గడ్డం నర్సింహారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గడ్డం నరసింహారెడ్డి
గడ్డం నర్సింహారెడ్డి

గడ్డం నరసింహారెడ్డి


నియోజకవర్గం ఆదిలాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1936-04-14) 1936 ఏప్రిల్ 14 (వయస్సు 85)
జక్రాన్‌పల్లె, నిజామాబాదు జిల్లా , తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి చందనా రెడ్డి
సంతానం ముగ్గురు కుమారులు, ఒక కూతురు
మతం హిందూ

గడ్డం నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1977-1980, 1980-84లలో ఎన్నికయ్యారు.[1] ఈయన నిజామాబాదు జిల్లా లోని జక్రాన్‌పల్లెలో 1936 ఏప్రిల్ 14న జన్మించారు. ఈయన తండ్రి పేరు గంగారెడ్డి.[2]

ఈయన విద్యాభ్యాసంలో పూణేలోని ఎస్.ఎస్.పి.ఎం పాఠశాల, వాడియా కళాశాల, హైదరాబాదులోని నిజాం కళాశాలలలో జరిగింది. నరసింహారెడ్డి 1961-1971 వరకు మంచిర్యాల పురపాలక సంఘం ఛైర్మన్ గా పనిచేశాడు. ఆ తరువాత 1970 నుండి 1976 వరకు అదిలాబాదు జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశాడు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న ఐదేళ్లలో విద్యాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల భవనాలు ఆయన హయాంలోనే నిర్మించబడ్డాయి. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి పట్టణ నడిబొడ్డులోని విలువైన సొంత స్థలాన్ని ఇచ్చి తన తండ్రి గంగారెడ్డి స్మారక ఆస్పత్రిగా నామకరణం చేశారు. 1977లో కాంగ్రేసు పార్టీ తరఫున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికై ఆరవ, ఏడవ లోకసభలో ఆదిలాబాదుకు ప్రాతినిధ్యం వహించాడు. పార్లమెంటు సభ్యునిగా మలేసియా, సింగపూర్, థాయిలాండ్, జపాన్ మొదలైన దేశాలు పర్యటించాడు. ఆ సమయంలోనే పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సభ్యునిగా వ్యవహరించాడు.

ఈయన వృత్తి రీత్యా వ్యవసాయదారుడు, వ్యాపారవేత్త. కొన్నాళ్ళు తునికాకు కాంట్రాక్టర్‌గా కూడా పనిచేశాడు. నరసింహారెడ్డి సికింద్రాబాద్ క్లబ్, సికింద్రాబాద్, ఫుట్ బాల్ క్లబ్, హైదరాబాద్ లలో సభ్యుడు

వ్యక్తిగత జీవితం[మార్చు]

నరసింహారెడ్డికి 1957, ఫిబ్రవరి 09న చందనతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. ఈయన పెద్ద కుమారుడు అరవింద్‌రెడ్డి తండ్రి రాజకీయ వారసునిగా 2002 రాజకీయాల్లో ప్రవేశించి తెరాస పార్టీ తరఫున మంచిర్యాల నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. మిగిలిన ఇద్దరు కుమారులు, గంగారెడ్డి, అచ్యుత్‌రెడ్డి వ్యాపారం రంగంలో స్థిరపడ్డారు. ఈయన కూతురు అనురాధ. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మార్చి 15, 2014న హైదరాబాదులోని స్వగృహంలో కన్నుమూశాడు

ఇతరములు[మార్చు]

  • 1970లో నేత్ర శిబిరాన్ని నిర్వహించారు.
  • మంచిర్యాల, బెల్లంపల్లి గ్రామాలలో కళాశాల, ఆస్పత్రుల భవనాలు కోసం విరాళాలు సేకరించారు.

వనరులు[మార్చు]

  1. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.
  2. "లోకసభ జాలగూడు". Archived from the original on 2014-02-02. Retrieved 2014-01-25.