అక్షాంశ రేఖాంశాలు: 26°38′N 92°48′E / 26.63°N 92.8°E / 26.63; 92.8

తేజ్‌పూర్

వికీపీడియా నుండి
(Tezpur నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తేజ్‌పూర్
పట్టణం
అగ్నిగర్ కొండ (పైన) మహాభైరవ్ గుడి (మధ్యన) హరిహర యుద్ధం (దిగువ)
తేజ్‌పూర్ is located in Assam
తేజ్‌పూర్
తేజ్‌పూర్
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
తేజ్‌పూర్ is located in India
తేజ్‌పూర్
తేజ్‌పూర్
తేజ్‌పూర్ (India)
Coordinates: 26°38′N 92°48′E / 26.63°N 92.8°E / 26.63; 92.8
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
Government
 • Typeపురపాలక సంస్థ
 • Bodyతేజ్‌పూర్ పురపాలక సంస్థ
విస్తీర్ణం
 • Total40 కి.మీ2 (20 చ. మై)
Elevation
48 మీ (157 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,02,505
 • Rank8వ
 • జనసాంద్రత2,600/కి.మీ2 (6,600/చ. మై.)
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
784001
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్-12

తేజ్‌పూర్, అసోం రాష్ట్రంలోని సోనిత్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం. బ్రహ్మపుత్రా నదికి ఒడ్డున ఉన్న ఈ పట్టణం గువహాటికి ఈశాన్య వైపుగా ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర తీర పట్టణాల్లో ఇది అతిపెద్ద పట్టణం.[2]

భౌగోళికం

[మార్చు]

26°38′N 92°48′E / 26.63°N 92.8°E / 26.63; 92.8 అక్షాంశరేఖాంశాల మధ్య ఈ పట్టణం ఉంది.

వాతావరణం

[మార్చు]

వేసవిలో ఈ పట్టణ సగటు ఉష్ణోగ్రత 36 సెంటిగ్రెడ్ (97 ఫారన్ హీట్) ఉండగా, శీతాకాలంలో 13 సెంటిగ్రెడ్ (55 ఫారన్ హీట్) సగటు ఉష్ణోగ్రత ఉంటుంది.[3]

విస్తీర్ణం

[మార్చు]

40 కి.మీ. (20 చ.మై) ల విస్తీర్ణంలో ఉన్న ఈ పట్టణం సముద్రమట్టం నుండి ఎత్తు 48 మీ. (157 అ.) ఎత్తులో ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 1,02,505 జనాభా ఉండగా 2,600/కి.మీ2 (6,600/చ. మై.) జన సాంద్రత ఉంది. ఈ జనాభాలో 52,313 మంది పురుషులు.. 50,192 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 83,562 (90.17%) మంది అక్షరాస్యులు ఉండగా అందులో 43,783 (92.60%) మంది పురుషులు.. 39,779 (87.64%) మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ జనాభాలో 9,835 మంది (బాలురు 5,032 - బాలికలు 4,803) ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. పురుష స్త్రీ నిష్పత్తి 1000:959 ఉండగా, బాల బాలికల నిష్పత్తి 1000:954 గా ఉంది.

ప్రభుత్వ రంగం

[మార్చు]

తేజ్‌పూర్ పట్టణం తేజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[4]

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]
  1. నామెరి జాతీయ పార్కు
  2. అగ్నిగర్
  3. బాముని కొండలు
  4. బురా-చపోరి వన్యప్రాణుల అభయారణ్యం
  5. చిత్రలేఖ ఉద్యానవనం
  6. డా-పర్బాటియా
  7. జిల్లా మ్యూజియం
  8. ఓగురి కొండ
  9. పాడుం పుఖూరి
  10. కలికా భోమోర వంతెన
  11. నాగ్ - శంకర్ ఆలయం
  12. కేతకేశ్వర్ దేవాల్

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.census2011.co.in/census/metropolitan/183-tezpur.html
  2. "Tezpur Metropolitan Urban Region Population 2011 Census". www.census2011.co.in. Retrieved 2020-11-24.
  3. "Tezpur, India Weather Averages - Monthly Average High and Low Temperature - Average Precipitation and Rainfall days - World Weather Online". Retrieved 2020-11-24.
  4. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-11-24.

ఇతర లంకెలు

[మార్చు]