Jump to content

కోక్రాఝార్

అక్షాంశ రేఖాంశాలు: 26°24′N 90°16′E / 26.4°N 90.27°E / 26.4; 90.27
వికీపీడియా నుండి
(కోక్రఝార్ నుండి దారిమార్పు చెందింది)
కోక్రఝార్
పట్టణం
కోక్రఝార్ is located in Assam
కోక్రఝార్
కోక్రఝార్
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
కోక్రఝార్ is located in India
కోక్రఝార్
కోక్రఝార్
కోక్రఝార్ (India)
Coordinates: 26°24′N 90°16′E / 26.4°N 90.27°E / 26.4; 90.27
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
Divisions10 wards
Government
 • Typeపురపాలక సంస్థ
 • Bodyకోక్రఝార్ పురపాలక సంస్థ
Elevation
38 మీ (125 అ.)
జనాభా
 (2011)
 • Total34,136
భాషలు
 • అధికారికబోడో, అస్సామీ
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
783370
టెలిఫోన్ కోడ్03661
Vehicle registrationఏఎస్-16
స్త్రీ పురుష నిష్పత్తి52:50 (మగ:ఆడ)
అక్షరాస్యత89.96%

కోక్రఝార్, అస్సాం రాష్ట్ర్రం కోక్రఝార్ జిల్లాలోని ఒక పట్టణం. బోడోలాండ్ టెరిటోరియల్ ప్రాంతానికి చెందిన స్వతంత్ర భూభాగం.

ఈ కోక్రఝార్ పట్టణం గౌరంగ్ నది ఒడ్డున ఉంది. నార్త్ ఈస్ట్ ఇండియన్ రైల్వే నగరాన్ని ఉత్తర కోక్రఝార్ భాగంగా, దక్షిణ కోక్రఝార్ భాగంగా విభజిస్తోంది. ఈ పట్టణం కోక్రఝార్ జిల్లా, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బిటిసి)లకు ప్రధాన కార్యాలయంగా ఉంది.

భౌగోళికం

[మార్చు]

26°24′N 90°16′E / 26.4°N 90.27°E / 26.4; 90.27 అక్షాంశరేఖాంశాల మధ్య ఈ కోక్రాఝార్ పట్టణం ఉంది.[1] దీని సగటు ఎత్తు 38 మీటర్లు (124 అడుగులు)గా ఉంది.

జనాభా

[మార్చు]
కోక్రఝార్ వద్ద ఒక బ్రహ్మ ఆలయం

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] కొక్రఝార్ జనాభా 31,152గా ఉంది. ఈ మొత్తం జనాభాలో పురుషులు 52% మంది, స్త్రీలు 48% మంది ఉన్నారు. కోక్రఝార్ సగటు అక్షరాస్యత రేటు 79% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 84%, స్త్రీ అక్షరాస్యత 74%గా ఉంది. కోక్రఝార్ జనాభాలో 10%మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు. జిల్లాలో కోక్రఝార్, గోస్సిగావ్, బసుగావ్ అనే 3 ఉప విభాగాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

అస్సాం రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతాల నుండి కోక్రఝార్‌కు ప్రభుత్వ బస్సులు నడుపబడుతున్నాయి.

ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో ఉన్న బరౌని-గువహాటి లైన్‌లోని న్యూ జల్పాయిగురి-న్యూ బొంగాగావ్ విభాగంలో కోక్రాజార్ రైల్వే స్టేషన్ ఉంది. దేశంలోని ముఖ్య నగరాలైన గువహాటి, కోల్‌కాతా, క్రొత్త ఢిల్లీ, ముంబై, చెన్నై మొదలైన నగరాలకు రైలు సౌకర్యం ఉంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్, కమ్రూప్ ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్, నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, వివేక్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రత్ ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్ళు ఈ కోక్రఝార్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.

పార్కులు

[మార్చు]
  • గౌరంగ్ పార్కు
  • బోడోఫా చిన్నారుల పార్కు

చదువు

[మార్చు]

ఈ పట్టణంలో అనేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలో ఉన్న అన్ని కళాశాలలు 2017 నుండి బోడోలాండ్ విశ్వవిద్యాలయం పరిధిలో అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి.

రాజకీయాలు

[మార్చు]

కోక్రఝార్ పట్ణణంలో తూర్పు కోక్రఝార్, పడమర కోక్రాఝార్, గోస్సైగావ్ అనే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కోక్రఝార్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.[3]

క్రీడలు

[మార్చు]

ఈ పట్టణం ఫుట్‌బాల్ ఆటకు ప్రాచూర్యం పొందింది. ఈ పట్టణంలో అనేక ఫుట్‌బాల్ క్లబ్‌లు ఉన్నాయి. ఈ పట్టణంలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టైక్వాండో, కబడ్డీ, చదరంగం, ఆర్చెరీ, క్రికెట్, ఇతర దేశీయ ఆటలు కూడా ఆడుతారు.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Kokrajhar
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  3. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-10-05.

వెలుపలి లంకెలు

[మార్చు]