పాము

వికీపీడియా నుండి
(సర్పము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సర్పాలు
Temporal range: Cretaceous - Recent
కొరల్ జాతి పాము

Scientific classification
Kingdom:
Phylum:
Class:
శారోప్సిడ
Order:
Suborder:
సెర్పెన్టిస్

Superfamilies and Families
Aniliidae
Anomochilidae
బోయిడే
Bolyeriidae
Cylindrophiidae
Loxocemidae
పైథానిడే
Tropidophiidae
Uropeltidae
Xenopeltidae
Anomalepididae
Leptotyphlopidae
Typhlopidae
Acrochordidae
Atractaspididae
కాలుబ్రిడే
ఎలాపిడే
హైడ్రోఫిడే
వైపరిడే
నీలం: సముద్రపు పాములు, నలుపు: భౌమ పాములు

పాములు లేదా సర్పాలు పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చేవులు ఉండవు కనీ పాముకు, ఆంతర్ చెవులు ఊంటయి

పాశ్చాత్య సంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు. ప్రతి సంవత్సరం జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవం జరుపుకుంటారు.[1]

సాధారణ లక్షణాలు

[మార్చు]
  • సర్పాల దేహం సన్నగా పొడవుగా ఉంటుంది. పూర్వ చరమాంగాలు, ఉరో, శ్రోణి మేఖలలు లోపిస్తాయి. కొండచిలువలలో మాత్రం ఇవి బుడిపెలు మాదిరి అవశేషాలుగా ఉంటాయి. సర్పాలు పర్వుకలకు అతికిన కండరాల ద్వారా చలిస్తాయి.
  • పొలుసులతో కూడిన బహిస్తరమంతా అనేకసార్లు దేహం నుంచి పొరలుగా విడుదలవుతుంది. దీన్ని కుబుస విసర్జన లేదా మౌల్టింగ్ లేదా ఎక్టైసిస్ అంటారు.
  • కర్ణభేరి త్వచం, మధ్య చెవి కుహరం, శ్రోత్రనాళాలు లోపిస్తాయి.
  • మగ జీవుల్లో ఒక జత కంటకయుత సంపర్కావయవాలు ఉంటాయి.
  • ఊపిరితిత్తులు అసౌష్ఠవంగా ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా లోపించడం గాని లేదా చిన్నదిగా గాని ఉంటుంది.
  • కపాల నాడులు పది జతలుంటాయి.
  • కనురెప్పలు కదలలేవు.
  • సర్పాల్లో కర్ణస్తంభిక (Columella) ప్రలంబంతో అతికి ఉండడం వల్ల, భూమిద్వారా వెలువడే ప్రకంపనాలను మాత్రమే గ్రహించగలవు.
  • మూత్రపిండాలు అసౌష్ఠవంగా ఉంటాయి. మూత్రాశయం ఉండదు.

పాము వినికిడి

[మార్చు]
పరిణామక్రమంలో పాముల బాహ్య చెవులు వ్యర్థావయవాలు (vestigial organs) అయ్యాయి కాని పాముకు అంతర్ చెవులు (Inner ear) ఉన్నాయి, పాము వీటి సహాయంతో వినగలదు. చెవి అంటే ఇది ఒక శరీరభాగము. ఇది ఒక జ్ఞానేంద్రియము. శరీరములోని వినికిడి సాధనము. పంచేంద్రియాలలో ఒకటి. 

The Technical University of Munich, Germany,, The Bernstein Center for Computational Neuroscience కు చెందిన J. Leo van Hemmen, Paul Friedel అనే శాస్త్రవేత్తలు పాములు వినగలవు అని తాజా అధ్యయనం ద్వారా కనుగొన్నారు. పాములకు కర్ణభేరి (Eardrum)s, ఉండవు కాని అంతర్ చెవులు (Inner ear), కాక్లియా (Cochlea) నిర్మాణాలు సహాయంతో గాలిలో గల ప్రకంపనలు గ్రహించటం ద్వారా వినగలవు.[2]

పాముల ఆహారం

[మార్చు]

అన్ని పాములు పూర్తిగా మాంసాహారులు. ఈ పరభక్షకాలు ఎక్కువగా బల్లులు, చిన్న పాములు, జంతువులు, పక్షులు, గుడ్లు, చేపలు, కీటకాలు భుజిస్తాయి.[3]

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో పాము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[4] పాము n. A snake or serpent, సర్పము. ఉదా: An eel of any kind, called కళ్లెం పాము, మలుగుపాము, చెమ్మేని పాము, తవిటి పాము కొమ్మిరే పాము and Russell on Fishes, No. 31, 35, &c. నలికండ్ల పాము the black dotted lizard. వానపాములు maggots in rain water. పాముల గద్ద n. A sort of heron. Jerd. Catal. పాముల నారిగాడు n. The Common Heron. Ardea cinerea, or, the purple Heron, Ardea purpurata. (F.B.I.) పాముకొండ n. A species of దొండ. పాములవాడు n. A snake catcher or charmer పామువేలు n. A name for the middle finger మధ్యవేలు.

పాము లేదా ప్రాము v. a. అనగా To smear, rub, or wash, as a wall, &c. రాచు, రుద్దు అని కూడా అర్ధాలున్నాయి. ఉదా: "పదము నేల బెట్టి పాము చుండ."

మానవులతో సంబంధాలు

[మార్చు]

పాము కాటు

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా 'ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు,50,000 మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా.ప్రపంచంలో ఒక్క ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు.మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3 వేల జాతుల పాములున్నాయి. మన దేశంలో ఉన్న250 జాతులలో 52 విష సర్పాలు. అమెరికా, ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో పాము కాటు మరణాలు పదుల సంఖ్యల్లో ఉంటున్నాయి. రోగికి ముందు ధైర్యం చెప్పాలి. విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటివెంట నురుగు, చూపు రెండు దృశ్యాలుగా కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రి పెరాల్టిక్, పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీ వెనమ్ డోసు ఇవ్వాలి.మొదట పది వైల్స్ యాంటీవెనమ్, ఆరు గంటల వ్యవధి తర్వాత మరో పది వైల్స్ డోసు ఇవ్వాలి.ఆరు గంటల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుంటే చివరి డోసుగా ఐదు నుంచి పది వైల్స్ యాంటీ వెనమ్ ఇవ్వాలి.చాలా ప్రాంతాల్లో పాము కాటు విషానికి సరైన విరుగుడు చికిత్స అందుబాటులో లేకే బాధితులు పెరుగుతున్నారు.

పాములు : కొన్ని గణాంక వివరాలు

[మార్చు]

అత్యంత పొడవైన విషపూరితమైన పాము  : రాచ నాగు (కింగ్ కోబ్రా) అతి పొడవైన పాము : అనకొండ (Anaconda). దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు. (18 అడుగులు). అతి చిన్న పాము : త్రెడ్ పాము (Thread Snake): పొడవు 11 సె.మీ. (4.4 అంగుళాలు). West Indies లో కనబడుతుంది. అతి పొడుగాటి కోరలు గల పాము : గబూన్ వైపర్ (Gaboon Viper). వీటి కోరలు 5 సె.మీ. (2 అంగుళాలు) కంటే ఎక్కువ. అత్యధిక వేగంతో ప్రాకే పాము : నల్ల మాంబా (Black Mamba). ఇది గంటకు 19 కి.మీ. (12 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది.

పాము ఆహారం

[మార్చు]

కొన్ని దేశాలలో పాముల్ని ఆహారంగా తింటారు.

పురాణాలలో

[మార్చు]

వర్గీకరణ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఫ్యామిలీ (15 July 2016). "నేడు వరల్డ్ స్నేక్ డే". Sakshi. Archived from the original on 28 May 2017. Retrieved 30 June 2020.
  2. Snakes indeed hear Hemmen and Fridel researches shows snakes indeed listen Archived 2016-07-20 at the Wayback Machine Retrived:www.animals.mom.me
  3. Bebler (1979) p.581
  4. బ్రౌన్ నిఘంటువు ప్రకారం పాము పదప్రయోగాలు.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పాము&oldid=4337948" నుండి వెలికితీశారు