పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy.jpg
మాజీ పార్లమెంటు సభ్యుడు
In office
2014-2019
అంతకు ముందు వారునామా నాగేశ్వరరావు
తరువాత వారునామా నాగేశ్వరరావు
నియోజకవర్గంఖమ్మం లోకసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననంనవంబరు 4, 1959
నారాయణపురం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
జీవిత భాగస్వామిమాధురి
సంతానంకుమారుడు (హర్షారెడ్డి), కుమార్తె (సప్ని).
తల్లిదండ్రులురాఘ‌వ‌రెడ్డి, స్వ‌రాజ్యం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. 2014 నుండి 2019 వరకు ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి 16వ లోకసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జీవిత విషయాలు[మార్చు]

శ్రీనివాస్ రెడ్డి 1959, నవంబరు 4న రాఘ‌వ‌రెడ్డి, స్వ‌రాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా, కల్లూరు మండలంలోని నారాయణపురంలో జన్మించాడు. వ్యవసాయదారుడిగా పనిచేశాడు. 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బిఏ డిగ్రీని పూర్తిచేశాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈయనకు 1992, మే 8న మాధురితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (హర్షారెడ్డి), ఒక కుమార్తె (సప్ని) ఉన్నారు.[3]

సామాజిక కార్యక్రమాలు[మార్చు]

1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్‌ నిర్మాణం చేశాడు. ఆ క్రాస్‌వాల్‌ నిర్మాణం వల్ల 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా కాంట్రాక్టర్‌గా మారి ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేశాడు.[3]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ, వివిధ హోదాల్లో పనిచేశాడు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా ఉన్నాడు. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.[4] ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.

2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో, 2019 17వ లోకసభ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాడు.[5]

నిర్వహించిన పదవులు[మార్చు]

  1. 2014, సెప్టెంబరు 1 నుండి 2019 వరకు రవాణా, పర్యాటక, సంస్కృతి శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నాడు.
  2. ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా పనిచేశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. The Times of India, Politics. "PONGULETI SRINIVASA REDDY : Bio, Political life, Family & Top stories". Archived from the original on 29 February 2020. Retrieved 31 July 2020.
  2. "Members : Lok Sabha (Sixteenth Lok Sabha Members Bioprofile)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-16. Retrieved 2021-12-21.
  3. 3.0 3.1 సాక్షి, పాలిటిక్స్ (19 May 2019). "నన్ను తీర్చిదిద్దింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి." Sakshi. Archived from the original on 22 May 2019. Retrieved 31 July 2020.
  4. "Ponguleti Srinivasa Reddy(Yuvajana Sramika Rythu Congress Party):Constituency- KHAMMAM(TELANGANA) - Affidavit Information of Candidate:". myneta.info. Archived from the original on 2021-04-18. Retrieved 2021-12-21.
  5. "Constituencywise-All Candidates". Archived from the original on 18 May 2014. Retrieved 30 July 2020.
  6. "పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి". www.oneindia.com. Archived from the original on 2021-11-03. Retrieved 2021-12-21.