కాజల్‌గావ్
Kajalgaon | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°28′27″N 90°33′52″E / 26.474226°N 90.564443°E | |
దేశం | India |
రాష్ట్రం | అసోం |
జిల్లా | చిరంగ్ |
Government | |
• Body | Kajalgaon Municipal Board |
Languages | |
• Official | Bodo |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | AS-26 |
కాజల్‌గావ్, అసోం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలో ఈ పట్టణం ఉంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాలను నియంత్రిస్తుంది.[1] రాష్ట్ర రాజధానికి 152 కి.మీ.ల దూరంలో ఉంది.
భౌగోళికం
[మార్చు]కాజల్‌గావ్ పట్టణం దక్షిణం వైపు డాంగ్‌టోల్ తహసీల్, బొంగైగావ్ తహసీల్, శ్రీజాంగ్రామ్ తహసీల్, తూర్పు వైపు బోరోబజార్ తహసీల్ ఉన్నాయి. బొంగైగావ్, కోక్రఝార్, బిలాసిపారా, గోల్‌పారా వంటి నగరాలు కాజల్‌గావ్‌కు సమీపంలో ఉన్నాయి. ఈ స్థలం చిరాంగ్ జిల్లా, బొంగైగావ్ జిల్లాల సరిహద్దులో ఉంది.
పరిపాలన
[మార్చు]ఈ పట్టణం పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాలను కాజల్‌గావ్ పట్టణ కమిటీ నిర్వర్తిస్తోంది. కాజల్‌గావ్ పిన్ కోడ్ 783385 కాగా, పోస్టల్ ప్రధాన కార్యాలయం ధాలిగావ్ వద్ద ఉంది.
రవాణా
[మార్చు]రైలు మార్గం డాంగ్టాల్ రైల్వే స్టేషను, న్యూ బొంగైగావ్ యార్డ్ రైల్వే స్టేషను కాజల్‌గావ్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు.
మూలలు
[మార్చు]- ↑ "Kajalgaon Village". www.onefivenine.com. Retrieved 2020-12-21.