వెలుదండ రామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెలుదండ రామేశ్వర రావు మహబూబ్ నగర్ జిల్లా, బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన కవి. వీరు 27.07.1935 లో జన్మించారు. కనక రత్నమ్మ, వెలుదండ నారాయణ రావు వీరి తల్లిదండ్రులు. ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు బోధన చేసి, ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అద్వితీయమైన పాండిత్యం కలవారు. ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో కూడా వీరిది అందె వేసిన చెయ్యి. వీరు చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం. శ్రీ కుసుమ హరనాథ, శ్రీ రామకృష్ణ ప్రభ, గైర్వాణి, ఆంధ్రప్రదేశ్ వంటి పత్రికలలోనూ వీరి రచనలు వచ్చాయి.

ముద్రిత రచనలు[మార్చు]

1. శ్రీరామ భూవర శతకం 2. ఆంధ్ర నారద భక్తి సూత్రములు 3. శ్రీ శ్రీనివాస నివేదనం 4. నా దైవం - నా దేశం 5. శ్రీ కుసుమహర శరణాగతి 6. శ్రీ సత్యసాయి రామ అక్షరార్చన

అముద్రిత రచనలు[మార్చు]

1. రామేశ్వరీయం 2. శ్రీకృష్ణ తారావళి 3. ప్రశ్నోత్తరి 4. విద్య 5. విద్యుత్ సందేశం 6. ఆత్మ నివేదనం 7. మనోవశీకరణమునకు కొన్ని మార్గములు