Jump to content

కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా

వికీపీడియా నుండి
కర్బి ఆంగ్లాంగ్
జిల్లా
మాంజా సమీపంలోని లాంగ్క్వోకు జలపాతం
మాంజా సమీపంలోని లాంగ్క్వోకు జలపాతం
District location in Assam
District location in Assam
Country India
Stateఅసోం
Headquartersదిఫు
విస్తీర్ణం
 • Total10,434 కి.మీ2 (4,029 చ. మై)
జనాభా
 (2011)
 • Total9,65,280
 • జనసాంద్రత93/కి.మీ2 (240/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)
Websitehttp://www.karbianglong.nic.in

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో కర్బి ఆంగ్లాంగ్ జిల్లా ఒకటి. జిల్లా తూర్పు సరిహద్దులో గోలాఘాట్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో మారిగావ్ జిల్లా, మేఘాలయ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో నాగావ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో దిమా హసాయో జిల్లా, నాగాలాండ్ రాష్ట్రం ఉన్నాయి. దిఫు జిల్లా మఖ్య పట్టణం. జిల్లా 25º33' - 26º35' డిగ్రీల ఉత్తర అక్షాంశం 92º10' - 93º50' తూర్పు రేఖాంశం. జిల్లా వైశాల్యం 10,434 చదరపు కిలోమీటర్లు (4,029 చ. మై.),[1] ఇది హవాయ్ వైశాల్యానికి సమానం.[2]

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో 24 జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

విభాగాలు

[మార్చు]
  • జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: దిఫు, హంరెన్, బొకజన్.
  • డిఫు ఉపవిభాగం అదనంగా 2 రెవెన్యూ సర్కిల్స్‌గా విభజించబడింది : దిఫు, ఫులోని.
  • హంరెన్ ఉప విభాగంలో ఒకే ఒక రెవెన్యూ సర్కిల్ ఉంది: డంకముకం రెవెన్యూ సర్కిల్.
  • బొంకజన్ ఉప విభాగంలో ఒకే ఒక ర్వ్వెన్యూ సర్కిల్ ఉంది: సిలోనిజన్ రెవెన్యూ సర్కిల్.
  • డిఫు ఉపవిభాగం:
  • డిఫు రెవెన్యూ సర్కిల్:
  • ఫులోని రెవెన్యూ సర్కిల్.
  • బొకాజన్ ఉపవిభాగం.
  • సిలోనిజన్ రెవెన్యూ సర్కిల్.
  • హంరెన్ ఉపవిభాగం:
  • డొంగ్క్ముకం రెవెన్యూ సర్కిల్.
  • 4 పార్లమెంటు నియోజక వర్గాలు: బొకాజన్, హౌరాఘాట్, డిఫు, బొయితలాంగ్సొ.
  • ఇవన్నీ 3 ఎస్.టి అటానిమస్ డిస్ట్రిక్‌లో భాగంగా ఉన్నాయి.

జిల్లాకు కేంద్రంగా డిఫు పట్టణం ఉంది. జిల్లాలో ఉన్న ఇతర పట్టణాలు: బొకాజన్, డొంకమొకం, డొకమొక, హంరెన్, హైరాఘాట్. జిల్లాలో మొత్తం 2633 గ్రామాలు ఉన్నాయి.

  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: బొకాజన్, హౌరాఘాట్, డిఫు మరుయు బొయితలాంగ్సొ.[4] 4 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల కొరకు ప్రత్యేకించబడ్డాయి.[4]
  • ఇవన్నీ అటానిమస్ డిస్ట్రిక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[5]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 965,280,[6]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. మొంటనా నగర జనసంఖ్యకు సమం..[8]
640 భారతదేశ జిల్లాలలో. 451వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 93 .[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.58%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000,[6]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 74%[6]
పురుషుల అక్షరాస్యత 82% [6]
స్త్రీల అక్షరాస్యత 65% [6]
జాతియ సరాసరి (72%) కంటే.
  • జిల్లాలో అనుమిస్టుల సంఖ్య 670,139, క్రైస్తవుల సంఖ్య 117,738, ముస్లిములు 18,091 (2.22%).

జిల్లాలో స్థానికప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. వీపిలో అత్యధికంగా కర్బి ప్రజలు ఉన్నారు. వీరు కాక దింసా ప్రజలు, నేపాల్ గొర్కాలు, రెంగ్మాలు, కుక్కీలు, గారోలు, తివాలు (లాలంగ్), ఖాసిస్, హ్మర్లు, మిజాలు, చక్మాలు ఉన్నారు.

భాషలు

[మార్చు]

స్థానిక భాష కర్బి ఒకప్పుడు రాజభాషగా ఉండేది. జిల్లాలో కర్బి భాష ఇప్పటికీ ప్రధానభాషగా ఉంది. జిల్లాలో దింసా, గారో-దిమా, రెంగ్మా, కుకి, నెపాల్, అస్సామీ, తాజ్ అయిటన్ భాషలు వాడుకలో ఉన్నాయి. షాన్ భాషను బర్మీస్ లిపిలో వ్రాస్తుంటారు.[9]

సంస్కృతి

[మార్చు]

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

అస్సాం రాష్ట్రంలోని పర్వత జిల్లాలో ఒకటైన కర్బి అంగ్లాంగ్ ప్రకృతి అందాలకు పుట్టిల్లు. మనోహరమైన ఈ ప్రాతం ఇప్పటికీ పర్యాటకులకు కొత్తగానే ఉంది. అదనంగా జిల్లాలో వివిధ గిరిజన సంప్రదాయాలు ఉన్నాయి.

  • డిఫు : ఇది చిన్నదైనా చాలా ఉత్సాహవంతగా ఉండే పట్టణం. ఈ పట్టణం కొండ మీద నిర్మించబడి ఉంది.
  • సిల్భెటా : దిఫు నుండి 37 కి.మీ దూరంలో ఉన్న సిల్బెటా సుందరమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పట్టణం చుట్టూ వర్షారణ్యాలు ఉన్నాయి. సహజసిద్ధంగా ఇక్కడ ఉన్న శిలాసేతులు కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పరిగణించబడుతుంది..
  • ఆకాశిగంగా: డిఫుకు 65 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పైనుంచి కిందకు పడుతున్న పవిత్ర జలపాతం పక్కన ఒక శివాలయం ఉంది.
  • అంరెంగ్ : హంరెన్న్‌లో చాలా ఆకర్షణీమైన ప్రాతం అంర్వ్ంగ్. ఇది పచ్చని వృక్షాలమద్య కొండమీద ఉంది. ఇక్కడ ఒక పెద్ద శిల నుండి నీలవర్ణంలో జలధార కిందకు పడుతూ ఉంటుంది.

అంరెంగ్ సెలయేరు పక్కన నిర్మించబడిన పర్యాటక భవనంలో పర్యాటకులు సుందర ప్రకృతిని ఆరాధించవచ్చు.

  • గరంపాని: గరం పని విల్డ శాక్చ్యురీలో హూలాక్ గిబ్బిన్లు, గోల్డేన్ లంగూర్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో జాతీయరహదారి సమీపంలో ఒక వేశినీటి ఊట ఉంది.
  • 'దిక్రుత్ : బోసం పర్వతం నుడి జాలువాతున్న సుందర జలపాతాలలో ఇది ఒకటి.
  • ఈ జిల్లాలో దేవపాని దుర్గా మందిరం ఉంది.

వృక్షసంపద , జంతుసంపద

[మార్చు]

1952లో కర్బి అంగ్లాంగ్ జిల్లాలో 6 కి.మీ వైశాల్యంలో " గరంపని విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడింది. [10] జిల్లాలో స్థాపించబడిన మరొక 37 కి.మీ వైశాల్యం ఉన్న అభయారణ్యం " నంబూర్ విల్డ్‌లైఫ్ శాల్చ్యురీ ". ప్రముఖ నేచురలిస్ట్ డాక్టర్ అంవరుద్దీన్ చౌదరి వ్రాసిన " ఎ నేచురలిస్ట్ ఇన్ కర్బి అంక్గ్లాంగ్ " పుస్తకంలో వన్యమృగ పరిశోధనలు కర్బి అంగ్లాంగ్‌లో ఉన్న వన్యమృగ వీక్షణా కేంద్రాల గురించి పూర్తి వివరాలు లభిస్తాయి. ఈ పుస్తకంలో జిల్లాలోని వన్యమృగ జీవన చిత్రాలు కూడా చోటు చేసుకున్నాయి. [11][12] జిల్లాలో 75% అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో సతతహరితారంయాలు అధికభాగం విస్తరించి ఉన్నాయి. అక్కడక్కడా చిత్తడి నేలలు కూడా ఉన్నాయి. జిల్లా ప్రజలు తమజిల్లాలో " హూలాక్ గిబ్బాన్ " అధిక సంఖ్యలో ఉన్నాయని ఈ విషయంలో ఈ ప్రాంతం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని సగర్వంగా చెప్తుంటారు.

మాధ్యమం

[మార్చు]

కర్బి అంగ్లాంగ్ జిల్లాలో కర్బి భాషాలో 7 వార్తాపత్రికలు ఉన్నాయి: కర్బి భాషలో వార్తా పత్రికలకు ప్రాధాన్యత తెలిసేలా మొదటగా " ది అర్లెంగ్ డైలీ " ప్రచురించబడింది. తరువాత అత్యధికంగా విక్రయించబడుతున్న పత్రిక " తెకర్ ". తరువాత మొదటిసారిగా ఆర్.ఎన్.ఐ నమోదు చేసుకున్నకర్బి పత్రిక ప్రధానమైనవిగా భావించబడుతున్నాయి. 2005లో కర్బి అంగ్లాంగ్ జిల్లాలోని చిన్న పట్టణమైన బొకులియాఘాట్ నుండి ప్రచురించబడుతున్న హిందీ పత్రిక " జన ప్రహరి " మొదలైనవి జిల్లా మాధ్యమాలలో ప్రధానమైనవిగా భావించబడుతుంది.

చరిత్ర

[మార్చు]

బ్రిటిష్ పాలనా కాలంలో ప్రస్తుత కర్బి ఆంగ్లాంగ్ ప్రాంతం దింసా సామ్రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. 1854లో దింసారాజైన సెంగ్యా తులారాం హంసు మరణించిన తరువాత ఈ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా మారింది. దింసారాజైన సెంగ్యా తులారాం కాలంలో ప్రస్తుత జిల్లా కేంద్రం అయిన డిఫూ ప్రధాన్యత కలిగిన పట్టణంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం 1874లో ఈ ప్రాంతం షెడ్యూల్డ్ జిల్లాగా మారింది. 1935 నుండి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పాలనా నిర్వహణ కొనసాగింది. 1951 నవంబరు 17 యునైటెడ్ మైకర్ జిల్లాగా అవతరుంచింది. తతువాత జిల్లాల పుంర్విభజన సమయంలో మైకర్ నుండి 1970 నవంబరు 17న మైకర్ హిల్స్ జిల్లా రూపొందించబడింది.[13] తరువాత 1976 అక్టోబరు 14న మైకర్ హిల్స్ జిల్లా " కబ్రి అంగ్లాంగ్ జిల్లా"గా రూపాంతరం చెందింది.[13]

గుర్తించదగిన పట్టణాలు

[మార్చు]
  • బొకులియా
  • చొకిహోల
  • దిఫు
  • దొక్మొక
  • డొంకమొకం
  • బొకాజన్
  • హాంరెన్
  • హ్సురాఘాట్
  • మంజ
  • సమేలంగ్సొ

ప్రముఖులు

[మార్చు]
  • ప్రొఫెసర్ రొంగ్బాంగ్ తెరంగ్: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత. ఆయన అస్సాం సాహిత్యసభ అధ్యక్షుడు. ఆయన డిఫు ప్రభుత్వ కాలేజి ప్రొంసిపల్ , అస్సామీ ప్రొఫెసర్‌గా పని చేసాడు. 1989లో ఆయన " రొంగ్మిల్లిర్ హంహి " పుస్తకానికి కేంద్రప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును పొందారు.
  • " కీ.శే సెంసంసింగ్ ఇంగ్తి " కర్బి అంగ్లాంగ్ జిల్లా ద్థాపకుడు.

ఎడ్యుకేషన్

[మార్చు]

కర్బి అనేక, విద్యా సంస్థ యొక్క వైవిధ్యం ఉంది.

కర్బి విద్యా Institude యొక్క

జాబితా

[మార్చు]

ప్రసిద్ధి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి:
(ఆరోహణ క్రమంలో) '

కళాశాలలు

[మార్చు]
  • బి..ఇడి కాలేజ్, డిపు
  • కామర్స్ కళాశాల, బొకాజన్
  • కామర్స్ కళాశాల,డిఫు
  • డియోపని కాలేజ్, శాంతిపూర్
  • డిఫు గర్ల్ కాలేజ్, డిఫు
  • డిఫు ప్రభుత్వ కళాశాల డిఫు
  • డిఫు లా కాలేజ్, డిఫు
  • తూర్పు కర్బి కాలేజ్, బొకజన్
  • హతలాంగ్బి వెలాంగ్బి కాలేజ్,డీతర్
  • జూనియర్ కళాశాల, హౌరాఘాట్
  • కొపిల్లి జూనియర్ కళాశాల, కొపిల్లిన్
  • లెఫ్టినెంట్. రేణు తెరంగ్పి కాలేజ్, డిఫు
  • ప్రణబ్ జూబ్లీ కళాశాల, సుకంజన్
  • రసింజ కాలేజ్, హంరెన్
  • రిషబ్ జూనియర్ కళాశాల, బొయితలాంగ్సొ
  • రుకాసెన్ కాలేజ్, బొకుల
  • సెమంసన్ సింగ్ ఇంగ్తి కాలేజ్, బొయితలంగ్సొ
  • థాంగ్ నొక్బి కాలేజ్, డొక్మొక
  • వైసంగ్ కాలేజ్, హంరెన్

టెక్నికల్ ఇన్స్టిట్యూట్

[మార్చు]
  • బేసిక్ ట్రైనింగ్ సెంటర్, డిఫు
  • పారిశ్రామిక శిక్షణా సంస్థ ( ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్), డిఫు
  • పాలిటెక్నిక్, డిఫు
  • హిందీ టీచర్ ట్రైనింగ్ సెంటర్, డిఫు

పాఠశాలలు

[మార్చు]
  • అతుర్కిమి అకాడమీ, డిఫు
  • బదన్ మెమోరియల్ ఇంగ్లీష్ హై స్కూల్
  • కల్వరి హోం అకాడమీ, డిఫు
  • చర్చి క్రీస్ట్ స్కూల్, డొక్మొక యొక్క
  • డి.ఎ.వి హయ్యర్ సెకండరీ స్కూల్, డిఫు
  • డెంగ్కిమొ ఇంగ్లీష్ హై స్కూల్. సెంటర్
  • డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్, డిఫు
  • నిత్య ఇంగ్లీష్ స్కూల్, డిసొబయి
  • హోలీ క్రాస్ స్కూల్, డిసొబయి
  • హోలీ ఇన్ఫాంట్ ఇంగ్లీష్ హై స్కూల్, ఫులోని
  • జవహర్ నవోదయ విద్యాలయ, డిఫు
  • కేంద్రీయ విద్యాలయ, బొకజన్
  • క్రిస్ట్ జ్యోతి స్కూల్, డొకొమొక
  • కేంద్రీయ విద్యాలయ, డిఫు
  • కిడిజీ, డిఫు
  • ప్రెస్బిటేరియన్ మిషన్ హై స్కూల్, డిఫు
  • ప్రెస్బిటేరియన్ మిషన్ హై స్కూల్, హంరెన్
  • ప్రెస్బిటేరియన్ మిషన్ హై స్కూల్, కొయిల్మతి
  • మలసి హై స్కూల్, డొలమర
  • మాలిన్ ఇంగ్లీష్ హై స్కూల్, డోలమర
  • ఎం.టి కల్వరి స్కూల్, డిఫు
  • మౌంట్ కార్మెల్ స్కూల్, కొయిలమతి
  • యాత్రీకుల ఇంగ్లీష్ అకాడమీ, ఫులోని
  • రెంగ్బొంఘం హయ్యర్ సెకండరీ స్కూల్, డిఫు
  • సాత్గొయన్ ఇంగ్లీష్ హై, సాత్గొయన్
  • సెయింట్. ఫ్రాన్సిస్ డి అస్సిసి స్కూల్, సమెలంగ్సొ
  • సెయింట్. జేవియర్ ఇంగ్లీష్ స్కూల్, డొక్మొక
  • యుసి స్కూల్, డిఫు
  • విద్యాబాలన్ సాగర్ హై స్కూల్, బొకజన్

వికాసాత్మక ప్రాజెక్టులు

[మార్చు]
  • అస్సాం హిల్స్ మెడికల్ కాలేజ్ అండ్ (అభివృద్ధి కింద) రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డిఫు

విశ్వవిద్యాలయాలు

[మార్చు]
  • అస్సాం విశ్వవిద్యాలయం, డిఫు క్యాంపస్ [14]
  • ఇందిరా మహాత్మా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఐ.జి.ఎన్.ఒ.యు ) అధ్యయనం సెంటర్, డిఫు

మూలాలు

[మార్చు]
  1. Dayawanti, Srivastava; et al., eds. (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Hawai'i (Big Island) 10,434km2
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  5. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415
  9. M. Paul Lewis, ed. (2009). "Aiton: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  10. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
  11. Choudhury, A.U. (1993). A Naturalist in Karbi Anglong. Gibbon Books, Guwahati, India.88pp+maps.
  12. Choudhury, A.U. (2009). A Naturalist in Karbi Anglong. Revised 2nd edn. Gibbon Books, Guwahati, India.152pp.
  13. 13.0 13.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-24. Retrieved 2014-09-25.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూస:అస్సాంలోని జిల్లాలు