Jump to content

తిథి

వికీపీడియా నుండి
(తిథులు నుండి దారిమార్పు చెందింది)
తిథిని గణించడం అవగానన చేసుకొనే చిత్రం

తిథి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసము లో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య , అదే సూర్యచంద్రులు ఒకరి కి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు..  తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.  

తిథులు అధిదేవతలు

[మార్చు]
  1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
  2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
  3. తదియ (అధి దేవత - గౌరి)
  4. చవితి (అధి దేవత - వినాయకుడు)
  5. పంచమి (అధి దేవత - సర్పము)
  6. షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)
  7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
  8. అష్టమి (అధి దేవత - శివుడు)
  9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
  10. దశమి (అధి దేవత - యముడు)
  11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
  12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
  13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
  14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
  15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి (అధి దేవత - చంద్రుడు)
  16. అమావాస్య (అధి దేవత - పితృదేవతలు)

తిథులు అధిదేవతలు ఫలితాలు

[మార్చు]
తిథి అధిదేవత చేయతగిన కార్యములు ఫలితములు
1. పాడ్యమి శ్రద్ధ శ్రద్ధతో పనిచేయుట, పనులయందు జాగరూకత శ్రుతము, శాస్త్రముల ఆచరించుట
2.విదియ మైత్రి కొత్త పరిచయాలు, మంచి మిత్రులు, చికిత్సారంభం ప్రసాదము, మనోవికాసం
3.తదియ దయ ఆర్తులకు సేవచేయుట అభయం- నిర్భయము, అభయమిచ్చుట
4.చవితి శాంతి ధ్యానము, సత్సంగము సుఖము-కార్యసిద్ధి
5.పంచమి తుష్టి తృప్తి పడుట, అసంతృప్తిని విడచుట, ప్రజాహిత కార్యములు ముదము-ఆనందము
6.షష్ఠి పుష్టి ఆతిథ్యము, మంచి భోజనము, కలహములు రాకుండా జాకరూకత స్మయము- గర్వము కలుగుట
7.సప్తమి క్రియ ప్రియము నిష్టతో కార్యాచరణ, తపసు, వేద్యయనం, శరణాగతి యోగము-దైవముతో యోగము, విగ్నములు తొలగుట, ప్రయోజనము
8.అష్టమి స్వాహాదేవి వ్యాయాయము, అగ్నికార్య్సములు, పోటీలో నిలుచుట, సిద్ధిని పొందుటకు చేయవలసిన కార్యములు, ఆరోగ్యకరమైన ఆహారం శ్రమతో విజయమును సాధించుట
9.నవమి ఉన్నతి సత్పురుషుల సన్నిధిలో వినయముతో మెలగుట దర్పం, అపురూపమైన విద్య, అధికారం, శక్తి, తెలివి వలన కలుగు దర్పం. గుర్తింపు కొరకు గొప్ప కొరకు పాటుపడుట నివారించని ఎడల పేదరికం సంభవించును
10.దశమి బుద్ధి వివేకముతో కార్యాచరణ చేయుట అర్ధము-ప్రయోజనము, పరిస్థితులను సద్వినియోగపరచుట
11.ఏకాదశి మేధ కార్యములందు శుభం, విద్యలను సద్వినియోగపరచుకొనుట స్మృతి-కావలసిన సమయంలో విద్యలు స్పురించి ప్రయోజనం సమకూరుట
12.ద్వాదశి తితిక్ష పరిస్థితులను, ఇతరుల ప్రవర్తనను ఓర్చుకొనుట క్షేమం- ఓర్పువహించిన వారికి ఆపదలు రావు
13.త్రయోదశి హ్రీ కార్యములందు శుభం, నైతికంగా దిగజారకుండా జాగరూయకత వహించుట ప్రశ్రయం- చెడుపనులను చేయకుండుట, ఇతరుల విశ్వాసం చూరగొనుట
14.చతుర్ధశి మూర్తి ఏ పని చేయక ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయుట సకల సద్గుణములు కలుగును
15.పూర్ణిమ సతీదేవి (శక్తి, షోడశి మాంగల్యాది దేవతలు) దౌవధ్యానం, దేవీ ఉపాసన ప్రజ్ఞ-జగన్మాత అనుగ్రహము, ఉన్నత లక్ష్యసిద్ధి
16.అమావాస్య పితృలోకము బ్రహ్మచర్య సాధన, పరబ్రహ్మ ధ్యానం తేజస్సు, ధారణ శక్తి, జ్ఞానం, విజ్ఞానం, బ్రహ్మనిష్ట

తిథి శూలలు

[మార్చు]
  • తూర్పు :- పాడ్యమి నవమి.
  • ఆగ్నేయము :- తదియ, ఏకాదశి.
  • దక్షిణము :- పంచమి, త్రయోదశి.
  • నైరుతి :- చవితి, ద్వాదశి.
  • పడమర :- షష్ఠి, చతుర్ధశి.
  • వాయవ్యము :- సప్తమి, పూర్ణిమ.
  • ఉత్తరము :- విదియ, దశమి.
  • ఈశాన్యము :- అష్టమి, అమావాశ్య.

ఇతర విషయాలు

[మార్చు]

తిథి అనగా... తేది, దినము, రోజు అని అర్థం. ప్రస్తుత కాలంలో ఈరోజు తేది ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసే, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది. గత కాలంలో తిథి అంటె తేది అనే సమానార్థంలోనే, చాంద్ర మాస దినాలలో విదియ, తదియ, ద్వాదశి, త్రయోదశి అని చెప్పేవారు. ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణము. ఆ మరు దినము చందమామ దినదినానికి క్షీణించి పదునైదవ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు అమావాస్య. ఈ తతంగ మంతా సూర్య చంద్రుల గమనం వల సంభవిస్తుంది. (నిజానికి భూబ్రమణం వల్ల) ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతున్న ఈ తిథిని అది ఏ తిదో చందమామను చూచి చెప్పేవారు. శాస్త్రీయంగా చెప్పాలంటే చాంద్ర మాసానికి 29-1/2 రోజులు. సూర్యును నుండి 12 డిగ్రీలకు ఒక తిథి ఏర్పడుతుంది. పూర్తి వృత్తానికి 360 డిగ్రీలు. ఆవిధంగా 180 డిగ్రీలు సూర్య చంద్రుల మధ్య వున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అదే విదంగా ఒకే డిగ్రీలో సూర్య చంద్రులున్నప్పుడు ఏర్పడేదె అమావాస్య. ఇప్పటిలాగా క్యాలెందరో, వాచీనో చూసి చెప్ప నవసరంలేదు. నిరక్షరాస్యులు సైతం చందమామ వైపు చూసి అది ఏతిదో చెప్పగలిగేవారన్న మాట. ఇది ఒకప్పటి భారతీయ పద్ధతి.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తిథి&oldid=3793505" నుండి వెలికితీశారు