Coordinates: 24°41′00″N 92°34′00″E / 24.6833°N 92.5667°E / 24.6833; 92.5667

హైలకండి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైలకండి జిల్లా
হাইলাকান্দি
కేంద్రీయ విద్యాలయ, పంచగ్రామ్
కేంద్రీయ విద్యాలయ, పంచగ్రామ్
District location in Assam
District location in Assam
Country India
Stateఅసోం
District created01-10-1989
ప్రధాన కార్యాలయంHailakandi
Area
 • Total1,327 km2 (512 sq mi)
Elevation
21 మీ (69 అ.)
Population
 (2011)
 • Total6,59,260
 • Density497/km2 (1,290/sq mi)
భాషలు
 • అధికారBangla
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
788XXX
టెలిఫోన్ కోడ్91 - (0) 03844
Vehicle registrationAS-24

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో హైలకండి జిల్లా (బెంగాలీ: হাইলাকান্দি জেলা) ఒకటి. 1869 జూన్ 1 న ఇది ఉపవిభాగంగా విభజించబడింది. 1989 నాటికి ఇది పూర్యిస్థాయి జిల్లాగా అవతరించింది. కచార్ జిల్లాలో కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[1] 2011 గణాంకాలను అనుసరించి అస్సాం రాష్ట్రంలో జనసంఖ్యాపరంగా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో ఇది 3 స్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి 2 స్థానాలలో దిమా హసాయో జిల్లా, చిరంగ్ జిల్లా ఉన్నాయి.[2]

చరిత్ర

[మార్చు]

1868 జూన్ 1 ఈ ప్రాంతం సివిల్ సబ్‌డివిజన్‌గా చేయబడింది. 1989లో ఇది జిల్లాగా రూపొందించబడింది. హైలకండి అనే పేరుకు మూలం సిల్హేటి పదం హైలకుండి.

సమీపకాల చరిత్ర

[మార్చు]

తరువాత కరీంగంజ్ చరిత్ర " అబ్దుల్ మత్లిబ్ మజుందర్" (1890-1980) తో మొదలైంది. 1946లో భారత్ ఇంకా బ్రిట్జిష్ ఆధీనంలో ఉండగానే ఆయన అసెంబ్లీ సభ్యుడు, కాబినెట్ మంత్రి అయ్యాడు.[3] హిందూ ముస్లిం సమైక్యతను సంరక్షించే తూర్పు భారతదేశ ఒకేఒక నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. మతపరంగా భారతదేశాన్ని విభజించడానికి వ్యతిరేకంగా ఆయన " ఫకురుద్ధీన్అలీ " (5భారతదేశ అధ్యక్షుడు) వంటి నాయకులతో కలిసి రాజకీయనాయకులతో చేతులు కలిపాడు. మజుందర్ 1925 హైలకండి బార్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తరువాత ఆయన పరిచయాలు సిల్చార్, కరీంగంజ్ ప్రాంతాల వరకు విస్తరించాయి. స్వాతంత్ర్య పోరాటానికి బలంచేకూరుస్తూ మజుందర్, దక్షిణ అస్సాం కాంగ్రెస్ పార్టీ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆహ్వానం మీద 1939, పండిట్ జవహర్లాల్ 1945 హైలకండిని సందర్శించారు. నేతాజీ అబ్దుల్ మత్లిబ్ మజుందర్‌కు మౌలానా అబ్దుల్ కలాంతో పరిచయం చేసాడు.[4]

ముస్లిం లీగ్

[మార్చు]

1937 నాటి ఎన్నికలలోముస్లిం లీగ్ తన బలాన్ని నిరూపించుకుంది. ముస్లిం లీగ్ ప్రజాదరణను ఎదుర్కోడానికి అనుకూలంగా ఆయన అస్సాంలో " జమైత్ ఉలేమా - ఇ - హింద్" ఉద్యమం విజయవంతంగా నిర్వహించాడు. జాతీయ కాంగ్రెస్‌కు బడుగు ముస్లిం వర్గాలతో సాన్నిహిత్యం ఏర్పడడానికి జమైత్ ఒక వంతెనగా ఉండేది. 1946 నాటికి ఆయన ముస్లిం లీగ్ నుండి ముస్లిముల ఆదరణ తన వైపు తిప్పుకున్నాడు. ఈ విజయం ముస్లిం లీగ్ నమ్మకాలను సడలింపజేసింది. తూర్పు ఇండియాలో ముస్లిం - హిందూ ఐక్యతకు పాటుబడుతూ దేశవిభజనను వ్యతిరేకించిన ముస్లిం నాయకులలో మజుందార్ ఒకడు.

మజుందర్ వ్యక్తిగత జీవితం

[మార్చు]

1921లో మజుందార్ ఢాకా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేసాడు, 1924లో కొలకత్తాలో బి.ఎల్ పూర్తిచేసాడు. 1925 నుండి హైలకండిలో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. హైలకండి ప్రజలకు న్యాయసేవలు అందిస్తూ మజుందార్ ప్రముఖ న్యాయవాదులలో ఒకడయ్యాడు. తరువాత ప్రభుత్వం ఆయనకు మెజిస్ట్రేట్ పదవి ఇవ్వడానికి ముందుకు వచ్చింది.మజుందార్ పదవిని నిరాకరించాడు.[5] 1925 మజుందార్ జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన 1937లో హైలకండి కాంగ్రెస్‌ను స్థాపించి దానికి అధూక్షత వహించాడు. 1945, 1937లో నేతాజి సుభాసుచంద్రభోస్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ దక్షిణ అస్సాంలో స్వాతంత్ర్య పోరాటానికి బలం చేకూరుస్తూ హైలకండిని సందర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మౌలానా అబ్దుల్ కలం, మజుందార్ మద్య సత్సంబంధాలు ఏర్పరిచాడు. ఈ సంబధం ఈ ప్రాంతంలో ముస్లింలీగ్‌కు వ్యతిరేకంగా ముస్లిం జాతీయవాదం అభివృద్ధికి దోహదం చేసింది.[4] 1939లో మజుందార్ హైలకండి టౌన్ షిప్‌కు మొదటి చైర్మన్‌గా నియమించబడ్డాడు. 1945లో ఆయన మొదటి " ఇండియన్ చైర్మన్ ఆఫ్ ది హైలకండి లోకల్ బోర్డ్ "గా నియమించబడ్డాడు. ఈ పదవికి అప్పటి వరకు యురేపియన్ టీ తోటల పెంపకం దార్లను నియమిస్తూ వచ్చారు.[6]

సుర్మా లోయ

[మార్చు]

అస్సాం సుర్మా వెల్లీ (ప్రస్తుతం ఇది కొంత బంగ్లాదేశ్లో ఉంది)లో ముస్లిములు అధికంగా ఉన్నారు. స్వతత్రం పొందిన సమయంలో ముస్లిం లీగ్ , జాతీయ కాంగ్రెస్ ప్రేరిత ఉద్యమకారులు ఉద్రేకం శిఖరాగ్రానికి చేరింది. మజుందార్ అప్పటి హోం మంత్రి కుమార్ దాస్‌తో కలిసి వెల్లీ అంతా పర్యటిస్తూ దేశ విభజన , ముస్లిం సమైక్యత గురించి ఉపన్యసించారు. 1947 ఫిబ్రవరి 20 న మౌలవి మజుందర్ అస్సాం నేషనలిస్ట్ సభను ఏర్పాటు చేసాడు. తరువాత 1947 జూన్ 20 తేదీన సిల్చర్ వద్ద కూడా పెద్ద సభ ఏర్పాటు చేయబడింది.[7] రెండు సభలు చక్కని ఫలితం ఇచ్చాయి. అస్సాం లోని బారక్ వెల్లీ ప్రాంతం ప్రత్యేకంగా కరీంగజ్ భారత్‌లో విలీనం కావడానికి మజుందర్ కూడా కృషిచేసాడు.[6][8] సైలహట్‌లో కొంతభాగం (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఓ ఉంది) చేరడానికి " రాడ్క్లిఫ్ కమిషన్ " వద్దకు పంపబడిన దౌత్యవర్గంలో మజుందర్ ఒకడు.[9]

మంత్రిపదవి

[మార్చు]

1946లో మౌలవి మజుందార్ కాబినెట్ మంత్రిగా నియమించబడ్డాడు. స్వయం ప్రతిపత్తి, వ్యవసాయం, పశుసంరక్షణ మంత్రిగా బాధ్యతను స్వీకరించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. మజుందార్ తిరిగి గోపీనాథ్ బొర్డోలి ప్రభుత్వంలో మంత్రిగా (ఒకేఒక ముస్లిం మంత్రి) నియమించబడ్డాడు. బారక్ ప్రాంతానికి ముజుందార్ ఒక్కడే మంత్రిగా ఉండడం ఆయన ప్రత్యేకత.

స్వాతంత్ర్యం తరువాత

[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత చెలరేగిన మతకలవరం

[మార్చు]

1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం తరువాత భారతదేశం అంతటా మతకహాలు విజృంభించాయి. గుంపులు గుంపులుగా హిందువులు తూర్పు పాకిస్థాన్ నుండి భారతదేశంలోకి పారపోయి వచ్చారు. అలాగే ముస్లిములు తూర్పు పాకిస్థానుకు వెళ్ళారు. మతకలహాలలో అనేక మంది ప్రాణాలుకోల్పోయారు. అవిభాజిత కాచర్‌లో మజుందర్ మాత్రమే మంత్రి వర్గంలో భాగస్వామ్యం వహించాడు. పార్టీ సభ్యులు కచార్‌లో హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. అలాగే పార్టీ సభ్యులు శరణార్ధుల పునరావాసానికి అత్యవసర సమాగ్రి సరఫరాకు సహకరించారు. 1960లో క్యాబినెట్ మంత్రి మొయినుల్ హాక్యూ చౌదరి (1957-1966) జిల్లాలో ప్రముఖ రాజకీయనాయకుడు అయ్యాడు. 1971లో ఆయన క్రి.శే ఇందిరా గాంధి మంత్రి సభలో పారిశ్రామిక మంత్రి అయ్యాడు. కీ.శే అరుణ్ కె.ఆర్. చంద్రా భార్య జ్యోత్స్న చందా పార్లమెంటులో స్థానం సంపాదించాడు. 1983 జూలై 1 కచార్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి కరీంగంజ్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1] 1989లో కరీంగంజ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి హైలకండి జిల్లా ఏర్పాటు చేయబడింది. .[1]

రాజకీయ జీవితం

[మార్చు]

1957 వరకు ముజందర్ క్యాబినెట్ మంత్రిగా కొనసాగాడు.[10][11] ఆయన తన 77వ సంవత్సరంలో చివరిసారిగా 1967లో ఎన్నికలలో పాల్గొని విజయం సాధించాడు. తరువాత ఆయన న్యాయశాఖ, సాంఘిక సంక్షేమ మంత్రి అయ్యాడు. న్యాయ మంత్రిగా ఆయన నిర్వహణా, న్యాయశాఖలను విభజించాడు. 1970 - 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన తూర్పు పాకిస్థాన్ నుండి భారత్‌లో ప్రవేశించిన వేలాది శరణార్ధులకు రిలీఫ్ - రిహాబిలియేషన్ అధికారిగా నియమించబడ్డాడు. 1971లో మజుందర్ ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నాడు. మజుందర్ చైర్మన్, అస్సాం మద్రస్సా బోర్డ్ చైర్మన్, స్టేట్ హజ్ కమిటీ, అస్సాం అసెంబ్లీ గత స్పీకర్ (1967). గౌహతీలో హజ్ హౌస్ స్థాపనకు ఆయన సహకరించాడు. అస్సాం మద్రస్సా బోర్డ్ చైర్మన్‌గా ఆయన థియోలాజికల్ స్కూళ్ళ ఆధునికీకరణ కొరకు అలాగే సైన్సు, ఆంగ్లమాధ్యమంలో బోధన కొరకు ప్రయత్నం చేసాడు. [12] He was the key person to set up centres of higher education at Hailakandi.[13]

రాజ్ మోహన్ నాథ్

[మార్చు]

హైలకండికి చెందిన మరొక ప్రముఖుడు గుర్తింపు పొందిన ఇంజనీర్ కీ.శే మోహన్ నాథ్. ఆయన ఇంజనీరింగ్ గురించి పలు పుస్తకాలను రచించాడు. బెంగాల్ ఇంజనీరింగ్ కాలేజ్ ;శిబ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) లో ఆయన రచించిన పుస్తకం పాఠ్యపుస్తకంగా ఎంచుకున్నారు. ప్రస్తుత " అస్సాం - టైప్ - హౌస్ " పూర్తిగా ఆయన రూపకల్పనలో రూపొందించబడింది. భూకంపం సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతాలలో ఆయన నిర్మిచిన మాదిరి గృహం బహుళ ప్రజాదరణ చూరగొన్నది. మాస్కో నగరంలో ఒక రహదారికి " రాజ్ మోహన్ నాథ్ రోడ్డుగా " నామకరణం చేసి ఆయనను గౌరవించారు.

భౌగోళికం

[మార్చు]

హైలకండి జిల్లా వైశాల్యం 1327చ.కి.మీ.[14] ఇది ఇరాన్ లోని క్వేష్ం ద్వీపం వైశాల్యానికి సమం.[15]

అరణ్యం

[మార్చు]

హైలకండి జిల్లలోని 50% భూభాగం " రిజర్వ్ ఫారెస్టుగా "గా ప్రకటించబడింది. ఇది ఇన్నర్ లైన్ రిజర్వ్ ఫారెస్ట్ , కతఖల్ రిజర్వ్ ఫారెస్ట్. జిల్లా సరిహద్దులో 76మైళ్ళ పొడవున మిజోరాం రాష్ట్రం ఉంది. అదనంగా సరిహద్దులో కరీంగంజ్ , కచార్ జిల్లాలు ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 542978. జిల్లాలో 2 ప్రత్యేకత కలిగిన పట్టణాలు (జిల్లా కేంద్రం హైలకండి పట్టణం , లాల) , ఒక పారిశ్రామిక పట్టణం ఉన్నాయి. పాంచ్‌గ్రాం మునిసిపల్ బోర్డ్ హైలకండి పాలనా నిర్వహణ బాధ్యత వహిస్తుంది. లాల పట్టణం పాలనా నిర్వహణ బాధ్యత టౌన్ కమిటీ వహిస్తుంది. జిల్లాలో 5 డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి (హైలకండి, లాల, కత్లిచెర్ల & దక్షిణ హైలకండి డెవెలెప్మెంటు బ్లాక్). హైలకండి మహ్కుమా పరిషద్‌లో 5 డెవెపెప్మెంటు బ్లాకులు ఉన్నాయి. జిల్లాలోని 5 డెవెలెప్మెంటు బ్లాకులలో మొత్తం 62 గ్రామపంచాయితీలు ఉన్నాయి. జిల్లా 4 రెవెన్యూ బ్లాకులుగా విభజించబడి ఉంది. 393 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 27 ఫారెస్ట్ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో సగం భూభాగంలో అరణ్యం ఉంది. మిలిన 32% భూభాగం వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. జిల్లాలో వడ్లు ప్రధాన పంటగా ఉంది. జిల్లాలో 17 టీ తోటలు. జిల్లాలో 4 పోలీస్ స్టేషన్లు , 2 పోలీస్ ఔట్ పోస్టులు, 2 కాలేజులు, 43 హైస్కూళ్ళు, 247 మాద్యమిక పాఠశాలలు , 937 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

వన్యసంరక్షణ

[మార్చు]

హైలకండి అరణ్యాలలో ఒకప్పుడు జంతుజాలం అధికంగా ఉంది. అయినా అవి ఇప్పుడు మానవ ఆక్రమణల కారణంగా పూర్తిగా కనుమరుగౌతున్నాయి. ఇక్కడ హూలాక్ గిబ్బన్, ఫేర్స్ లీఫ్ మంకీ, పిగ్- టైల్డ్ మకాక్యూ, వైట్- వింగ్డ్- వుడ్ డక్, పర్పుల్ వుడ్ పీజియన్ మొదలైన జంతువులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి.[16][17] జిల్లా దక్షిణ భూభాంలో " ధాలేశ్వరి విల్డ్ శాక్చ్యురీ"గా చేయాలని ప్రతిపాదించబడింది. [18][19]

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో హైలకండి జిల్లా ఒకటి అని గుర్తించింది.[20] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర11జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[20]

విభాగం

[మార్చు]
 • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: హైలకండి, కత్లిచెరా, అల్గపుర్.[21]
 • ఇవి మూడు కరీంగంజ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[22]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 659,260,[2]
ఇది దాదాపు. మోటెంగ్రో దేశ జనసంఖ్యకు సమానం.[23]
అమెరికాలోని. నార్త్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[24]
640 భారతదేశ జిల్లాలలో. 519వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 497 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.44%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 946:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 75.26%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

1991 గణాంకాలు

విషయాలు వివరణలు
ముస్లిములు 312,849 (57.62%)
హిందువులు 223,191 (41.11%)
క్రైస్తవులు 5,424 (1.27%)
ఎస్.టిల సంఖ్య 120,000
ఎస్.సి సంఖ్య 40,000
వలస ప్రజలు 6,68,168,
అక్షరాశ్యులు 2,38,423
2001 అక్షరాశ్యుల శాతం 58.56%
భాషలు బెంగాలీ, మణిపురి
స్థానికులు మైటీ, బిష్ణుప్రియా,కుకి, రీంగ్, చక్మా

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. "Assam Legislative Assembly - MLA 1946-1952". Archived from the original on 2013-11-14. Retrieved 2014-09-25.
 4. 4.0 4.1 Bhattacharyya, N. (1998). Hailakandite Netaji. Hailakandi – smaranika (in Bengali). (Souvenir of the 50th year of independence). District Administration, Hailakandi, India.
 5. Abdul Matlib Mazumdar- a centenary tribute Archived 2011-08-11 at the Wayback Machine Choudhury, A. (1990). The Assam Tribune, 1 June, Guwahati, India.
 6. 6.0 6.1 Barua, D. C. (1990). Moulvi Matlib Mazumdar- as I knew him. Abdul Matlib Mazumdar – birth centenary tributes, pp. 8–9.
 7. Bhattacharjee, J. B. (1977). Cachar under British Rule in North East India. Radiant Publishers, New Delhi.
 8. Purkayashta, M. (1990). Tyagi jananeta Abdul Matlib Mazumdar. The Prantiya Samachar (in Bengali). Silchar, India.
 9. Roy, S. K. (1990). Jananeta Abdul Matlib Mazumdar (in Bengali). Abdul Matlib Mazumdar – birth centenary tributes, pp. 24–27.
 10. http://www.eci.nic.in/eci_main/statistical[permanent dead link] reports/SE.../StatRep_51_ASSAM.pdf
 11. http://www.northeastunlimited.com/facts/263.html[permanent dead link]
 12. Mazumdar, A. M. (1990). Abdul Matlib Mazumdar- remembrance by a son : down the momory lane. Abdul Matlib Mazumdar – birth centenary tributes, pp. 10–12.
 13. "EDUCATIONAL INSTITUTIONS in HAILAKANDI". Archived from the original on 2006-03-05. Retrieved 2006-03-05.
 14. Dayawanti Srivastava (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
 15. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Qeshm1,336
 16. Choudhury, A.U. (1986). Discovery of Pharye's leaf monkey in Assam. The Sentinel 31 August.
 17. Choudhury, A.U. (1987). Notes on the distribution and conservation of Phayre’s leaf monkey and hoolock gibbon in India. Tigerpaper 14(2): 2-6.
 18. Choudhury, A.U. (1983). Plea for a new wildlife refuge in eastern India. Tigerpaper 10(4):12-15.
 19. Choudhury, A.U. (1983). Plea for a new wildlife sanctuary in Assam. WWF - India Newsletter 4(4):15.
 20. 20.0 20.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 21. "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
 22. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
 23. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Montenegro 661,807 July 2011 est.
 24. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. North Dakota 672,591

వెలుపలి లింకులు

[మార్చు]

24°41′00″N 92°34′00″E / 24.6833°N 92.5667°E / 24.6833; 92.5667

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]