Jump to content

సిల్చార్

అక్షాంశ రేఖాంశాలు: 24°49′N 92°48′E / 24.82°N 92.8°E / 24.82; 92.8
వికీపీడియా నుండి
సిల్చార్
పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం
సిల్చార్ లోని బరాక్ నది
సిల్చార్ లోని బరాక్ నది
Nickname: 
శాంతి ద్వీపం
సిల్చార్ is located in Assam
సిల్చార్
సిల్చార్
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
సిల్చార్ is located in India
సిల్చార్
సిల్చార్
సిల్చార్ (India)
Coordinates: 24°49′N 92°48′E / 24.82°N 92.8°E / 24.82; 92.8
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాబరాక్ లోయ
Government
 • Bodyసిల్చార్ పురపాలక సంస్థ
 • వార్డులు30
విస్తీర్ణం
 • Total15.75 కి.మీ2 (6.08 చ. మై)
Elevation
22 మీ (72 అ.)
జనాభా
 (2011)
 • Total1,72,830
భాషలు
 • అధికారికబెంగాళీ
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
788001 - 788032, 788118
టెలిఫోన్ కోడ్+91 (0) 3842
Vehicle registrationఏఎస్-11
అధికారిక భాషలుబెంగాళీ
ఎక్కువగా మాట్లాడే భాషలుసిల్హేటి, బెంగాళీ, మీటీ, బిష్ణుప్రియ మణిపురి, దిమాస
ఇతర భాషలుఆంగ్లం

సిల్చార్, అసోం రాష్ట్రంలోని కచార్ జిల్లా ముఖ్య పట్టణం. గువహాటికి ఆగ్నేయంగా 343 కి.మీ.ల (213 మైళ్ళు) దూరంలో ఈ పట్టణం ఉంది. 1832లో కెప్టెన్ థామస్ ఫిషర్ ఈ పట్టణాన్ని స్థాపించి, కచార్ జిల్లా ప్రధాన కార్యాలయాలను సిల్చార్‌లోని జనిగంజ్‌కు మార్చాడు.[1] అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఈ పట్టణానికి "శాంతి ద్వీపం" అనే పేరును కూడా పెట్టారు.[2] ప్రపంచంలోని మొట్టమొదటి పోలో క్లబ్, మొదటి పోలో మ్యాచ్ జరిగిన ప్రదేశమిది.[3][4] 1985లో కోల్‌కతా నుండి సిల్చార్‌కు నడిచిన ఎయిర్ ఇండియా విమానం ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా సిబ్బంది విమానంగా గుర్తింపు పొందింది.[5]

పద వివరణ

[మార్చు]

'షిల్', 'చార్' అనే రెండు బెంగాలీ పదాల నుండి ఈ సిల్చార్ పేరు వచ్చింది. దీనికి 'రాక్', 'షోర్/ఐలాండ్' అని అర్థం. జనిగంజ్-సదర్ఘాట్ ప్రాంతంలోని బరాక్ ఒడ్డుకు సమీపంలో ఈ పట్టణం నిర్మించబడింది. దీనిని బరాక్ నదికి ఓడరేవుగా వాడుకున్నారు.[6] ఇక్కడి స్థానికులు ఈ ప్రాంతాన్ని 'షైలర్ చోర్' (రాతి తీరం) అని పిలవడం ప్రారంభించారు. కొంతకాలం తరువాత దీనిని 'సిల్చార్' అని పిలవడంతో బ్రిటిష్ వారు ఈ పదానికి ప్రాచుర్యం కలిగించారు.[1]

చరిత్ర

[మార్చు]

1832లో బ్రిటిష్ వారు ఈ సిల్చార్ పట్టణాన్ని నిర్మించారు కాబట్టి, సిల్చార్ పూర్వ చరిత్రను ఈ ప్రాంతం, సమీప ప్రాంతాల చరిత్ర ద్వారా అంచనా వేయవచ్చు.

సిల్చార్ రైల్వే స్టేషన్ను భాసా షాహిద్ స్టేషన్ అని పిలుస్తారు.

భౌగోళికం

[మార్చు]

అస్సాం రాష్ట్ర దక్షిణ భాగంలో 24.82°N 92.8°E అక్షాంశరేఖాంశాల మధ్య ఈ సిల్చార్ పట్టణం ఉంది.[7][8] ఇది సముద్ర మట్టానికి 35 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పట్టణం ఒండ్రు ఫ్లాట్ మైదానంలో చిత్తడి నేలలు, ప్రవాహాలు, చిన్న కొండలతో (స్థానికంగా టిల్లా అని పిలుస్తారు) ఆకర్షణీయంగా కనిపిస్తోంది. బరాక్ నది, ఘగ్రా నది ఇక్కడి ప్రధాన నదులు.[6]

సిల్చార్ పట్టణం సీస్మిక్ జోనేషన్ మ్యాప్‌లోని 5వ జోనులో ఉంది, ఇక్కడ పెద్దపెద్ద భూకంపాలు సంభవించాయి.[9] 1869, జనవరి నెలలో సంభవించిన భూకంపం రిక్టర్ స్థాయిలో 7.5 తీవ్రతతో ఉంది, భారీ నష్టాన్ని కలిగించింది. తరువాత 1947 (మాగ్నిట్యూడ్ 7.7), 1957 (7.0), 1984 (6.0) లలో భూకంపాలు వచ్చాయి.[10]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం సిల్చార్ పురపాలక ప్రాంతంలో 1,72,830 జనాభా ఉంది.[11] ఇక్కడి లింగ నిష్పత్తి లెక్కల ప్రకారం 1,000 మంది పురుషులకు 989 మహిళలు ఉండగా, ఇది జాతీయ నిష్పత్తి 1,000 పురుషులకు 940 మంది మహిళల నిష్పత్తికి ఎక్కువగా ఉంది.[12] సిల్చార్ పురపాలక ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 82.33% కాగా, జాతీయ సగటు 74.04% కన్నా ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.15% కాగా, స్త్రీ అక్షరాస్యత 80.49%గా ఉంది.[13][14]

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్

సిల్చార్ నగరంలో హిందువులు ఎక్కువగా (1,21,381 మంది) ఉండగా, ముస్లింలు రెండవస్థానంలో (23,759 మంది) ఉన్నారు. జైనులు 1,408 మంది, క్రైస్తవులు 1,052 మంది, సిక్కులు 77 మంది, బౌద్ధులు 39 మంది ఉన్నారు. సుమారు 145 మంది తమ మతాన్ని పేర్కొనలేదు.

సిల్చార్ లోని మతాలు (2011)

  జైనులు (0.79%)
  ఇతరులు (0.08%)

రాజకీయాలు

[మార్చు]

సిల్చార్ పట్టణం సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. బిజెపికి చెందిన డాక్టర్ రాజ్దీప్ రాయ్ సిల్చార్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.[15]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Sultana, Kismat. "Silchar Municipality: A study of its origin and development 1882 - 1990". Shodhganga. Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "APCC member for nomination of Gaurav Gogoi from Barak Valley". The Sentinel, Assam. 6 June 2012. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 22 November 2020.
  3. Bahl, Ananya (2019-01-05). "Two millennia after the first Manipuri polo match, a women's team is ushering in a quiet revolution". The Hindu. ISSN 0971-751X. Retrieved 22 November 2020.
  4. "Barak Valley: Assam's appendix". The Statesman. 2017-11-06. Retrieved 22 November 2020.
  5. "Air India Operates All-Women Crew Flight From Kolkata". NDTV.com. Retrieved 22 November 2020.
  6. 6.0 6.1 "Disaster Management Plan" (PDF). Assam State Disaster Management Authority. Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Location of Silchar". Wikimapia Foundation. Wikimapia. Retrieved 3 March 2014.
  8. "Silchar, India Page". Falling Rain Genomics, Inc. Falling Rain Genomics, Inc. Retrieved 22 November 2020.
  9. "District Disaster Management Authority, Cachar" (PDF). Cachar District Authority. Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Knowledge Management Portal" (PDF). Assam State Disaster Management Authority. Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Census of India 2011". Govt. of India. Government of India. Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "Census of India 2011" (PDF). Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. "Census of India 2011". Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Census of India 2011" (PDF). www.census2011.co.in. Retrieved 22 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  15. "General Elections 2019". Election Commission of India. 1 June 2019. Archived from the original on 26 మే 2019. Retrieved 22 November 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సిల్చార్&oldid=4149558" నుండి వెలికితీశారు