పాలమూరు జిల్లా సాహితీ పరిశోధకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహబూబ్ నగర్ జిల్లాలో కవులు, కళాకారులకే కాకుండా సాహితీ పరిశోధకులకు కూడా కొదువలేదు. ఈ జిల్లాలో ఎంతో మంది సాహితీ రంగంలో విస్తృత పరిశోధనలు చేశారు. ఎన్నో ప్రాచీన కావ్యాలలోని విశేషాలను వెలికితీశారు. జానపదుల జీవితం, సాహిత్యం మొదలగు అంశాలపైన కొందరు; గ్రామాలు, దేవాలయాలు, శాసనాలు, సంస్కృతి మొదలగు అనేక అంశాలపై పరిశోధనలు చేసి తమ అమూల్యమైన సిద్ధాంత గ్రంథాలను ఆవిష్కరించారు. వీరిలో ఆత్మసంతృప్తి కొరకు పరిశోధనలు చేసినవారు కొందరైతే, విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్., పి.హెచ్.డి., పట్టాల కొరకు పరిశోధనలు చేసినవారు మరికొందరు. కపిలవాయి లింగమూర్తి, గడియారం రామకృష్ణశర్మ, నాగలింగ శివయోగి లాంటి వారు మొదటి కోవకు చెందినవారైతే, పాకాల యశోదారెడ్డి, ఎస్.వి.రామారావుమొదలగువారు రెండవ కోవకు చెందినవారు. విశ్వవిద్యాలయ పరిశోధకులలో అధికభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా కొరకు చేసినవారే ఎక్కువగా ఉన్నారు.

పరిశోధకులు-పరిశోధనాంశాలు[మార్చు]

క్రమ సంఖ్య పరిశోధకులు పరిశోధనాంశం సంవత్సరం ప్రాంతం
1 పాకాల యశోదారెడ్డి తెలుగులో హరివంశాలు ... బిజినేపల్లి
2 ఎస్.వి.రామారావు తెలుగు సాహిత్య విమర్శ- అవతరణ, వికాసం ... శ్రీరంగాపురం
3 ముకురాల రామారెడ్డి తెలుగులో కవిత్వాదర్శాలు-పరిణామాలు ... కల్వకుర్తి
4 వెల్దండ రఘుమారెడ్డి పల్లెపదాలలో ప్రజా జీవనం 1974 కల్వకుర్తి
5 ఇరివెంటి కృష్ణమూర్తి తెలుగులో కవిసమయాలు ... ....
6 వల్లపురెడ్డి బుచ్చారెడ్డి మధురవాణి విలాసం-పరిశీలన 1980 వనపర్తి
7 గంగాపురం హరిహరనాథ్ మహాభారతంలో కరుణరసం 1980 మేడిపూర్
8 ఎల్లూరి శివారెడ్డి మహాభారత విరాటోద్యోగ పర్వాలు- రసపోషణ ... కొల్లాపూర్తాలుకా, కాల్లూర్
9 కసిరెడ్డి వెంకటరెడ్డి తెలుగు పొడుపు కథలు-పరిశీలన ... కల్వకుర్తి
10 మసన చెన్నప్ప వేటూరి ప్రభాకరశాస్త్రివాజ్మయ సూచిక - పరిశీలన (ఎం.ఫిల్., ప్రాచీన కావ్యాలు-గ్రామీణ జీవన చిత్రణ (పి.హెచ్.డి.) 1983 కలకొండపల్లె
11 కె. కిశోర్‌బాబు నాగర్ కర్నూలు తాలుకా గ్రామాలు- చరిత్ర (ఎం.ఫిల్.) 1983 నాగర్ కర్నూల్
12 రుక్నుద్దీన్ జానపద సాహిత్యంలో అలంకార విధానం 1984 కల్వకుర్తి
13 కట్టా వేంకటేశ్వరశర్మ గద్వాల సంస్థానము- తెలుగు సాహిత్య పోషణం 1984
14 ఉందేకోడు రత్నయ్య నిరోష్ట్య రచనలు -పరిశీలన 1985 ఆత్మకూరు
15 నళినీరెడ్డి పాలగుమ్మి పద్మరాజునవలలు-పరిశీలన 1985 ఆత్మకూరు
16 గూడా సుమిత్రాదేవి స్వర్ణకంకణ గ్రహీతలైన కవయిత్రుల కావ్యాలు- పరిశీలన 1985 షాద్‌నగర్
17 బుక్కా బాలస్వామి మహబూబ్ నగర్ జిల్లా జానపద కథలు 1986 మహబూబ్ నగర్
18 కె. మోహన్‌రెడ్డి వనపర్తి సంస్థానం-సాహిత్య పోషణ 1986 వనపర్తి
19 ఉమ్మెత్తల లక్ష్మీనారాయణ త్రిపురనేని గోపిచంద్ కథలు- పరిశీలన 1987 వనపర్తి
20 చింతోజు కిష్టయ్య కథానిక -ప్రారంభం, వికాసం 1987 రఘుపతిపేట
21 విరజాజి రామిరెడ్డి ఆరుద్రత్వమేవాహం-ఒక పరిశీలన (ఎం.ఫిల్.) ... కొల్లాపూర్
22 మర్రి నరసింహారెడ్డి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం -పరిశీలన ... వెల్లటూరు
23 తలముడిపి బాలసుబ్బయ్య రాచకన్యకా పరిణయం-పరిశీలన ... కొల్లాపూర్
24 వెల్దండ సత్యనారాయణ చంద్రికాపరిణయం - పరిశీలన ... మంగనూర్
25 వెల్దండ నిత్యానందరావు తెలుగులో పేరడీలు ... మంగనూర్
26 శ్రీభట్టర్ శ్రీనివాసాచార్యులు గోపాల్‌పేట సంస్థానం -ఆర్థిక పరిస్థితి (ఎం.ఫిల్.,) ... నాగర్ కర్నూల్
27 జి.వేంకటేశ్వర్లు కుందుర్తి వచన కవిత్వం- పరిశీలన (ఎం.ఫిల్.,) ... మహబూబ్ నగర్
28 ఛందోజీరావు పువ్వాడ శేషగిరిరావుకథానికలు-పరిశీలన (ఎం.ఫిల్.); గొల్లపూడి మారుతీరావుజీవితం, సాహిత్యం (పి.హెచ్.డి.) ... మామిడిమడ
29 కె.ఎస్.లక్ష్మారెడ్డి పాండురంగని పదగుంఫనం ... గద్వాల
30 అప్పం పాండురంగయ్య భాషాశాస్త్రం-పరిశీలన ... ...
31 జి.చెన్నకేశవరెడ్డి ఆధునికాంధ్ర గేయకావ్యాలు -పరిశీలన ... గద్వాల
32 నరసింహారావు జాతీయోద్యమంలో నవలల పాత్ర ... వెల్లటూర్
33 విట్టా వేణుగోపాలు ఆంధ్ర సాహిత్యంలో గిరిజన జీవితం ... బిజినపల్లి
34 కె.రామన్ గౌడు తాడూరుమండలం- జానపద భాష ... బల్లానిపల్లె
35 అల్పూరు అనంతరాములు కపిలవాయి లింగమూర్తి శతకాలు-పరిశీలన (ఎం.ఫిల్.) ... కొత్తకోట
36 మహ్మద్ హుస్సేన్ విశ్వనాథ వేనరాజుపై సమకాలీన సాంస్కృతికోద్యమాల ప్రభావం (ఎం.ఫిల్.)

ఆలంపూర్ సీమ - సంస్కృతాంధ్ర సాహిత్యాలు (పి.హెచ్.డి.)

... కొల్లాపూర్
37 టి.వి.భాస్కరాచార్య వి.వి.ఎల్.నరసింహారావు కృతులు-పరిశీలన ... షాద్‌నగర్
38 రాజశ్రీ రంగారెడ్డి జిల్లాజానపద గేయాలు -పరిశీలన ... తుమ్మనపేట
39 భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం ... మహబూబ్ నగర్
40 విరివింటి సురేష్‌బాబు పాలమూరు జిల్లా శతక సాహిత్యం -పరిశీలన ... మంగనూర్
41 బి.వెంకటయ్య (పరిమళ్) పాలమూరు జిల్లా వచన కవిత్వం - పరిశీలన ... మంగనూర్
42 కె.బాలస్వామి గౌరీవిలాస కావ్యానుశీలనం ... మరికల్
43 ఎం.రాములు నైజాం రాజ్యంలో మహబూబ్ నగర్ జిల్లా సంస్థానాలు ... ఆత్మకూర్
44 గొట్టి ముక్కల నరసింహాశర్మ రామసుబ్బారాయుని లఘుకావ్యాలు-పరిశీలన ... ...
45 నాయకంటి నరసింహాశర్మ కొల్లాపూర్ సంస్థానం-సాహిత్య సేవ ... వనపర్తి
46 జె. చెన్నయ్య తెలుగు దినపత్రికలు-భాషా సాహిత్యం స్వరూపం ... ...
47 ఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి పోల్కంపల్లి శాంతాదేవి కథలు-పరిశీలన (ఎం.ఫిల్., ) ... వనపర్తి
48 బూర్గుల కేశవులు మహబూబ్ నగర్ జిల్లా మోటపాటలు (ఎం.ఫిల్.) ; జానపద విజ్ఞానంలో దాసరులు (పి.హెచ్.డి.) ...
49 ఇరువింటి వెంకటరమణ (హిమజ్వాల) తెలుగు సాహిత్యంపై శరత్ ప్రభావం ... ...
50 పొద్దుటూరి ఎల్లారెడ్డి గజ్జెల మల్లారెడ్డిసాహిత్యం-పరిశీలన (ఎం.ఫిల్.) ; తెలంగాణ యక్షగానం-రచనాప్రయోగం (పి.హెచ్.డి.) ... మహబూబ్ నగర్
51 గుడికాడి ఆంజనేయులు గౌడు గౌడపురాణం పటం కథ-పరిశీలన (ఎం.ఫిల్.) ; కులపురాణం- గౌడపురాణం (పి.హెచ్.డి.) ... కొందుర్గ్
52 కాశీం ... ... అచ్చంపేట
53 వెల్దండ వేంకటేశ్వరరావు ఆంధ్రమహాభ్యుదయం-వివేచనం ... మంగనూర్
54 శ్రీవైష్ణవ వేణుగోపాల్ శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్.) మద్రాసు విశ్వవిద్యాలయం 2016 సూరారం (కోయిలకొండ)
55 మంగళగిరి శ్రీనివాసులు ఆంధ్ర సారస్వత పరిషత్తు- తెలుగు భాషా సాహిత్య సేవ (పి. హెచ్.డి.) ఉస్మానియా విశ్వవిద్యాలయం 2018 బోయినపల్లి మిడ్జిల్ మండలం
56 వి.వీరాచారి తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు-కవులు, రచయితలు (పి.హెచ్.డి.)
57 శ్రీవైష్ణవ వేణుగోపాల్ తెలుగు సాహిత్యంలో సరస్వతి - పరిశీలన (పిహెచ్.డి) కాశీ హిందూ విశ్వవిద్యాలయం 2023 సూరారం (కోయిలకొండ)

మూలాలు[మార్చు]

  1. మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి, మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -835.
  2. పాలమూరు కవిత, సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-157.
  3. కులపురాణం - గౌడపురాణం, రచన:గుడికాడి ఆంజనేయులు గౌడు
  4. గద్వాల సంస్థానం- తెలుగు సాహిత్య పోషణం, రచన: కట్టా వేంకటేశ్వరశర్మ
  5. శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన, రచన: శ్రీవైష్ణవ వేణుగోపాల్, 2016