిం, బుచులియం మొదలైనవి.
  • సంగీతవాద్యాలు : ఇచుం, హెంబెయు, ఇన్లుబయి, కెబుయికె, మెటియాహ్, ఇనర్, కుంటోయి, ఇంటో.
  • జెం నాగాలలో పురుషులు ఇంజింగ్ని, హెని, మొఫహై, లౌహెపై, ఖంపెఫై.
  • పురుషులు మోకాళ్ళ కింద బియ్యపు పిండి మిశ్రమంతో అలంకరించుకుని కేన్ రోపులను కట్టుకుంటారు.
  • యువతులు మిని హెగియాంగ్నినె, ఫైమంగ్, ఫైతిక్, లింఫై, వెండి, ఇత్తడి, రంగురంగుల పూసలతో చేసిన ఆభరణాలను, ఈకెలను, కర్ణాభరణాలను ధరిస్తుంటారు.

హర్మర్లు

[మార్చు]

హర్మర్లు చైనా నుండి వలసవచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరు చైనా నుండి బర్మాకు వచ్చి స్థిరపడి అక్కడి నుండి మణిపూర్, మిజోరాం, దిమా హసాయోలో స్థిరపడ్డారు. వీరు మంగోలియన్ జాతికి చెందిన వారు. వీరు ఎక్సోగేమస్ క్లాంస్ (ఇతర తెగలతో వివాహసంబంధాలు) పెట్టుకునేవారు. మొనొగేమీ కూడా కచ్చితంగా అనుసరించే వారు. మొనోగేమీ అంటే ఒక భర్తకు ఒకే భార్య మాత్రం ఉండడం. పెద్దలు అంగీకారంతో ప్రేమవివాహాలను జరపడం ఆదరిస్తారు.

వివాహం

[మార్చు]

హర్మర్ ప్రజలలో కన్యాశుల్కం (నుజుం) వాడుకలో ఉంది. చిన్న కుమార్తెకు అధికంగా కన్యాశుల్కం ఎదురుచూస్తుంటారు. ఒకప్పుడు వీరు అనిమిజం ఆచరించేవారు. వారి దైవం పతియన్ దైవాన్ని శాంతింపజేయడానికి కానుకలు సమర్పిస్తుంటారు. ఇప్పుడు మొత్తం హార్మర్లు క్రైస్తవమతానికి మారారు. వారు గ్రామాలలో చర్చిలు నిర్మించారు. హర్మర్లు వారి గ్రామాలను కొండశిఖరాలలో నిర్మించుకుంటారు. వీరు తమ గృహాలను చెక్కలతో నిర్మించుకుంటారు. వ్యవసాయంలో స్లాష్, బర్న్ విధానం అవలంబిస్తారు.

సంప్రదాయం

[మార్చు]

హర్మర్ ప్రజలు వారి స్వస్థలం నుండి వలస వచ్చి దీర్ఘకాలం అయినప్పటికీ పురాతనమైన వారి వ్యవసాయ సంబంధిత సంస్కృతి, సంప్రదాయ పండుగలు జరుపుకుంటూనే ఉన్నారు. వారి ఆచారాలు ఇతర విధానాలు పూర్వీకతను ప్రతిబింబిస్తుంటాయి. వారి సంప్రదాయం వారి జానపద నృత్యాలలో ప్రతిబింబిస్తుంటుంది. వారి సంగీత పరికరాలలో ఖుయాంగ్ (డ్రం) ప్రధానపాత్ర వహిస్తుంది. ఇతర సంగీత పరికరాలలో ఫెయిట్ (వెదురుతో తయారు చేయబడిన విజిల్), తెయిహ్లెయా (వేణువు), డార్ఖుయాంగ్ (గొంగ్), డర్బు (చిన్న గొంగుల సెట్), డర్మంగ్ (చదునైన ఇత్తడి గొంగ్), సెకి (మిథున్ కొమ్ము సెట్), హ్న ముట్ (లీఫ్ పరికరం), పర్ఖుయాంగ్ (వెదురు గిటార్) మొదలైనవి.

  • హర్మర్లలో తెగలు: లవిత్లాంగ్, జోట్, లంగ్తౌ, తెయిక్, ఖాబంగ్, పఖుయాంగ్, ఫైహ్రైం, దర్ంగవ్, లెయిరి, న్గుర్టే, ఖియింగ్తె, పౌతు, న్జెంటే.
  • గ్రామపెద్దను " లాల్ " అంటారు. లెయిరి, ఫైహ్రుయం తెగలు తప్ప మిగిలిన వారిలో కుటుంబంలో చిన్న కుమారుని " లాల్ " పదవికి ఎన్నుకుంటారు. లాల్ నాయకత్వాన్ని, మార్గదర్శకత్వాన్ని ప్రతి ఒక్కరు ఆచరిస్తారు.

స్త్రీలు

[మార్చు]

హర్మర్ స్త్రీలు చాక్కని నేత పని చేస్తారు. వారు వారి చిన్న మగ్గంతో (లైన్ లూం) అందమైన వస్త్రాలు తయారు చేస్తారు. వారు గృహాలలో తయారు చేసిన నూలుకు వివిధ వర్ణాలను అద్దకం వేస్తారు. వాటితో వారు కుటుంబం కొరకు అందమైన వస్త్రాలను తయారు చేస్తారు. పురుషులు, స్త్రీలు వైవిధ్యమైన దుస్తులు ధరిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన స్త్రీలు సన్నని వస్రాలను (ఆఆం ) ధరిస్తారు. తాన్లొ పుయాన్ స్త్రీలు ధరిస్తారు. తర్లైకాన్ అనే దుస్తులను స్త్రీలు ధరిస్తుంటారు. న్గో త్లాంగ్ అనేది స్త్రీలు ధరించే తెల్లని వస్త్రం, థంగ్సుయో పౌన్ నల్లని, తెల్లని గడులతో నేయబడిన సాధారణ వస్త్రం,

గొప్ప వేటగాళ్ళు, వీరం ప్రదర్శినవారు, " తంగ్సుయో " పేరుతో సత్కరించబడిన వారు ధరించే వస్త్రం, గ్రామీణ సంపన్నులు రుక్రాక్ - పౌన్ వస్త్రం ధరిస్తారు, హర్మర్ పౌన్, దరకి పురుషులు ధరించే పంచ, పైహర్ పురుషుల చద్దర్, లుకాం పురుషులు తలపాగాగా ధరించే సన్నని వస్త్రం, పౌండం పురుషులు ధరించే చద్దర్, పౌన్ - కెర్నెయి గ్రామీణ దాసి స్త్రీలు ధరించే సన్నని వస్త్రం.

పండుగలు

[మార్చు]

హర్మర్లు వ్యవసాయ సబంధిత సిక్పుయిరుయి, బుతుఖుయంగ్లొం పండుగలు జరుపుకుంటారు. వారు దార్‌లం, పార్టన్ లాం నృత్యాలను డ్రమ్ములను రిథమిక్గా చేయడం ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. గొప్ప వేటను ప్రదర్శించిన వీరుని గౌరవార్ధం ఫెయిఫిట్లం నృత్యాన్ని మధురమైన వేణునాథం జతపరుస్తూ ప్రద్ర్శిస్తారు. ఫహ్రల్ టాక్ లాం వెదురు స్తంభాలను వాడుతూ మిజోస్ వలె (ప్రబలమైన చెరా నృత్యం) నర్తిస్తారు.

కళలు

[మార్చు]

హర్మర్లు పంటకోతల సమయంలో పలు నృత్యాలను నర్తిస్తుంటారు. పంట కోతల కోతల సమయంలో చోన్ లాం నృత్యం ప్రదర్శిస్తారు. వేట నృత్యాన్ని సలు లాం అంటారు. ప్రబలమైన తంగ్కవంగ్వలిక్ అనే నృతత్యాన్ని ప్రైవేటుగా ఏర్పాటు చేస్తారు. ఈ నృత్యంలో యువతీ యువకులు సంప్రదాయ దుస్తులను ధరించి, పక్షి ఈకలతో తయారు చేసిన తవన్లయరంగ్ తలపాగాలను లేక లుఖుం (వెదురుతో తయారు చేసినది) ధరించి, హర్మర్ పౌన్ అనే షాల్ ధరించి నర్యిస్తారు. స్త్రీలు కుత్సబి (రింగ్), బంబున్ (గాజులు), నాబ్ (చెవిపోగులు), తై (విత్తనాల నెక్లెస్), తైవల్ (పూసల ఆభరణం), తై హ్న (పూసల ఆభరణం) మొదలైనవి ధరిస్తారు. చక్కగా అల్లిన ఎబ్రాయిడరీ పౌన్, జకుయాను ధరిస్తారు. నృత్యసమయంలో జు (రైస్ బీర్), వృద్ధ పురుషులు, స్త్రీలు తుయిబుర్ పైపులతో ధూమపానం చేస్తారు. హర్మర్లు గొప్ప వేటాగాళ్ళు వారు వారి విజయాన్ని సూచించే విధంగా సలులాం నృత్యం చేస్తారు. హర్మర్లు నృత్యాన్ని ప్రేమిస్తారు. చొన్లాం నృత్యాన్ని వారు రంగస్థలంలో నర్తిస్తారు. రంగస్థలం వారిలోని కళాకారులను కళను వెలికి తీసుకువస్తుంది.

కుకీలు

[మార్చు]

కుకీలు మిశ్రిత జాతికి చెందిన ప్రజలు. పలుజాతులకు చెందిన ప్రజలు మద్య ఆసియా నుండి బర్మా మీదుగా భారత్‌కు వలస వచ్చిన వారని భావిస్తున్నారు. బర్మాలో వీరిని చిన్ అని పిలుస్తున్నారు. భారత్‌లో కుకీలు అంటున్నారు.

తెగలు

[మార్చు]

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ శాఖ కుకీలలో 37 తెగలను గుర్తించింది.

  • బైటే లేక బియాటే, చంగ్సన్, చంగ్లోయి, డౌంగ్జెల్, గమ్ల్‌హౌ, గంటే, గుయిటే, హంగ్సింగ్, హయోకిప్ లేక హౌపిట్, హయొలై, హెంగ్న, హంగ్సింగ్, కంగ్క్వాల్ లేక రొంగ్ఖొల్, జొంగ్బి, ఖవ్చంగ్, ఖెల్మ, ఖొల్హౌ, కిప్జెన్, కుకి, లియంతంగ్, లంగూన్, లోయిజెం, లోయువుం, లుఫెంగ్, మంగ్జొల్, మిసయొ, రియాంగ్, సైర్హెం, సెల్నం, సింగ్సన్, సిత్ల్హౌ, సుక్తె, తడో, తంగ్యూ, ఉయిబూ, వైఫెయి.
  • 'మొంగొలాయిడ్ వంశావళికి చెందిన వారు. కుకీలు బలమైన, దృఢమైన శరీరాకృతి కలిగి ఉంటారు. కుకీలలో పిత్రుస్వామ్యం అమలులో ఉంది. కుమారులకు ఆస్తిలో వారసత్వం ఉంటుంది. కుకీలలో ఏకపత్నీ విధానం ఉంది. తెగల మధ్య వివాహాలను ప్రోత్సహిస్తుంటారు.

గ్రామాలు

[మార్చు]

కుకీలు కొండ శిఖరాలలో గ్రామాలను నిర్మించుకుంటారు. వారు గృహాలను శత్రువుల నుండి రక్షించుకోవడానికి గుంపులుగా నుర్మించుకుంటారు. గ్రామపెద్దకు ప్రజలమీద విశేషాధికారాలు ఉంటాయి. గ్రామపెద్దకు వివేకవంతులు సలహాలను ఇస్తారు. సలహాదారులను సియామంగ్, పచాంగ్ అని పిలుస్తుంటారు. కుటుంబ పెద్దలు సమావేశమై గ్రామ సమస్యలు, సాంఘిక సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. క్రైస్తవ మతం ప్రజల సాంఘిక, ఆర్థికపరిస్థితిలో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చింది. కుకీలు వారి పురాతన ఆచారాలకు, కట్టుబాట్లకు, న్యాయవిధానాలకు అధికంగా కట్టుబడి ఉంటారు. పెద్దలు శ్రమతో ఏర్పాటు చేసిన పూర్వీకుల విధానాలకు వారు గౌరవం ఇస్తారు.

వృత్తులు

[మార్చు]

కుకీలు పత్తిని పండించి వారి వస్త్రాలను వారే నేస్తుంటారు. వారు కూరగాయల వర్ణాలను వస్త్రాలకు అద్దకం వేస్తారు. జామెంట్రీ డిజైనులతో వస్త్రాలను అలంకరిస్తారు. పురుషులు వర్ణరంజితమైన సంఘ్కొల్, జాకెట్, పెయిచాం (లుంగి లేక ధోవతి) ధరించి చద్దరును చుట్టుకుంటారు. కొన్నిమార్లు వాటిని పాముచర్మం వంటి అల్లికలతో అలంకరిస్తారు. వారు తుహ్పాహ్, డెల్కాప్ వంటి తలపాగాలను ధరిస్తుంటారు. స్త్రీలు నిహ్-సాన్ (ఎర్రని వస్త్రం), దానికింద పాన్ నడుముచుట్టూ చుట్టుకుంటారు, బిల్బ (చెవిపోగులు), హాహ్-లె- చయో (బ్రేస్‌లెట్, గాజులు), కిన్ (నెక్లెస్), బిల్కం (చెవి రింగులు) వంటి ఆభరణాలను ధరిస్తుంటారు.

ధూమపానం

[మార్చు]

స్త్రీలు పురుషులు ధూమపానం చేయడానికి ఆసక్తి కలిగి ఉంటారు. పైపులు మాత్రం వివిధ పేర్లతో ఉంటాయి. వాటిని రాళ్ళు, ఇత్తడి లోహాలతో తయారు చేస్తారు. సంసెంగ్ గొలాంగ్ (ఇత్తడితో మాత్రం తయారు చేయబడినవి) సం తిన్ గొలాంగ్ (కొయ్యతో చేయబడినవి), కొయ్యతోచేసి ఇత్తడితో తాపడం చేసిన వాటిని గొజంగ్ గొలాంగ్ అంటారు.

పండుగలు

[మార్చు]

పంటకోతలు పూర్తి కాగానే కుకీలు గ్రామపెద్ద గృహప్రాంగణంలో చవంగ్ కుత్ పండుగను నిర్వహిస్తుంటారు. జొంగ్చలం, మల్కంగ్లం మొదలైన సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించబడుతుంటాయి. నృత్యాలకు అనుగుణంగా వారు ఖుయాంగ్, దహ్బొ, ఫెయిపిట్, గొసెం, దాహ్-పి, దాహ్-చా, పెంగ్కుల్, తెయిలె, తెయిఫిట్, సెల్కి మొదలైన సంగీత వాద్యాలను ఉపయోగిస్తారు. కుకీలు మిం కుత్, సా-యీ, చంగ్-అయి, హన్, చాన్ లి హన్ మొదలైన పండుగలు జరుపుకుంటారు. నృత్యాలలో పాల్గొనే కుటుంబాలు సంగ్ఖొల్, ఖంతంగ్, పొన్మొంవొం, సైపిఖప్ మొదలైన వారి సంప్రదాయ వస్త్రాలను ధరిస్తుంటారు. పురుషులు సంగ్ఖొల్, డెల్కాప్ వంటి సంప్రదాయ వస్త్రాలను ధరిస్తుంటారు. పంటల సమయంలో పండుగలకు ప్రాధాన్యం ఇస్తారు. కుకీలు వ్యవసాయదారులుగా జొంగ్చలం నృత్యం ద్వారా వారి సంతోషం వెలిబుచ్చుతుంటారు. సంగీతానికి అనుగుణమైన అడుగులు వేస్తూ లయబద్ధంగా నర్తిస్తారు. ఝుం పొలాలలో పంట తరువాత కుకీలు మల్కంగ్లం నృత్యం చేస్తూ ఆనందం ప్రదర్శిస్తుంటారు. సగొల్ఫెయిఖల్ నృత్యాన్ని విజయానికి సూచనగా నర్తిస్తుంటారు.

బియాటీలు

[మార్చు]

బియాటీల మధ్య చైనా నుండి వలస వచ్చిన ప్రజలు అని భావిస్తున్నారు. వీరు కుకి- లుషై మిశ్రిత వంశానికి చెందిన వారు. వారు ఉత్తర మిజోరాం స్థిరపడాడానికి భారత్‌లోప్రవేశించారు. 19వ శతాబ్దంలో తరువాత వచ్చిన వలసప్రజలు వీరిని తరిమివేసారు. తరువాత వీరు దింసా హసాయోలో స్థిరపడ్డారు. బియాటీలకు వారి స్వంత భాష ఉంది. అలాగే పలు సాంస్కృతిక ఆచారాలు పండుగలు నిర్వహించబడుతుంటాయి. బియాటీలు చెంచొకొయికుట్, పంచర్కుట్, లహంగ్కుట్ వంటి వ్యవసాయ సంబంధిత పండుగలు జరుపుకుంటారు. అలాగే వేటను ప్రోత్సహించడానికి కుటుంబాలుగా జొల్సుయాక్, సలువం వంటి పండుగలను జరుపుకుంటారు.

పండుగలు

[మార్చు]

పండుగ సందర్భాలలో వీరు అధికంగా జు ఫ్సీ బీరును సేవించి పాడుతూ బౌంటుమ్లం, కొల్రిఖెలం, రికిఫెచొలం, పర్టొన్లం, సుర్లిబం -లం, తింగ్పుయిలెథ్లక్- లం, మెబుర్లం, డర్లం వంటి సంప్రదాయ నృత్యాలను డబ్-రిబు, జమ్లంగ్, రొసం, ఖుయాంగ్ మొదలైన సంగీత పరికరాలను ఉపయోగిస్తూ చేస్తారు. ఈ సమయంలో యువతీ యువకులు సంప్రదాయ నృత్యాలను, ఆభరణాలను ధరించి చేస్తారు. యువతులు అలంకరించిన చెవి రింగులు, హెడ్ రింగులు, వారి అభిమాన జకుయా, చోయిపుయాన్, పౌంబొంజియా మొదలైన దుస్తులు ధరిస్తారు. యువకులు లుకొం, జకుయా, డియర్కై మొదలైన దుస్తులు ధరిస్తారు. రిథై, కుయార్బెట్, బంగున్, రిటై వంటి ఆభరణాలు ధరిస్తుంటారు. పొలంలో విత్తనాలు వేసే సమయానికి స్త్రీలు వారి పంట్ల దైవం బుపాతియన్‌కు ప్రీతి కలిగించడానికి మెబర్లం నృత్యాలను చేస్తారు. వారు వారి చేతులలో వెదురు కర్రలను పట్టుకుని సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యంచేస్తారు. పొలాల నుండి తిరిగిరాగానే స్త్రీలు తిరిగి కొన్నిసార్లు రికిఫచోలియం నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో వారి ఝుం పొలంలో చిలుకలు ధాన్యం తింటున్నట్లు అనుకరిస్తూ నృత్యం చేస్తారు. శీతాకాలంలో బైటే స్త్రీలు అందరూ సమీపంలోని శెలఏరుకు పోయి పౌరాణిక జలకన్యలను కీర్తిస్తూ తుయిపులియన్ థ్లక్ నృత్యం చేస్తారు. వారు వేణుగానానికి అనుగుణంగా శరీరాలను అలలవలె కదిలిస్తూ నృత్యం చేస్తారు.

హ్రాంగ్‌ఖోట్లు

[మార్చు]

హ్రాంగ్‌ఖోట్లలో హ్రంగ్కవల్, రొంగ్ఖొల్ లేక హ్రొంగ్ఖొల్ తెగలు ఉన్నాయి. కుకీ తెగకు చెందిన ఈ చిన్న సమూహాన్ని దిమా హసాయోలో అరుదుగానే చూసే అవకాశం ఉంది. వీరు అధికంగా వ్యవసాయం చేస్తుంటారు. అధికంగా ఝుం పంటను పండిస్తుంటారు. వారు వారి గృహాలను చెక్క, వెదురు బొంగులతో నిర్మించుకుంటారు.

స్త్రీలు

[మార్చు]

స్త్రీలు పునాలకు నలుపు తెలుపు వర్ణం అద్దకం వేస్తారు. ధుమపానం అంటే మక్కువ చూపుతారు. వీరు ధూమపానానికి మిజోల వంటి పైపులను ఉపయోగిస్తారు. వీరు రుయాల్-చపక్, వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ పరంగత్ పండుగను జరుపుకుంటారు..

పరంగట్

[మార్చు]

పరంగత్ అంటే పూవు. వసతం రాగానే అంతటా పూలు వికదిస్తాయి. హ్రాంగ్‌ఖోట్లు పౌర్ణమి రోజున పరంగట్ పండుగను జరుపుకుంటారు. చంద్రోదయంతో పండుగ మరునాటి ఉదయం వరకు కొనసాగుతుంది. గ్రామంలో ప్రవేశించే ప్రధాన మార్గం తప్పు మిగిలిన మార్గాలాంటినీ మూసి వేస్తారు. యువకులు సమీపంలో ఉన్న అరణ్యం నుండి అడవి పుష్పాలను సేకరిస్తారు. పెద్దవారు బుట్టలను అలంకరిస్తారు. తరువాత వారు ఒకరిని ఒకరు అభినందించుకుని వసంతానికి స్వాగతం పలుకుతారు. పౌర్ణమి వేళలో వెన్నెలలో రైస్ బీరును త్రాగుతూ సంగీతం పాడుతూ నృత్యం చేస్తూ ఆనందిస్తారు.

వృత్తులు

[మార్చు]

ఇతర గిరిజనుల వలెనే హ్రాంగ్‌ఖోట్లకు కూడా చేప సంపదకు చిహ్నంగా ఉంది. సిక్సోల్కిర్లం నృత్యంలో వారు మత్స్యకారులను అనుకరిస్తూ నృత్యం చేస్తారు. ఆరోగ్యం, సంతోషం కొరకు సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తారు. గౌరవనీయులైన ప్రజలను గ్రామంలోకి ఆహ్వానించే సమయంలో వీరు భైలం నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో పురుషులు చురియా, కమీస్, లుకొం, చంగ్కల్తక్ అలాగే స్త్రీలు పొంబొమాక్, పొనమ్నై, కొంగ్ఖిత్, తెబాప్ మొదలైన వస్త్రాలను ధరిస్తారు. నృత్యంలో వారు జక్చర్, చుంహురి, లిర్తెల్ మొదలైన సంగీత ఉపకరణాలను ఉపయోగిస్తారు. ఈ పండుగలలో జానపద గీతాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారు డర్లం, డోయింకిని, రోచెమియం, సొక్సొలియం మొదలైన జానపద నృత్యాలు చేస్తుంటారు. నృత్యాలకు వారు డార్, చెరండా, రొచం, తెయిలే వంటి సంగీత పరికరాలను ఉపయోగిస్తారు.

ఆర్ధికం

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి దిమా హసాయో జిల్లా అక్షరాస్యత 77.55%. 2001లో ఇది 67.62% ఉంది. ప్రైవేటు పాఠశాలలు ఆరంభించక ముందే రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఆరంభించింది. పలు పాఠశాలలు ఆంగ్లమాధ్యమంలో బోధనచేస్తున్నాయి. " అస్సాం సెకండరీ బోర్డ్ ఎజ్యుకేషన్ ", అస్సాం హైయ్యర్ సెకండరీ ఎజ్యుకేషన్ కౌంసిల్ " పాఠశాలలకు గుర్తింపును ఇస్తుంది. దిమాహసాయోలోని కాలేజీలు అస్సాం విశ్వవిద్యాలయం ఆధీనంలో పనిచేస్తుంటాయి. కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలో ఒకటైన అస్సాం విశ్యవిద్యాలయం సాధారణ డిగ్రీ కోర్సులను, వృత్తివిద్యా కోర్సులను అందిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం 1994లో స్థాపించబడింది. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 16 పాఠశాలలు, 35 పోస్ట్ - గ్రాజ్యుయేట్ శాఖలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 51 అఫ్లియేటెడ్ కాలేజీలు పనిజేస్తున్నాయి;[7] 'దింసా హసాయో' 'లో కళాశాలలు;

  • బి బోడో కాలేజ్,
  • మైబాంగ్ డిగ్రీ కళాశాల,
  • హఫ్లాంగ్ ప్రభుత్వ కళాశాలలో
  • సెంగ్యా సంభుదాన్ కాలేజ్,
  • జె.బి హగ్జర్ కాలేజ్
దింసా హసాయో యొక్క బ్యాటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్
హఫ్లాంగ్‌లో
  • సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్,
  • డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్
  • సైనాడ్ హయ్యర్ సెకండరీ స్కూల్
మైబొంగ్
  • ప్రనాబానంద విద్యా మందిర్ హై స్కూల్
  • ఎవర్ గ్రీన్ హై స్కూల్
  • సైంజ వాలీ హై స్కూల్
  • డాన్ బాస్కో హై స్కూల్
  • మైబంగ్ హై స్కూల్
  • మైబంగ్క్రొ హై స్కూల్

మాధ్యమం

[మార్చు]

రేడియో

[మార్చు]

ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి హఫ్లాంగ్ ; హఫ్లాంగ్ నుండి ప్రసారం చేయబడుతుంది. వేవ్ లెంత్ 100.02, ఎఫ్.ఎం ప్రసారాలు.

ప్రాంతీయ పత్రికలు

[మార్చు]
  • హఫ్లాంగ్ ఖురంగ్ (దింసా భాష వారపత్రిక)
  • హఫ్లాంగ్ టైంస్ (ఆంగ్ల వార పత్రిక)

మూలలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Ilha Grande do Gurupá 4,864km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Samoa 193,161 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. Col Ved Prakash, "Encyclopaedia of North-east India, Vol# 2", Atlantic Publishers & Distributors;Pg 575, ISBN 978-81-269-0704-5
  7. "Assam University Homepage". Archived from the original on 2013-08-26. Retrieved 2020-01-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లింకులు

[మార్చు]