హిమదాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిమదాస్
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారత దేశం
జననం (2000-01-09) 2000 జనవరి 9 (వయసు 24)
ధింగ్,నాగోన్,అసోం
నివాసంధింగ్,నాగోన్,అసోం
క్రీడ
దేశం భారతదేశం
క్రీడTrack and field
పోటీ(లు)400 మీటర్లు
కోచ్నిపోన్ దాస్
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ(s)400 m: 51.13 (Guwahati 2018)

హిమదాస్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నది.ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించినది.[1] అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలు పెట్టిన తరువాత కేవలం 18 నెలలలోనే ఈ విజయం సాధించినది. ఈ బంగారు పతకం జూనియరు విభాగంలో పొందిన సీనియరు, జూనియరు విభాగాల్లో బంగారు పతకంపొందిన భారతీయ ఏకైక మహిళ హిమదాస్.

వ్యక్తిగత చరిత్ర[మార్చు]

18ఏళ్ల హిమదాస్‌ అసోం లోని నాగయోన్‌ జిల్లాలోని ఢింగ్‌ గ్రామానికి చెందిన హిమదాస్‌ రైతు కుటుంబంలో జన్మించింది.తండ్రిపేరు రొంజిత్ దాస్ ,తల్లి పేరు జొనాలి దాస్.కుటుంబంలోని నలుగురు పిల్లలలో హిమదాస్ చివరిది. ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండీ క్రీడలపై మక్కువ కనిపించే హిందాస్‌ ప్రపంచ ట్రాక్‌ ఈవెంట్‌ ప్రస్థానం అంచలంచలుగా సాగింది. తండ్రితో పాటు పొలంపనికి వెళ్లేది.ఆమె జననం 9 జనవరి 2000.నలుగురు పిల్లలున్న కుటుంబం లో అందరికంటే చిన్న అయినా, బరువు భాధ్యతలు మాత్రం ఎక్కువే.[2]ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండీ క్రీడలపై మక్కువ కనిపించే హిందాస్‌ ప్రపంచ ట్రాక్‌ ఈవెంట్‌ ప్రస్థానం అంచలంచలుగా సాగింది. తండ్రితో పాటు పొలంపనికి వెళ్లేది.

జీవిత గమనం[మార్చు]

హిమదాస్ దింగ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించి,చిన్న పిల్లగానే ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించింది. ముందుగా ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించినా, తన పరుగును గోల్ పోస్ట్ నుండి ట్రాక్ మీదకు మార్చుకుంది.స్కూలులో వున్నప్పుడు అక్కడి మగపిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడేది.మొదట్లో ఫుట్ బాల్ ఆటనే తన గమ్యంగా ఎంచుకుంది. నవోదయ విద్యాలయకు చెందిన ఫిజికల్ ఎడుకేసన్ ట్రైనర్ అయిన సాంసుల్ హోక్వ్(Shamsul Hoque)సలహతో తన అభిరుచిని ఫుట్ బాల్ నుండి తక్కువ దూరం రేసుల్లో పరుగెత్తడం ప్రాక్టిసు మొదలెట్టింది. సాంసుల్ హోక్వ్ హిమదాస్ ను నాగోన్ స్పోర్ట్స్ అసోసియేసకు చెందిన శంకర్ రోయ్ కు పరిచయం కావించాడు. ఇంకా వేగంగా..ప్రపంచంలో అందరికంటే వేగంగా.. కేవలం 18 ఏళ్ళ వయసులో ప్రపంచాన్ని జయించింది. భారతదేశ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు సగర్వంగా ఎగరవేసింది.నిపోన్‌దాస్‌ అనే కోచ్ దొరకటంతో అమెకు సరికొత్త క్రీడ జీవితం మొదలైంది.ఆమె విజయకాంక్షకు అనుగుణంగా నిపోన్‌దాస్‌ రూపంలో స్ఫూర్తిని ఇచ్చే గురువుదొరికాడు. జిల్లా స్థాయిపోటీలలో చౌకరకం దుస్తులు,షూలతోనే 100మీటర్లు200మీటర్లులో బంగారు పతకాలు పొంది తమ జిల్లాను ప్రథమస్థానంలో నిలిపారు.హిమదాస్ అంతరు జిల్లా పోటీకి ఎన్నిక అయ్యి రెండూ బంగారు పతకాలను సాధించింది. ఈ పోటీల్లో దాస్ ప్రతిభను డైరెక్తరేట్ అఫ్ స్పొర్ట్స్ అండ్ యూత్ వెల్ఫెర్ కు చెందిన అథ్లెటిక్ కోచ్ అయిన నిపోన్ దాస్ గుర్తించాడు.హిమదాస్ తల్లి దండ్రులను ఒప్పించి అమెను గౌహతికి తీసుకెళ్లాడు.మొదట్లొ అద్దె ఇంట్లో వుంటూ ప్రాక్టిసు చేసేది.అలా అయినచోఅనుకున్న లక్ష్యం సాధ్యం కాదని గ్రహించిన నిపన్ దాస్ అమెను సరుస జాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు హస్టల్ లో చేర్పించాడు.100, 200 మీటర్ల పరుగు పందెంలొ మెరుపులు మెరిపించిన హైమదాస్ ను నిపన్, సహకోచ్ నవజీత్,అమెను 400 మీటర్ల కేటగిరికి మార్చారు.

కామన్వెల్త్‌లో[మార్చు]

2018 మార్చిలో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ పాల్గొన్నది.400మీపరుగు, 4X400 మీ రిలే పోటీలో భగస్వామ్యం వహించింది.400 మీటర్ల ఫైనల్లో తలపదిన అమె 51.32 సెకన్లలో చేరి ఆరవ స్థానంలో నిలిచింది..పసిది పతకం పొందిన అమంట్లే మొంట్శో(బోట్స్‌వానా)కన్న కేవలం 1.17 సెకన్లు మాత్రమే తక్కువ .

వ్యక్తిగత ఉత్తమ స్కోరు[మార్చు]

జూన్,2018 నెలలో గువాహాటిలో జరిగిన ఇంటరు స్టేట్(అంతరరాష్ట్ర)చాంపియన్ షిప్పులో 400మీటర్ల దూరాన్ని 51.13 సెకన్లలో చేరిం.

ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్‌-2018[మార్చు]

ఫిన్ లాండ్ లోని టంపెరె(Tampere)లో 12 వతేది గురువారం జులై 20187న ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన 18 ఏళ్ల హిమదాస్ తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించింది. 400మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది.4వనెంబరు లైనులో పరుగుపెట్టిన హిమదాస్‌ రుమేనియాకు చెందిన ఆండ్రియా మిక్క్లోస్‌ కన్నా మొదట వెనకపడింది. 50 నుండి 100 మీటర్ల మధ్యలో ఆండ్రియాతో వెనకబడిన హిమదాస్‌ ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది.

ఆమె తర్వాత స్థానంలో రొమేనియా అథ్లెట్ మిక్లో 52.07 సెకన్ల‌తో రజతం గెలవగా.అమెరికాకి చెందిన టేలర్ మన్సన్ 52.28 సెకన్లతో కాంస్యానికి పరిమితమైంది.

మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జ‌న‌గ‌ణ‌మ‌న‌ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేవారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలెట్టిన కేవలం 18 నెలలలోనే ఈ విజయం సాధించినది.ఈ బంగారు పతకం జూనియరు విభాగంలో పొందిన సినియరు, జూనియరు విభాగాల్లో బ<గారు పతకంపొందిన భారతీయ ఏకైక మహిళ హిమదాస్.

ప్రశంసలు[మార్చు]

ఆమెకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా హిమదాస్‌కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.సూప‌ర్ స్టార్ మహేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. హిమదాస్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. 'హిమదాస్ గొప్ప ఘ‌న‌త సాధించింది. భారత క్రీడాచరిత్రలో చెప్పుకోద‌గ్గ క్ష‌ణం ఇది. మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు నా అభినంద‌న‌లు' అని పోస్ట్ చేశారు.[3]

అండర్ 20 అథ్లెటిక్ వరల్డ్ చాంపియన్ షిప్ 400 మీటర్ల ఈవెంట్ల లో స్వర్ణ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన అధ్లెట్ హిమాదాస్ ను కాంగ్రెస్ అధినేత రాహుల్ అభినందించారు. ఈ మేరకు రాహుల్ ఒక ట్వీట్ లో కేవలం 51.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అథ్లెటిక్స్ వరల్ చాంపియన్ షిప్ లో భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించిన హిమాదాస్ కు సెల్యూట్ అని పేర్కొన్నారు.[4]

కర్నాటక ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర హిమదాస్ కు 10లక్షల నగదు బహుమతి ప్రకటించాడు[5]

బయటి వీడియో లింకులు[మార్చు]

ఆధారాలు[మార్చు]

  1. "జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్". ntnews.com. Retrieved 2018-07-15.
  2. "పేదరికంలో పుట్టి.. స్వర్ణం చరిత్ర సృష్టించిన హిమదాస్". az7am.com. Retrieved 2018-07-15.
  3. "శభాష్ హిమదాస్‌.. స్టార్ అథ్లెట్‌కు టాలీవుడ్ హీరోల ప్రశంసలు". telugu.samayam.com. Retrieved 2018-07-15.
  4. "హిమదాస్ కు రాహుల్ అభినందనలు". prabhanews.com. Archived from the original on 2018-07-15. Retrieved 2018-07-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Karnataka Dy CM awards Rs 10 lakh to gold medal winning athlete Hima Das". thenewsminute.com. Retrieved 2018-07-15.
"https://te.wikipedia.org/w/index.php?title=హిమదాస్&oldid=4104567" నుండి వెలికితీశారు