Jump to content

తదియ

వికీపీడియా నుండి
(తృతీయ నుండి దారిమార్పు చెందింది)

తదియ చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మూడవ తిథి. దీనిని త్రితీయ, తద్దె అని కూడ పిలుస్తారు. దీని అధి దేవత - గౌరి. చాంద్రమానం ప్రకారం ఒక తెలుగు మాసంలో రెండు పక్షాలుంటాయి. అవి కృష్ణ పక్షం, శుక్ల పక్షం. ఒక పక్షం 15 రోజులు. పక్షం లో మూడవ రోజును తదియ అంటారు. ఒక మాసంలో రెండు సార్లు తదియ వస్తుంది. అంటే, పౌర్ణమి తర్వాత వచ్చే మూడవ రోజు లేదా అమావాస్య తర్వాత వచ్చే మూడవ రోజు.

తదియ నిర్ణయం

[మార్చు]

ధర్మ సింధు[1] ప్రకారం గౌరీ వ్రతాదులలో తదియకు లేశమైనను విదియ కలియరాదు. మరునాడు చవితి కొద్దిగా కలిసివున్నా గౌరీదేవికి తదియగా గుర్తించాలి.

ఇతర వ్రతాలలో తొలిరోజున మూడు ముహూర్తముల కాలం విదియ ఉండి, ఆ రోజున మూడు ముహూర్తముల కాలం తదియ ఉంటే పూర్వదినాన్ని తదియగా గుర్తించరాదు. కేవలం ద్వితీయవేధ ఎక్కువ ఉన్నప్పుడే ఇలా గ్రహించాలి. లేనపుడు పరదినమే గ్రహించాలి.

పండుగలు

[మార్చు]
  1. చైత్ర శుద్ధ తదియ - మత్స్య జయంతి
  2. ఉండ్రాళ్ళ తద్ది (తదియ). : ఇది కూడా తదియ రోజున జరుపుకునే మరో పండుగ.
  3. అట్ల తద్ది (అట్ల తదియ). : తెలుగు స్త్రీలు, పిల్లలు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు.
  4. అక్షయ తదియ (వైశాఖ శుద్ధ తదియ) : ఈ రోజున ఏ పని ప్రారంభించినా అది అక్షయంగా (అనంతంగా) వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ఈ రోజున హోమం, దానం వంటివి చేయడం చాలా పుణ్యప్రదమని భావిస్తారు

మూలాలు

[మార్చు]
  1. తదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.
"https://te.wikipedia.org/w/index.php?title=తదియ&oldid=4641846" నుండి వెలికితీశారు