అక్షాంశ రేఖాంశాలు: 25°50′N 93°26′E / 25.83°N 93.43°E / 25.83; 93.43

దిఫు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిఫు
పట్టణం
దిఫు కొండ
దిఫు కొండ
దిఫు is located in Assam
దిఫు
దిఫు
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
దిఫు is located in India
దిఫు
దిఫు
దిఫు (India)
Coordinates: 25°50′N 93°26′E / 25.83°N 93.43°E / 25.83; 93.43
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాకర్బి ఆంగ్లాంగ్
ఉప విభాగంలుంబజోంగ్
Government
 • Bodyకర్బి ఆంగ్లాంగ్ అనలాంగ్ అనటోమానస్ కౌన్సిల్
Elevation
186 మీ (610 అ.)
జనాభా
 (2011)
 • Total61,797
భాషలు
 • అధికారికఆంగ్లం, అస్సామీ
 • మాట్లాడేభాషకర్బి, అస్సామీ, దిమాస, ఆంగ్లం, హిందీ
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
782460, 782462
టెలిఫోన్ కోడ్03671
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్-09

దిఫు, అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. కొండ ప్రాంతంలో ఉన్న ఈ చిన్న పట్టణం సమీప నగరాల ప్రజలకు పర్యాటక ప్రదేశం.

పద వివరణ

[మార్చు]

దిఫు అనే పదం దిమాసా భాష నుండి వచ్చింది. దిఫు అంటే తెల్లని నీరు (ది అంటే నీరు, ఫు అంటే తెల్లని) అని అర్థం. చారిత్రాత్మకంగా వర్షాకాలంలో దిఫులోని నీటి ప్రవాహం తెలుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది.

భౌగోళికం

[మార్చు]

25°50′N 93°26′E / 25.83°N 93.43°E / 25.83; 93.43 అక్షాంశరేఖాంశాల మధ్య ఈ పట్టణం ఉంది.[1] దీని సగటు ఎత్తు 186 మీటర్లు (610 అడుగులు). గువహాటికి రహదారి మార్గం ద్వారా 270 కి.మీ. దూరంలో, రైల్వే ద్వారా 213 కి.మీ. దూరంలో ఈ పట్టణం ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] దీఫు పట్టణ జనాభా 63,654 గా ఉంది. జనాభా ఆధారంగా, ఇది తరగతి -2 నగరంగా వర్గీకరించబడింది (50,000, 99,999 నివాసుల మధ్య). ఈ మొత్తం జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. దిఫు సగటు అక్షరాస్యత రేటు 90% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 94%, స్త్రీ అక్షరాస్యత 86%గా ఉంది. దిఫు జనాభాలో 13%మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

సంస్కృతి

[మార్చు]

ఈ పట్టణం దేశంలోని అనేక దేశీయ జాతుల, ఇతర వర్గాల ప్రజలకు నిలయంగా ఉంది. కార్బిస్, రెంగ్మా, డిమాసా కచారి, తివా కాచారి, బోడో కచారి, గారో కచారి, రభా జిల్లాలోని ప్రధాన తెగలు. ఇక్కడి ప్రజలు శాంతియుత, సామరస్య పూర్వకంగా జీవిస్తున్నారు. ఇక్కడ దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు ఉన్నాయి. ఈ పట్టణంలో రోంగ్కర్, బుషు-డిమా, వంగల, బిహు, సిక్పుయి-రుయోయి, క్రిస్మస్, దుర్గా పూజ, దీపావళి, బైఖో, ఇతర పండుగలను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు.

రవాణా

[మార్చు]

రోడ్డుమార్గం

[మార్చు]

జాతీయ రహదారి 329ఎ ఈ పట్టణాన్ని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల ద్వారా ఈ పట్టణం అనేక జిల్లాలు, అస్సాంలోని ఇతర ముఖ్యమైన పట్టణాలకు కలుపబడి ఉంది. అద్దె కార్లు సమీప పట్టణాలకు, ఇతర ప్రదేశాల మధ్య నడుస్తున్నాయి. ఆటో రిక్షా పట్టణంలోని ప్రధాన రవాణా సాధనంగా ఉంది.

రైలుమార్గం

[మార్చు]

ఈ పట్టణానికి ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ పరిధిలోని దిఫు రైల్వే స్టేషన్ సేవలు అందిస్తొంది. ఇది లమ్డింగ్- దిబ్రుగర్ విభాగంలో ఉంది. అనేక ముఖ్యమైన రైళ్ళు గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్, కమ్రప్ ఎక్స్‌ప్రెస్, జాన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, చండీగర్ ఎక్స్‌ప్రెస్, నాగాలాండ్ ఎక్స్‌ప్రెస్ మొదలైనవి ఈ పట్టణం మీదుగా నడుస్తున్నాయి.

రాజకీయాలు

[మార్చు]

దీఫు పట్టణం డిఫు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం అటానమస్ డిస్ట్రిక్ట్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంలో ఉంది.[3]

క్రీడలు

[మార్చు]

కార్బి ఆంగ్లాంగ్ జిల్లా ప్రధాన ఆట ఫుట్‌బాల్, ఇది ఇక్కడ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం, కాసా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఒక స్టేడియం, మరొకటి దిఫులోని చుటియానాలా వద్ద నిర్మాణంలో ఉంది.

మార్పులు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Diphu
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-11-15.
  3. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-11-15.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దిఫు&oldid=4149459" నుండి వెలికితీశారు