పెంట్లవెల్లి మండలం
| పెంట్లవల్లి | |
| — మండలం — | |
| రాష్ట్రం | తెలంగాణ |
|---|---|
| జిల్లా | నాగర్‌కర్నూల్ జిల్లా |
| మండల కేంద్రం | పెంట్లవెల్లి |
| గ్రామాలు | 8 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| వైశాల్యము | |
| - మొత్తం | 99 km² (38.2 sq mi) |
| జనాభా (2016) | |
| - మొత్తం | 20,744 |
| - పురుషులు | 10,734 |
| - స్త్రీలు | 10,010 |
| పిన్‌కోడ్ | {{{pincode}}} |
పెంట్లవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 8 గ్రామాలున్నాయి. [3] ప్రస్తుతం ఈ మండలం కొల్లాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండల కేంద్రం పెంట్లవల్లి గ్రామం కూడా ఇదే డివిజనులో, కొల్లాపూర్ మండలంలో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 99 చ.కి.మీ. కాగా, జనాభా 20,744. జనాభాలో పురుషులు 10,734 కాగా, స్త్రీల సంఖ్య 10,010. మండలంలో 4,952 గృహాలున్నాయి.[4]
2016 లో ఏర్పడిన మండలం
[మార్చు]లోగడ పెంట్లవెల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను పరిధిలోని కొల్లాపూర్ మండలపరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా పెంట్లవల్లి గ్రామాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా నాగర్‌కర్నూల్ జిల్లా,నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
