అక్షాంశ రేఖాంశాలు: 25°55′24″N 92°36′30″E / 25.923300°N 92.608300°E / 25.923300; 92.608300

హమ్రెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హమ్రెన్
పట్టణం
హమ్రెన్ is located in Assam
హమ్రెన్
హమ్రెన్
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
హమ్రెన్ is located in India
హమ్రెన్
హమ్రెన్
హమ్రెన్ (India)
Coordinates: 25°55′24″N 92°36′30″E / 25.923300°N 92.608300°E / 25.923300; 92.608300
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాపశ్చిమ కర్బి ఆంగ్లాంగ్
జిల్లా ఏర్పాటు15 ఆగస్టు 2016
Government
 • Bodyహమ్రెన్ పట్టణ కమిటీ
జనాభా
 (2011)
 • Total8,694
భాషలు
 • అధికారికఅస్సామీ, ఇంగ్లీష్, హిందీ
 • ప్రాంతీయకర్బీ, హిందీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
782486
Vehicle registrationఏఎస్

హమ్రెన్, అస్సాం రాష్ట్రంలోని పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా ముఖ్య పట్టణం. కొండపైన ఈ పట్టణం ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] హమ్రెన్ పట్టణంలో 8,694 జనాభా ఉంది. ఈ జనాభాలో 4,406 (50.5%) మంది పురుషులు, 4,288 (49.5%) మంది స్త్రీలు ఉన్నారు. హమ్రెన్ పట్టణ సగటు అక్షరాస్యత రేటు 86% కాగా, ఇది జాతీయ సగటు అక్షరాస్యత 74% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 90%, స్త్రీ అక్షరాస్యత 82% ఉంది.

పరిపాలన

[మార్చు]

హమ్రెన్ పట్టణంలో 7 వార్డులుగా విభజించారు. పట్టణంలో 1,798 ఇళ్ళు ఉన్నాయి. హమ్రెన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తోంది. కమిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, తన పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా కమిటీకి అధికారం ఉంది.[2]

మతాలు

[మార్చు]

అమింగావ్ పట్టణ జనాభాలో 73.67% హిందువులు, 0.91% ముస్లింలు, 25.09% క్రైస్తవులు, 0.01% సిక్కులు, 0.15% బౌద్ధులు, 0.02% జైనులు, 0.14% ఇతరులు ఉన్నారు.

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]

హమ్రెన్ పట్టణం చుట్టూ పచ్చని కొండలు ఉన్నాయి. ఈ పట్టణం మీదుగా కోపిలి నది ప్రవహిస్తోంది. పట్టణ దక్షిణ సరిహద్దు వైపు మేఘాలయ కొండలు, బోరపాని సరస్సు ఉన్నాయి.

రవాణా

[మార్చు]
  • వాయుమార్గం: హమ్రెన్ పట్టణానికి 170 కి.మీ.ల దూరంలో ఉన్న గువహాటిలో విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుండి పట్టణానికి చేరుకోవడానికి సుమారు 4 గం 30 నిమిషాలు పడుతుంది.
  • రైలుమార్గం: హమ్రెన్‌ పట్టణంలో రైల్వే స్టేషను లేదు. సమీప రైల్వే స్టేషను గువహాటిలో ఉంది.
  • రోడ్డుమార్గం: హమ్రెన్ పట్టణం రోడ్డుమార్గం ద్వారా అన్ని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలకు కలుపబడి ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. ""Karbi Anglong Census"". Archived from the original on 2018-12-28. Retrieved 2020-12-24.
  2. "Hamren Town Committee City Population Census 2011-2020 | Assam". www.census2011.co.in. Retrieved 2020-12-24.
  3. Arjun (2018-08-16). "Learn About Hamren, The Hidden Picturesque Town Of Assam". www.nativeplanet.com. Retrieved 2020-12-24.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హమ్రెన్&oldid=3945328" నుండి వెలికితీశారు