గోల్‌పారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోల్‌పారా
పట్టణం
గోల్‌పారా పట్టణంలోని పడవలు
గోల్‌పారా పట్టణంలోని పడవలు
గోల్‌పారా is located in Assam
గోల్‌పారా
గోల్‌పారా
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
గోల్‌పారా is located in India
గోల్‌పారా
గోల్‌పారా
గోల్‌పారా (India)
నిర్దేశాంకాలు: 26°10′N 90°37′E / 26.17°N 90.62°E / 26.17; 90.62Coordinates: 26°10′N 90°37′E / 26.17°N 90.62°E / 26.17; 90.62
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాగోల్‌పారా
ప్రభుత్వం
 • నిర్వహణగోల్‌పారా పురపాలక సంస్థ
సముద్రమట్టం నుండి ఎత్తు
35 మీ (115 అ.)
జనాభా
(2011)
 • మొత్తం53,430
భాషలు
 • అధికారికఅస్సామీ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
783123-783101[1]
ISO 3166 కోడ్IN-AS
వాహనాల నమోదు కోడ్ఏఎస్-18
జాలస్థలిgoalpara.gov.in

గోల్‌పారా, అస్సాం రాష్ట్రంలోని గోల్‌పారా జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ పట్టణం పశ్చిమ గువహాటికి 134 కి.మీ. (83మైళ్ళ) ల దూరంలో ఉంది.

పద వివరణ[మార్చు]

ఇది "గ్వాల్టిప్పికా" అనే పదం నుండి ఉద్భవించిందని చెబుతారు. గోల్‌పారా అంటే గువాలి గ్రామం లేదా పాల పురుషుల గ్రామం అని అర్ధం.[2] స్థానిక మాండలికంలో, "పారా" అంటే గ్రామం అని అర్థం

భౌగోళికం[మార్చు]

గోల్‌పారా పట్ణం బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉంది.[3] సముద్రమట్టానికి 35 మీటర్లు (114 అడుగులు) ఎత్తులో ఉంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున గోల్‌పారా నడిబొడ్డున ఉన్న హులుకాండ కొండ, పట్టణంలోని ప్రకృతి దృశ్యాలలో ఒకటి. ఇక్కడ వివిధ రకాల జలపాతాలు, కోతులు ఉన్నాయి. అక్టోబరు-మార్చిలో ఉర్పాడ్ బీల్ వలస పక్షుల కేంద్రంగా మారుతుంది.

గోల్‌పారా జిల్లాలో 8 బ్లాక్‌లు ఉన్నాయి:

 • బలిజన
 • జలేశ్వర్
 • ఖర్ముజా
 • కృష్ణై
 • కుచ్ధోవా
 • లఖిపూర్
 • మాటియా
 • రంగ్జులి

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో మొత్తం జనాభా 53,430 ఉండగా వీరిలో 26,970 మంది పురుషులు, 26,460 మంది మహిళలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 6,125 మంది 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. గోల్‌పారాలో 39,627 (జనాభాలో 74.2% మంది) అక్షరాస్యులు ఉండగా పురుషుల అక్షరాస్యత 77.1% గా, స్త్రీ అక్షరాస్యత 71.2%గా ఉంది. షెడ్యూల్డ్ కులాలవారు 6,158 మంది, షెడ్యూల్డ్ తెగలవారు 1,702 మంది ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 11,617 గృహాలు ఉన్నాయి.[4]

మతం[మార్చు]

ఈ పట్టణంలోని జనాభాలో 53.65% మంది ముస్లింలు, 44.99% మంది హిందువులు, 1.36% మంది ఇతరులు ఉన్నారు.[5]Circle frame.svg

పట్టణంలోని మతాలు (2011)[5]

  ఇతరులు (1.36%)


భాషలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అధికారిక భాష అస్సామీ భాషను పట్టణ జనాభాలో 77.9% మంది మాట్లాడుతుండగా, 16.8% మంది బెంగాలీ భాషను, 3.6% మంది హిందీ భాషలను మాట్లాడుతున్నారు. గోల్‌పారా పట్టణంలో అస్సామీ భాషలోనే ఎక్కువమంది మాట్లాడుతున్నారు.


Circle frame.svg

గోల్‌పారా పట్టణంలోని భాషలు (2011)[6]

  హిందీ (3.6%)
  ఇతరులు (1.7%)


ఆరోగ్యం[మార్చు]

గోల్‌పారా జిల్లాలోని భలుకుడిలో 200 పడకల ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ ఉంది. ఇందులో అత్యాధునిక పరికరాలు, వివిధ ఓ.టి.లు ఉన్నాయి. గోల్‌పారా జిల్లాలో బ్లాక్ పిహెచ్‌సి, మినీ పిహెచ్‌సి, ఎస్‌హెచ్‌సి, స్టేట్ డిస్పెన్సరీలు, సబ్ సెంటర్లతో సహా మొత్తం 181 ఆస్పత్రులు ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

గోల్‌పారా జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు (తూర్పు గోల్‌పారా ఈస్ట్, పశ్చిమ గోల్‌పారా, జలేశ్వర్, దుధ్నోయి) ఉన్నాయి. మొదటి మూడు ధుబ్రీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుత గోల్‌పారా ఎమ్మెల్యేలు:

 1. తూర్పు గోల్‌పారా: ఎకె రషీద్ ఆలం (ఐఎన్‌సి)
 2. పశ్చిమ గోల్‌పారా: అబ్దుర్ రషీద్ మొండల్ (కాంగ్రెస్)
 3. జలేశ్వర్: సాహబ్ ఉద్దీన్ అహ్మద్. (ఎఐయుడిఎఫ్)
 4. దుధ్నోయి: దీపక్ రభా. (బిజెపి)

మూలాలు[మార్చు]

 1. "Pin Code of Goalpara". citypincode.in. Archived from the original on 2016-09-16. Retrieved 2020-11-17. CS1 maint: discouraged parameter (link)
 2. Brief history of Goalpara
 3. Falling Rain Genomics, Inc - Goalpara
 4. https://censusindia.gov.in/2011census/dchb/1803_PART_B_DCHB_GOALPARA.pdf (16 April 2014). "District Census Handbook; Goalpara" (PDF). censusindia.gov.in. Census Commission of India. Retrieved 2020-11-17.
 5. 5.0 5.1 "C-16 Population By Religion - Assam". census.gov.in. Retrieved 2020-11-17. CS1 maint: discouraged parameter (link)
 6. "C-16 Population By Mother Tongue - Goalpara". censusindia.gov.in. Retrieved 2020-11-17. CS1 maint: discouraged parameter (link)