తిన్‌సుకియా
తిన్‌సుకియా | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°30′00″N 95°22′01″E / 27.500°N 95.367°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | తిన్‌సుకియా జిల్లా |
Government | |
• Body | తిన్‌సుకియా పురపాలక సంస్థ |
Elevation | 116 మీ (381 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,26,389 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 786125 |
టెలిఫోన్ కోడ్ | 91-374 |
Vehicle registration | ఏఎస్-23 |
తిన్‌సుకియా, అస్సాం రాష్ట్రం తిన్‌సుకియా జిల్లాలోని ఒక పారిశ్రామిక పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ పట్టణం ఈశాన్య గువహాటికి 480 కి.మీ.లు, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు నుండి 84 కి.మీ.ల (52 మైళ్ళ) దూరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]తిన్‌సుకియా మొదట చెంగ్మై పత్తర్ పిలువబడేది, బెంగ్మార ఇక్కడే ఉంది. ఇది మోటోక్ రాజ్యానికి రాజధానిగా ఉండేది, స్వర్గాడియో సర్బానంద సింఘ దీనిని స్థాపించాడు.[2] స్వర్గాడియో సర్బానంద సింఘా (మెజారా) పూర్వపు చుటియా రాజకుటుంబానికి చెందినవాడు. సమర్థుడైన నాయకుడిగా ఎదిగాడు. మెజారా సింహాసనం అధిష్టించిన తరువాత సర్బానంద సింఘా అనే పేరును స్వీకరించాడు. స్వర్గాడియో సర్బానంద సింఘా తన పేరు మీద నాణేలను ప్రవేశపెట్టాడు. సాకా 1716, 1717లలో స్వర్గడియో అనే బిరుదును నాణేల్లో చెక్కించాడు.
భౌగోళికం
[మార్చు]27.5 ° N 95.37 ° E అక్షాంశరేఖాంశాల మధ్య ఈ తిన్‌సుకియా ఉంది.[3] దీని సగటు ఎత్తు 116 మీటర్లు (380 అడుగులు).
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, తిన్‌సుకియా జనాభా 126,389 గా ఉంది.[4] ఈ మొత్తం జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45% ఉన్నారు. తిన్‌సుకియా సగటు అక్షరాస్యత 70.15%, ఇది జాతీయ సగటు 64.84% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 77.89%, స్త్రీ అక్షరాస్యత 63.54%. జనాభాలో 13.29% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[5]
రాజకీయాలు
[మార్చు]తిన్‌సుకియా దిబ్రుగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[6]
పత్రిక
[మార్చు]అస్సామీ దినపత్రిక దైనిక్ జనాభాూమి గువహాటి, జోర్హాట్‌లతో పాటు తిన్‌సుకియా నుండి కూడా ప్రచురించబడింది.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- భూపెన్ హజారికా
- మహికా శర్మ
- సావిత్రి జిందాల్
- జోయి బారువా
మూలాలు
[మార్చు]- ↑ http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=298235
- ↑ "Tinsukia". Archived from the original on 26 ఏప్రిల్ 2012. Retrieved 2 May 2012.
- ↑ Falling Rain Genomics, Inc - Tinsukia
- ↑ "Census of India / Assam / Tinsukia". Census of India. Retrieved 5 November 2020.
- ↑ "Census Of India". Retrieved 5 November 2020.
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-10-06.