Jump to content

కోక్రాఝర్ జిల్లా

వికీపీడియా నుండి
(కోక్రఝార్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
కోక్రఝార్ జిల్లా
কোকৰাঝাৰ জিলা
జిల్లా
డిప్లై బీల్ సరస్సు
డిప్లై బీల్ సరస్సు
Map of Kokrajhar district in Assam
Map of Kokrajhar district in Assam
Countryభారత దేశము
Stateఅసోం
ప్రధాన కార్యాలయంకోక్రఝార్
విస్తీర్ణం
 • Total3,129 కి.మీ2 (1,208 చ. మై)
జనాభా
 (2011)
 • Total8,86,999
 • జనసాంద్రత280/కి.మీ2 (730/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
Websitekokrajhar.gov.in

అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో కోక్రఝార్ జిల్లా (అస్సాం:কোকৰাঝাৰ জিলা) ఒకటి. కోక్రఝార్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3,169చ.కి.మీ. జనసంఖ్య 905,764. వీరిలో హిందువులు 594,168, ముస్లిములు 184,441 (20.36%). ఈశాన్య భారత్‌కు కోక్రఝార్ ద్వారంగా ఉంది. రైల్వే, రహదార్లు సమీప రాష్ట్రాలకు అనుసంధానమై ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

కోక్రఝార్ జిల్లా మునుపు గోల్‌పరా జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1957 అప్పటి అస్సాం ముఖ్యమంత్రి బిమ్లా ప్రసాద్ చలిహ ఆధ్వర్యంలో 3 ఉపవిభాగాలు చేయబడ్డాయి. వాటిలో ఒకటి కోక్రఝార్. 1983 జూలై 1న కోక్రఝార్ జిల్లాగా రూపొందించబడింది.[1]1989లో కోక్రఝార్, గోల్‌పరా జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి బొంగైగావ్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1]

భౌగోళికం

[మార్చు]

కోక్రఝార్ జిల్లా వైశాల్యం 3129చ.కి.మీ., [2] రష్యాలోని వైగోద్వీపంతో సమానం. .[3] కోక్రఝార్ జిల్లా బ్రహ్మపుత్రానది ఉత్తరతీరంలో ఉంది. ఇది ఈశాన్య భారతంలోని 7 రాష్ట్రాలకు ద్వారంగా ఉంది. కోక్రఝార్ జిల్లా సరిహద్దులలో బొంగైగావ్ జిల్లా, (ప్రస్తుతం ఇది చిరంగ్ జిల్లా), ధుబ్రి (పశ్చిమ బెంగాల్) బార్పేట, భూటాన్ ఉన్నాయి.

జాతీయ అభయారణ్యం

[మార్చు]
  • జిల్లాలో మనస్ నేషనల్ పార్క్‌లో కొంతభాగం ఉంది.

ఆర్ధికం

[మార్చు]
Agriculture in Kokrajhar district

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కోక్రఝార్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర11జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: గొస్సైగయాన్, పశ్చిమ కోక్రఝార్, తూర్పు కోక్రఝార్ మరుయు సిడ్లి.[5] వీటిలో గొస్సైగయాన్ నియోజకవర్గం షేడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకించబడింది.[5]
  • 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కోక్రఝార్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[6]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 886,999, [7]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 467వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 280 [7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 5.19%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 958:1000 [7]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 66.63%.[7]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
Religion in Kokrajhar district[9]
Religion Percent
Hindu
  
65.60%
Islam
  
20.36%
Christianity
  
13.72%
Others
  
0.32%
Ethnic Groups in Kokrajhar district
Language Percent
Bodo
  
32.37%
Bengali
  
21.06%
Assamese
  
20.28%
Santhal
  
16.70%

ప్రజలు

[మార్చు]

జిల్లాలో వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ప్రత్యేకమైన ఎవరికి ఆధిక్యత లేదు. బోడో, అస్సామీ ప్రజలలో అత్యధింగా హిందువులు, స్వల్పంగా క్రైస్తవులు ఉన్నారు. బెంగాలీ ప్రజలు దాదాపు అందరూ ముస్లిములుగా ఉన్నారు. శాంతల్ ప్రజలలో 90% క్రైస్తవులు ఉన్నారు.[10]

సస్కృతి

[మార్చు]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
  • ఆంతై గ్వాలయొ : చంద్రపరా సమీపంలో గ్వారంగ్ నదీ సమీపంలో ఉంది.
  • మాహామాయా : ఇది కోక్రఝార్, దుబ్రి సరిహద్దులో ఉంది.
  • తండ్వి బినేశ్వర్ బ్రహ్మ మెమోరియల్ పార్క్ : ఇది గ్వరంగ్ నదీ తీరంలోబతేర్మరీ వద్ద ఉంది.
  • డైమలు పార్క్ : ఇది ఖరిగయాన్‌లో ఉంది.

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]

1990లో కోక్రఝార్ జిల్లాలో 500 చ.కి.మీ వైశాల్యంలో " మనస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[11] ఈ జిల్లా ఈ పార్క్ ను 4 ఇతర జిల్లాలతో పంచుకుంటుంది. .

ప్రముఖులు

[మార్చు]
  • బినేశ్వర్ బ్రహ్మ : కవి, రచయిత.
  • ఉపేంద్రనాథ్ బ్రహ్మ : బోడో నాయకుడు.
  • రంజిత్ శేఖర్ మూషహరీ : ఐ.పి.ఎస్ అధికారి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మేఘాలయ గత గవర్నర్.
  • సంసుమ ఖుంగూర్ బ్విశ్వమూతియరీ : బోడో భూమి రాజకీయనాయకుడు, జాతీయవాది, సాంఘిక వాది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Waigeo 3,154km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  5. 5.0 5.1 "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  6. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  9. District Report - KOKRAJHAR Archived 2017-03-29 at the Wayback Machine Ministry of Minority Affairs, Govt of India
  10. Census 2001
  11. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూస:అస్సాంలోని జిల్లాలు