సికింద్రాబాద్ క్లబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సికింద్రాబాద్ క్లబ్ తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదు ప్రాంతంలో ఉన్న అతి పురాతనమైన క్లబ్. 1878, ఏప్రిల్ 26న 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ నిర్మించబడింది.[1]

సికింద్రాబాద్ క్లబ్ (1902)

ప్రారంభం[మార్చు]

బ్రిటీష్ పాలనలో అప్పటి సివిల్, మిలటరీ ఉన్నతాధికారుల కోసం ఈ క్లబ్ ఏర్పాటుచేయబడింది. తొలి రోజుల్లో దీనిని సికింద్రాబాదు పబ్లిక్ రూమ్స్ అని పిలిచేవారు. 1888 నుండి సికింద్రాబాదు గారిసన్ క్లబ్, సికింద్రాబాదు జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీస్ క్లబ్ అని పిలువబడి, 1903 నుండి సికింద్రాబాదు క్లబ్ అనే పేరుతో గుర్తింపు పొందింది.

సభ్యత్వం[మార్చు]

తొలినాళ్ళలో ఈ క్లబ్ లో ఎవరికి సభ్యత్వం ఇచ్చేవారుకాదు. గౌరవ సభ్యులుగా ఉండే అవకాశం ఇచ్చారు. కొంతకాలం తరువాత దనవంతులకు, పేరున్న వారికి సభ్యత్వం ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తులం ఈ క్లబ్ లో 5వేల మంది సభ్యులు, 15వేలమంది కుటుంబ సభ్యులు సభ్యత్వం కలిగివున్నారు. క్లబ్ లో 300 మందికిపైగా సిబ్బంది వివిధ పనులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ ఈ క్లబ్ లో సభ్యత్వం పొందాలంటే దశాబ్ధంపాటు వేచివుండవలని వస్తుంది.[2]

ఇతర వివరాలు[మార్చు]

నిజాం కాలంలో సాలార్ జంగ్ I ఈ క్లబ్ ను బాగుచేయడానికి ఆర్థిక సహాయం అందించడంతో దీనిని 1898లో బాగుచేశారు. దీనికి అనుబంధంగా బొల్లారంలో గోల్ఫ్ క్లబ్, బోట్ క్లబ్, గ్రంథాలయం మొదలైనవి నిర్మించబడ్డాయి. సికింద్రాబాద్ క్లబ్‌ భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్‌ ను విడుదల చేశారు.

అగ్నిప్రమాదం[మార్చు]

సికింద్రాబాద్ క్లబ్‌లో 2022, జనవరి 16న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదంతో క్లబ్‌ పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేయబడింది.[3][4]

మూలాలు[మార్చు]

  1. సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43
  2. Time of India, Hyderabad (10 May 2015). "Hyderabad's elite jostle for club memberships". Sudipta Sengupta. Archived from the original on 26 మార్చి 2019. Retrieved 26 March 2019.
  3. Andhrajyothy (16 January 2022). "సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం." Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.
  4. Namasthe Telangana (16 January 2022). "సికింద్రాబాద్ క్ల‌బ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. రూ. 20 కోట్ల ఆస్తి న‌ష్టం". Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.

ఇతర లంకెలు[మార్చు]