కామరూప్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kamrup జిల్లా

কামৰূপ জিলা
దేశంభారతదేశం
రాష్ట్రంAssam
డివిజనుLower Assam
ముఖ్య పట్టణంAmingaon
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుGauhati Lok Sabha constituency
విస్తీర్ణం
 • మొత్తం6,882 km2 (2,657 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం35,96,292
 • సాంద్రత520/km2 (1,400/sq mi)
 • విస్తీర్ణం
235,264
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.95 per cent
 • లింగ నిష్పత్తి914
ప్రధాన రహదార్లుNational Highway 31, National Highway 37
సగటు వార్షిక వర్షపాతం1,400 మి.మీ.
జాలస్థలిఅధికారిక జాలస్థలి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నార్త్ గౌహతి

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో కామరూప్ జిల్లా (అస్సాం:কামৰূপ জিলা) ఒకటి. 2003లో సమైక్య కామరూప్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి నల్బరి, బార్పేట జిల్లాలతో కామరూప్ జిల్లా ఏర్పాటు చేయబడింది. జిల్లాలో కామరూపి సస్కృతి, కామరూపి భాష వాడుకలో ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

2003లో సమైక్య కామరూప్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి నల్బరి, బార్పేట జిల్లాలతో కామరూప్ జిల్లా ఏర్పాటు చేయబడింది. జిల్లాలో కామరూపి సస్కృతి, కామరూపి భాష వాడుకలో ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

చందూబీ సరస్సు

కామరూప్ జిల్లా వైశాల్యం 43చ.కి.మీ.[1] వైశాల్యపరంగా కామరూప్ ఆస్ట్రేలియా దేశంలోని కంగారూ ద్వాపానికి సమానం.[2] కామరూప్ జిల్లా కొన్ని భూభాగం వివాదాలను ఎదుర్కొంటుంది. పొరుగున ఉన్న మేఘాలయ రాష్ట్రానికి చెందిన పశ్చిమ కాశి జిల్లా లోని లాంగ్‌పిహ్ గ్రామం గురించిన వివాదం కొనసాగుతుంది.[3]

హైడ్రోగ్రఫీ[మార్చు]

జిల్లాలో వడ్ ప్రధాన పంటగా ఉంది. నదీతీరానికి అతి సమీపంలో ఉన్న కారణంగా భూటాన్ దిశగా ఉన్న పర్వతాలకి సమీపంలో ఉన్న భూభాగం ఎగుడుదిగుడుగా ఉంటుంది. జిల్లా ఉత్తర సరిహద్దులో భూటాన్ పర్వతాలు, దక్షిణ భూభాగంలో ఖాశి హిల్స్ ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదికి దక్షిణంగా ఉన్న పర్వతాలు 800 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఈ పర్వతశ్రేణి జిల్లాను రెండు సమానభాగాలుగా చేసాయి. బ్రహ్మపుత్రను దాటడానికి రివర్ స్టీమర్లను సంవత్సరమంతా ఉపయోగిస్తారు. ఉపనదులను దాటడానికి వర్షాకాలంలో స్థానికంగా ఉండే పెద్ద బోట్లను ఉపయోగిస్తారు.ఉపనదులలో ఉత్తరంగా ప్రవహిస్తున్న మనాస్, చౌల్ కోయా, బర్నాడి, దక్షిణంగా ప్రవహిస్తున్న కుల్సి, డిబూ నదులు ప్రధానమైనవిగా ఉన్నాయి.

వృక్షజాలం , జంతుజాలం[మార్చు]

1989లో కామరూప్ జిల్లాలో 4.1 చ.కి.మీ వైశాల్యంలో " డిపోర్ బిల్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడింది.[4] జిల్లాలో టేకు, సాల్, సిస్సు, సం, నాహర్ వృక్షాల పెంపకం, కొన్ని పరిశోధనలు నిర్వహించబడుతున్నాయి..[ఆధారం చూపాలి]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,517,202,[5]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 327వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 436 .[5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.67%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 946:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 72.81%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. స్వల్పంగా అధికం

మతం[మార్చు]

జిల్లాలో హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, అనిమిస్టులు ఉన్నారు. జిల్లాలో ఉన్న కామాఖ్య, హజో ఆలయాలు అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. అవలోకితేశ్వరా శిల్పం కామరూప్ ప్రజలచేత శతకర్ణి పాలనా కాలంలో దానం చెయ్యబడింది. దీనిని లఢక్‌లో స్థాపించారు.[8]

భాష[మార్చు]

జిల్లాలో కాంరూపి భాష ప్రధానంగా వాడుకలో ఉంది. కర్బి భాషను 1,25,000 మందికి వాడుకభాషగా ఉంది.[9] టిబెటో బర్మన్ భాష టాంగ్ కూడా 10,000 మందికి వాడుక భాషగా ఉంది. దీనిని అధికంగా మేఘాలయా సరిహద్దులో ఉన్న అస్సాం ప్రాంతంలో వాడుకలో ఉంది. [10]

ఆర్ధికం[మార్చు]

జిల్లాలో ఆహారపు పంటగా వడ్లు పండినబడుతున్నాయి. జిల్లాలోని నేత పనివారు జిల్లా ప్రజలకు అవసరమైన పట్టు, నేత వస్త్రాలను తయారు చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఇత్తడి కప్పులు, పళ్ళాలు తయారు చేయబడుతున్నాయి. జిల్లా నుండి వడ్లు, నూనె గింజలు, కొయ్య, పత్తి ఎగుమతి చేయబడుతుంది. బియ్యం, ఉప్పు, చక్కెర, వక్కలు, టెంకాయలు, హార్డ్‌వేర్ సామాన్లు దిగుమతి చేసికొనబడుతున్నాయి. గౌహతి నుండి అస్సాం- బెంగాలి రైల్వే ప్రారంభం ఔతుంది. అంతేకాక తూర్పు రైల్వేశాఖకు సంబంధించిన రైలు మార్గం నదీతీరంలో ఆరంభించబడింది. గౌహతి, షిల్లాంగ్ వరకు రైలు మార్గం నిర్మించబడింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11. {{cite book}}: |last1= has generic name (help)
 2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Kangaroo Island 4,374km2 {{cite web}}: horizontal tab character in |quote= at position 16 (help)
 3. "Meghalaya flexes muscle on Assam boundary", Zee News, 2008-11-22, archived from the original on 2014-02-24, retrieved 2012-08-11
 4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
 5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
 7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
 8. "Stakna Gompa". Buddhist-temples.com. Archived from the original on 2015-04-08. Retrieved October 19, 2009.
 9. M . Paul Lewis, ed. (2009). "Amri Karbi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas , Texas: SIL International. Retrieved 2011-09-28. {{cite encyclopedia}}: |edition= has extra text (help)
 10. M . Paul Lewis, ed. (2009). "A'Tong: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. {{cite encyclopedia}}: |edition= has extra text (help)

మూలాలు[మార్చు]

 • Bannerje, A C (1992). "Chapter 1: The New Regime, 1826-31". In Barpujari, H K (ed.). The Comprehensive History of Assam: Modern Period. Vol. IV. Guwahati: Publication Board, Assam. pp. 1–43.
 • Hunter, William Wislon (1879). A Statistical Account of Assam. Vol. 1. Trübner & co. Retrieved 2012-12-13.
 • Public Domain This article incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. {{cite encyclopedia}}: Missing or empty |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

గమనిక: కామరూప్ మెట్రో పాలిటన్ జిల్లా పూర్తిగా కారూప్ రూరల్ జిల్లాకు కేంద్రస్థానంలో ఉంది.

Coordinates: 26°20′N 91°15′E / 26.333°N 91.250°E / 26.333; 91.250

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]