తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.[1][2]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ రాథోడ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.నాగారావు[21] కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్నాక రమేశ్[22] భారతీయ జనతా పార్టీ టికెట్ తుకారాం[23] పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 1,15,087 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[24]
2009 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు[25]
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 12 మంది పోటీలో ఉన్నారు.[26]
18 వ. లోక్ సభ ఆదిలాబాద్ లోక్ సభ స్థానం (ఎస్టీ) లో మరోసారి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. భారత రాష్ట్ర సమితి నుండి భారతీయ జనతా పార్టీ లో చేరి చివరి నిమిషంలో గోడం నగేష్ భారతీయ జనతా పార్టీ టికెటు దక్కించుకున్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సుగుణ, భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి ఆత్రం సక్కు బరిలో దిగారు.ఆదిలాబాద్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగిలిన ఆరు నియోజక వర్గాలలో అనుకున్న రీతిలో ఓట్లను సాధించలేక పోవడంతో బిజేపి గెలుపు సాధించింది. ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 90.652 ఓట్ల ఆధిక్యంతో సత్తా చాటారు.మొత్తం 23 రౌండ్లలో ఈవీఎం ఓట్లు లెక్కింపు జరగగా అందులో అత్యధికంగా 19 రౌండ్లలో భాజపా,4 రౌండ్లలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం కనబర్చింది.11,14,16,17 రౌండ్లలో స్వల్ప ఆధిక్యం మినహా మిగతా రౌండ్లలో భారతీయ జనతా పార్టీయే కొనసాగింది.
ఆదిలాబాద్ లోక్ సభ స్థానం పై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రచారానికి అగ్రనేత రాహుల్ గాంధీని పిలిచింది. 2024 జూన్ 4 న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా స్థానిక సంజయ్ గాంధీ సాంకేతిక కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు ఈ లెక్కింపు ప్రక్రీయ కొనసాగింది. జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా,ఎస్పీ గౌష్ ఆలం ,అదనపు పాలనాధికారి శ్యామలాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.మొత్తం 23 రౌండ్లో గోడం నగేష్ కు 5,68,168 ఓట్లు 45.98% రాగా ,కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కు 4,77,516 ఓట్లు 38.65% రెండో స్థానంలో నిలిచింది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆత్రం సక్కు ఈ ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూశారు. పోలైన ఓట్లలో కనీసం 16 శాతం ఓట్లు సాధిస్తేనే అభ్యర్థి ధరావతు దక్కుతుంది.కేవలం 1,37,300 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే 11 .11 శాతం ఓట్లు దక్కించుకోవడం తో అభ్యర్థి సక్కు ధరావత్తును కోల్పోయారు.