Jump to content

బార్పేట

అక్షాంశ రేఖాంశాలు: 26°19′N 91°00′E / 26.32°N 91.0°E / 26.32; 91.0
వికీపీడియా నుండి
బార్పేట
తతికుచి
పట్టణం
Nickname: 
సత్రా నగరి
బార్పేట is located in Assam
బార్పేట
బార్పేట
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
బార్పేట is located in India
బార్పేట
బార్పేట
బార్పేట (India)
Coordinates: 26°19′N 91°00′E / 26.32°N 91.0°E / 26.32; 91.0
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాబార్పేట జిల్లా
Elevation
35 మీ (115 అ.)
జనాభా
 (2011)
 • Total42,649
భాషలు
 • అధికారికఅస్సామీ
 • ప్రాంతీయబార్పేట జిల్లా
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
781301
Vehicle registrationఏఎస్-15

బార్పేట, అస్సాం రాష్ట్రం బార్పేట జిల్లాలోని ఒక పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. పశ్చిమ అస్సాంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఈ నగరం గువహాటికి వాయవ్య దిశలో 90 కి.మీ. (56 మైళ్ళ) దూరంలో ఉంది. దీని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అనేక వైష్ణవ సత్రాలు ఉన్నందువల్ల దీనిని అస్సాంలోని సత్ర నగరి (ఆలయ పట్టణం) అని కూడా పిలుస్తుంటారు.

భౌగోళికం

[మార్చు]

26°19′N 91°00′E / 26.32°N 91.0°E / 26.32; 91.0 అక్షాంశరేఖాంశాల మధ్యలో ఈ నగరం ఉంది.[1] దీని సగటు ఎత్తు 35 మీటర్లు (114 అడుగులు) గా ఉంది. మానస్ జాతీయ అభయారణ్యం నుండి 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ పట్టణం మీదుగా చౌల్ఖోవా, మోరా నోడి (డెడ్ రివర్), నఖండ అనే మూడు నదులు ప్రవహిస్తున్నాయి. ఇందులో రెండు నదులు బ్రహ్మపుత్ర నదికి ఉపనదులుగా ఉన్నాయి.[2]

చరిత్ర

[మార్చు]

బార్పెటను గతంలో 'తతికుచి' (నేత కార్మికుల భూమి) అని పిలిచేవారు. తాతి అంటే చేనేత, కుచి అంటే స్థానిక బార్పెటియా మాండలికంలో గ్రామాల సమూహం అని అర్థం. పంతొమ్మిదవ శతాబ్దంలో, బార్పేట పట్టణం, పరిసర ప్రాంతాలు అవిభక్త కమ్రప్ జిల్లాలో భాగంగా బార్పేట ఉపవిభాగంగా ఉన్నాయి. 1983లో ఉపవిభాగం జిల్లా హోదాను పొందింది.

అటవీ

[మార్చు]

బార్పేట మానస్ జాతీయ అభయారణ్యంమానస్ జాతీయ అభయారణ్యానికి ప్రవేశ ద్వారంగా ఉంది. ఈ అభయారణ్యం అస్సాంలోని జాతీయ ఉద్యానవనాలలో ఒకటి, భారతదేశంలోని పులుల కేంద్రాలలో ఒకటిగా ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [3] బార్పేట పట్టణ జనాభా 42,649గా ఉంది. 0-6 సంవత్సరాల లోపు పిల్లల జనాభా 3673 ఉండగా, ఇది బార్పేట మొత్తం జనాభాలో 8.61%గా ఉంది. ఆడవారి నిష్పత్తి 958 సగటుతో పోలిస్తే 1008గా ఉంది. అంతేకాకుండా, అస్సాం రాష్ట్ర సగటు 962తో పోలిస్తే బార్పేటలో బాలల సగటే నిష్పత్తి 994 గా ఉంది. బార్పేట నగర అక్షరాస్యత రేటు, రాష్ట్ర సగటు 72.19% కన్నా 90.77% ఎక్కువ. బార్పేటలో పురుషుల అక్షరాస్యత 94.86% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 86.73%గా ఉంది.

రవాణా

[మార్చు]

బార్పేట రోడ్డులో సమీప రైల్వే స్టేషన్, లోక్ ప్రియా గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం, ధుబ్రి ప్రాంతంలో ఓడరేవు ఉన్నాయి.[4] బార్పేట పట్టణం హౌలీ ద్వారా జాతీయ రహదారి 31కి కలుపబడి ఉంది. జాతీయ రహదారి 427 హజో-డౌలషాల్ ద్వారా గువహాటికి కలుపుతుంది.

రాజకీయాలు

[మార్చు]

ఈ పట్టణం బార్పేట లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[5] భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమ్మెల్యేగా జానియా ఎల్ఐసి నుండి, బార్పేట నియోజకవర్గం నుండి ఎంపిగా ప్రాతినిథ్యం వహించాడు. అసెంబ్లీలో సయ్యద్ అబ్దుర్ రూఫ్, ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ, ఇతర నాయకులు కూడా బార్పేటకు ప్రాతినిధ్యం వహించారు.[6] జానియా ఎల్‌ఐసి స్టాండింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఖలేక్ (అస్సామీ రాజకీయ నాయకుడు) 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. జిల్లాలో జానియా, బాగ్‌బార్, సోర్భోగ్, సరుఖేత్రి, భబానిపూర్, చెంగా, బార్పేట అని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[7]

వాతావరణం

[మార్చు]

బార్పెటాలో ఉప ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఇక్కడి ప్రజలు శీతాకాలం, వేసవికాలం రెండింటినీ ఆస్వాదించవచ్చు. వేసవికాలంలో కొన్నిసార్లు ఈ నగరంలో ఉష్ణోగ్రత 35 నుండి 39 తో వేడిగా ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - బార్పేట
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.8
(83.8)
32.2
(90.0)
38.4
(101.1)
39.0
(102.2)
37.0
(98.6)
38.3
(100.9)
36.5
(97.7)
36.2
(97.2)
35.8
(96.4)
34.3
(93.7)
31.0
(87.8)
28.1
(82.6)
39.0
(102.2)
సగటు అధిక °C (°F) 23.6
(74.5)
26.2
(79.2)
30.0
(86.0)
31.2
(88.2)
31.2
(88.2)
31.7
(89.1)
31.9
(89.4)
32.2
(90.0)
31.7
(89.1)
30.3
(86.5)
27.6
(81.7)
24.7
(76.5)
29.4
(84.9)
సగటు అల్ప °C (°F) 10.3
(50.5)
12.0
(53.6)
15.9
(60.6)
20.0
(68.0)
22.7
(72.9)
24.9
(76.8)
25.6
(78.1)
25.6
(78.1)
24.7
(76.5)
21.9
(71.4)
16.7
(62.1)
11.8
(53.2)
19.3
(66.8)
అత్యల్ప రికార్డు °C (°F) −2.7
(27.1)
−0.5
(31.1)
6.1
(43.0)
11.1
(52.0)
16.2
(61.2)
20.4
(68.7)
21.4
(70.5)
22.1
(71.8)
17.7
(63.9)
10.6
(51.1)
5.5
(41.9)
−0.7
(30.7)
−2.7
(27.1)
సగటు వర్షపాతం mm (inches) 11.9
(0.47)
18.3
(0.72)
55.8
(2.20)
147.9
(5.82)
244.2
(9.61)
316.4
(12.46)
345.4
(13.60)
264.3
(10.41)
185.9
(7.32)
91.2
(3.59)
18.7
(0.74)
7.1
(0.28)
1,717.7
(67.63)
సగటు వర్షపాతపు రోజులు 1.8 2.9 5.8 13.1 17.0 19.6 22.3 18.5 15.2 7.4 2.8 1.3 127.7
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 79 65 57 68 75 81 83 82 83 82 82 82 77
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 226.3 214.7 220.1 201.0 192.2 132.0 124.0 161.2 138.0 204.6 231.0 232.5 2,277.6
Source: ప్రపంచ వాతావరణ సంస్థ

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పట్టణం వైశాల్యంలో జిల్లాలో రెండవ స్థానంలో ఉంది. ఇది ప్రశాంతమైన, కాలుష్యరహితమైన పట్టణం. నగరంలో మితమైన మోటర్ వాహనాలు మాత్రమే ఉన్నాయి. నగరమంతటా సెలయేర్లు, నీటి కాలువలు ఉన్నాయి. వైష్ణవ సన్యాసి మహాదేవ్ స్థాపించిన బార్పేట సత్రం ఉంది. గతంలో ఇది ట్రాంఫోర్ట్ పరిశ్రమకు కేంద్రంగా ఉండేది. దంతం పనితనానికి ప్రత్యేకత కలిగి ఉంది.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  1. అంబికాగిరి రైచౌదరి (కవి, జాతీయవాది)
  2. బనికాంత కాకాటి (భాషావేత్త)
  3. చంద్ర భారతి (కవి)
  4. కల్నల్ గురుప్రసాద్ దాస్ (రైళ్ల కోసం వాక్యూమ్ బ్రేక్‌లను కనుగొన్నాడు)
  5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (భారత ఐదవ రాష్ట్రపతి)
  6. కల్పన పటోవరీ (గాయని)
  7. మహేంద్ర మోహన్ చౌదరి (అస్సాం నాల్గవ ముఖ్యమంత్రి)
  8. రామేశ్వర్ పాథక్ (కమ్రుపి లోక్‌గీత్ గాయకుడు)

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Barpeta
  2. "Archived copy". Archived from the original on 21 July 2011. Retrieved 4 November 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns". Census Commission of India.
  4. "Barpeta". lumain30.com.
  5. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-11-04.
  6. "Members of Constitutional Assembly".
  7. http://umain30.com/profile

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బార్పేట&oldid=4280923" నుండి వెలికితీశారు