అక్షాంశ రేఖాంశాలు: 24°41′N 92°34′E / 24.68°N 92.57°E / 24.68; 92.57

హైలకండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైలకండి
పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం
హైలకండి is located in Assam
హైలకండి
హైలకండి
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
హైలకండి is located in India
హైలకండి
హైలకండి
హైలకండి (India)
Coordinates: 24°41′N 92°34′E / 24.68°N 92.57°E / 24.68; 92.57
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాహైలకండి
జిల్లా ఏర్పాటు1 అక్టోబరు 1989
Government
 • Bodyహైలకండి జిల్లా పురపాలక సంస్థ
విస్తీర్ణం
 • Total1,327 కి.మీ2 (512 చ. మై)
Elevation
21 మీ (69 అ.)
జనాభా
 (2011)[1]
 • Total33,637
 • జనసాంద్రత497/కి.మీ2 (1,290/చ. మై.)
భాషలు
 • అధికారికబెంగాళీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
788155
టెలిఫోన్ కోడ్91 - (0) 03844
Vehicle registrationఏఎస్-24
ఎక్కువగా మాట్లాడే భాషసిల్హేటి

హైలకండి, అస్సాం రాష్ట్రంలోని హైలకండి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధానకేంద్రం. గువహాటికి 336 కి.మీ. దూరంలో ఈ పట్టణం ఉంది.

భౌగోళికం

[మార్చు]

24°41′N 92°34′E / 24.68°N 92.57°E / 24.68; 92.57 అక్షాంక్షరేఖాంశాల మధ్య ఈ పట్టణం ఉంది.[2] 1,327 కి.మీ.2 (512 చ.మై.) విస్తీర్ణంలో ఉన్న ఈ పట్టణం సముద్రమట్టానికి 21 మీటర్ల (69 అడుగులు) ఎత్తులో ఉంది. హైలకండి పట్టణాన్ని 16 వార్డులుగా విభజించారు.

జనాభా

[మార్చు]

హైలకండి పట్టణంలో మతాలు (2011)[1]

  Others (0.74%)

2011 జనాభా లెక్కల ప్రకారం హైలాకండి జనాభా 33,637గా ఉండగా, జన సాంద్రత 497/కి.మీ2 (1,290/చ.మై.) గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 16,843 మంది పురుషులు, 16,794 మంది స్త్రీలు ఉన్నారు. హైలకండి జనాభాలో 3309మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

హైలకండి పట్టణంలో స్త్రీ పురుష నిష్పత్తి 958 సగటుతో పోలిస్తే 997గా ఉంది. అంతేకాకుండా అస్సాం రాష్ట్ర సగటు 962తో పోలిస్తే హైలకండిలో బాలబాలికల నిష్పత్తి 973గా ఉంది. హైలకండి పట్టణ అక్షరాస్యత రాష్ట్ర సగటు 72.19% కంటే 92.08% ఎక్కువగా ఉంది. అక్షరాస్యత 94.61% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 89.55%గా ఉంది.

ఈ పట్టణంలో అధికశాతం మంది హిందువులు ఉండగా ఆ తరువాతి స్థానంలో ముస్లీంలు, క్రైస్తవులు ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

ఈ పట్టణ పరిపాలన హైలకండి పురపాలక సంస్థ పరిధిలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 7,000లకు పైగా గృహాలు ఉన్నాయి. వీటికి తాగునీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను పురపాలక సంస్థ అందిస్తోంది.

రవాణా

[మార్చు]

రోడ్డుమార్గం

[మార్చు]

అస్సాం రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతాల నుండి ఈ పట్టణానికి బస్సులు నడుస్తున్నాయి.

రైలుమార్గం

[మార్చు]

సిల్చార్‌లోని బదర్‌పూర్ రైల్వే స్టేషను ఆ పట్టణానికి సమీప రైల్వే స్టేషను.

వాయుమార్గం

[మార్చు]

హైలకండికి సమీప విమానాశ్రయం సిల్చార్‌లోని కుంభీర్గ్రామ్‌లో ఉంది. ఈ విమానాశ్రయం నుండి కోల్‌కతా, ఐజాల్, గువహాటి, అగర్తలా వంటి అనేక ఇతర ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "C-1 Population By Religious Community". census.gov.in. Retrieved 14 November 2020.
  2. Falling Rain Genomics, Inc - Hailakandi

ఇతర లంకెలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హైలకండి&oldid=3945392" నుండి వెలికితీశారు