పదర మండలం
పదర మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
లోగడ పదర గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను పరిధిలోని అమ్రాబాద్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా పదర గ్రామాన్ని (1+06) ఏడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
మాతా శిశు మరణాల నివారణ పైలెట్ ప్రాజెక్టుగాఎంపిక[మార్చు]
ఈ మండలంలో ఎక్కువుగా చెంచులు నివశిస్తారు.మండల పరిధిలోని గర్భణీలందరూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోనే ప్రసవించేలాగున, వార్కి మెరుగైన వెద్య సేవలు అందించి, మాతా శిశు మరణాల నివారణలో భాగంగా మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపికచేయబడింది.[3]
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-18.
- ↑ Eenadu. "మాతా శిశు మరణాల నివారణకు.. పదర - EENADU". www.eenadu.net. Retrieved 2020-01-18.[permanent dead link]