సూర్య సిద్ధాంతం
Jump to navigation
Jump to search
సూర్య సిద్ధాంతం అనేది హిందూ మతంలో ఉపయోగించే ఒక ఖగోళ సిద్ధాంతం. మధ్య యుగానికి (12వ శతాబ్దం) చెందిన ఈ పుస్తకాన్ని బర్జస్ 1860లో అనువదించాడు. ఈ పుస్తకం పూర్వ గణాంకాలకు అనుగుణంగా రాసారు. సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365.2435374 రోజులు. నేటి ఆధునిక సైన్సు పరిజ్ఞానం ప్రకారం సంవత్సరానికి 365.2421897 రోజులు. ఈ రెండు సిద్ధాంతాలకు మధ్య తేడా కేవలం 1 నిమిషం, 54.44128 సెకండ్లు మాత్రమే.[1]
సూర్య సిద్ధాంతం వివరించే అంశాలు.
- గ్రహాల కదలికలు
- గ్రహాల ఉచ్ఛస్థితి
- దిశ, ప్రదేశం, సమయం
- చంద్రుడు, చంద్ర కక్ష్య
- సూర్యుడు, సూర్య కక్ష్య
- కక్ష్య
- గ్రహ సముదాయాలు
- నక్షత్రాలు
- సూర్యోదయం, సూర్యాస్తమయం
- చంద్రోదయం, చంద్రాస్తమయం.
- సూర్య చంద్ర సిద్ధాంతాలు
- ఖగోళ స్థితి, భూగోళ స్థితి
- గ్నోమాన్
- మానవుని జీవితాలు, గ్రహస్థితి.
గ్రహాల చుట్టుకొలతలు
[మార్చు]సూర్య సిద్ధాంతం ప్రకారం గ్రహాల చుట్టుకొలతలు కింది విధంగా ఉన్నాయి:
- బుధుడు చుట్టుకొలత 3008 మైళ్ళు. ఆధునిక కొలతల ప్రకారం 3032 మైళ్ళు. (తప్పు కేవలం 1%)
- శని చుట్టుకొలత 73,882 మైళ్ళు. ఆధునిక కొలతల ప్రకారం 74,580 మైళ్ళు. (తప్పు కేవలం 1%)
- అంగారకుడు చుట్టుకొలత 3,772 మైళ్ళు. ఆధునిక కొలతల ప్రకారం 4,218 మైళ్ళు. (తప్పు కేవలం 11%)
- బృహస్పతి చుట్టుకొలత 41,624 మైళ్ళు. శుక్రుడు చుట్టుకొలత 4,011 మైళ్ళు. కాని ఆధునిక కొలతల ప్రకారం అవి 88,748 మైళ్ళు, 7,523 మైళ్ళు. (అంటే కొలతలో సగం).[2]
మూలాలు
[మార్చు]- ↑ "సూర్య సిద్ధాంతం". Archived from the original on 2016-08-14. Retrieved 2016-08-02.
- ↑ Richard Thompson (1997), "Planetary Diameters in the Surya-Siddhanta" (PDF), Journal of Scientific Exploration, 11 (2): 193–200 [196], archived from the original on January 7, 2010
{{citation}}
: CS1 maint: unfit URL (link)