జూపల్లి కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జూపల్లి కృష్ణారావు
తరువాత బీరం హర్షవర్దన్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-08-10) 1955 ఆగస్టు 10 (వయసు 69) [1]
కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా , తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సుజన
సంతానం వరుణ్, అరుణ్
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొల్లాపూర్ నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం 2023 డిసెంబర్ 7 నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[2][3][4]

జననం

[మార్చు]

జూపల్లి కృష్ణారావు ప్రస్తుత వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, పెద్దదగడ గ్రామంలో 10 ఆగస్ట్ 1955లో శేషగిరిరావు, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. ఈ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం ఉండగా కృష్ణారావు ఆరో సంతానం.[5][6]

వివాహం

[మార్చు]

జూపల్లి కృష్ణారావుకు సుజనతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (వరుణ్ జూపల్లి, అరుణ్ జూపల్లి) ఉన్నారు.

ఉద్యోగం - వ్యాపారం

[మార్చు]

జూపల్లి కృష్ణరావు ఒక బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా నిర్మాణరంగంలోకి ప్రవేశించి విజయం సాధించారు.

రాజకీయ జీవితం

[మార్చు]

జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయనకు 2004లో జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొల్లాపూర్ స్థానం టీఆర్ఎస్ పార్టీకి కేటాయించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జూపల్లి కృష్ణారావు 2009 ఎన్నికల్లో కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై వై.యస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో పౌర సరఫరాలు, వినయోగదారుల వ్యవహారాలు మంత్రిగా ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా పని చేశాడు.[7] [8] తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి 2011 అక్టోబరు 30న తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు.[9][10] ఆయన ఆ తరువాత 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఆయన 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచి[11] కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు. జూపల్లి కృష్ణరావు 2018లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[12] బీరం హర్షవర్దన్ రెడ్డి అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పార్టీతో అసంతృప్తితో ఉన్న ఆయన 2023 ఏప్రిల్ 09న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్త గూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాడు.

ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.[13][14] ఆయన 2023 ఆగష్టు 3న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి[15], 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొల్లాపూర్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి[16], డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[17][18]

జూపల్లి కృష్ణారావుకు 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా[19], డిసెంబర్ 24న నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమించారు.[20] లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయనను మార్చి 31న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.[21]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (17 December 2014). "కొత్త మంత్రుల జీవిత విశేషాలు..." Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  2. Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. 21 February 2024. "మరోసారి మంత్రిగా జూపల్లి కృష్ణారావు - రాజకీయ ప్రస్థానం ఇదే". Hindustantimes Telugu. Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-05-03. Retrieved 2017-01-18.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-15. Retrieved 2017-01-18.
  7. Eenadu (10 November 2023). "రాజకీయాల్లో కొలువుదీరారు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  8. "Rail roko off; More trains run on day-II". Ibnlive.in.com. 2011-10-18. Archived from the original on 2014-07-29. Retrieved 2013-08-04.
  9. PTI (2011-10-30). "Two MLAs from Congress join TRS". The Hindu. Retrieved 2013-08-04.
  10. "3 Telangana Congress MLAs set to join TRS". Ibnlive.in.com. 2011-10-30. Archived from the original on 2013-10-09. Retrieved 2013-08-04.
  11. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  12. Andhra Jyothy (10 April 2023). "సంచలనాలకు మారుపేరు జూపల్లి.. ఆయన కెరియర్ ఎలా సాగిందంటే..." Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
  13. Prajasakti (10 April 2023). "బిఆర్‌ఎస్‌ నుండి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సస్పెన్షన్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
  14. Eenadu (10 April 2023). "భారాస నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
  15. TV9 Telugu (3 August 2023). "కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల.. ఖర్గే సమక్షంలో." Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  16. Eenadu (4 December 2023). "కొత్తగా వచ్చింది ఇద్దరు స్థిరత్వం చూపింది ఇద్దరు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  17. Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  18. Namaste Telangana (8 December 2023). "12 మందితో కాంగ్రెస్‌ క్యాబినెట్‌". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  19. Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
  20. Sakshi (24 December 2023). "TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రుల నియామకం". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  21. Andhrajyothy (31 March 2024). "లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్.. హైదరాబాద్‌కు ఎవరంటే." Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.