సి.మాధవరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.మాధవరెడ్డి
పార్లమెంట్ సభ్యుడు, 8వ లోకసభ
In office
డిసెంబరు 1984 – నవంబరు 1989
అంతకు ముందు వారుగడ్డం నర్సింహారెడ్డి
తరువాత వారుపి.నర్సారెడ్డి
నియోజకవర్గంఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం
శాసన సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3వ శాసన సభ
In office
మార్చి 1962 – ఫిబ్రవరి 1967
తరువాత వారుఎస్.ఏ. దేవ్షా
నియోజకవర్గంబోథ్ శాసనసభ నియోజకవర్గం
పార్లమెంట్ సభ్యుడు, 1వ లోక్‌సభ
In office
ఏప్రిల్ 1952 – ఏప్రిల్ 1957
తరువాత వారుకె.ఆశన్న
నియోజకవర్గంఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1924-08-22)1924 ఆగస్టు 22
ఆరేపల్లి, భీమారం మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ
పౌరసత్వం భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జనతా పార్టీ
జీవిత భాగస్వామిసుగుణ, లక్ష్మీ
సంతానంప్రకాష్, రవి, కల్పన, హిమవంత్
తల్లిదండ్రులునరసింహారెడ్డి (తండ్రి)
కళాశాలఉస్మానియా యూనివర్సిటీలో
నైపుణ్యంవ్యవసాయవేత్త & రాజకీయ నాయకుడు
సభలువివిధ కమిటీల సభ్యుడు


సి.మాధవరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ సభ్యుడు. తెలుగుదేశం పార్టీ తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుండి 1వ మరియు 8వ లోక్‌సభలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2][3]

జననం, విద్య[మార్చు]

మాధవరెడ్డి 1924, ఆగస్టు 22న తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, భీమారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు నరసింహారెడ్డి.[4] ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఎంఏ పట్టా అందుకున్నాడు. వృత్తి రీత్యా వ్యవసాయవేత్త.[5]

వివాహం[మార్చు]

మాధవరెడ్డికి 1954లో లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు.

రాజకీయ జీవితం[మార్చు]

ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి (సోషలిష్టు పార్టీ తరపున) ఎన్నికైన మొదటి (1952-1957) పార్లమెంట్ సభ్యుడు మాధవరెడ్డి. 1962లో కాంగ్రెస్ పార్టీ తరపున బోథ్ శాసనసభ నియోజకవర్గం పోటిచేసి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి రాజా రెడ్డిపై 5,754 ఓట్ల మెజారిటీతో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కూడా గెలుపొందాడు. 1984 నుండి 1989 వరకు తెలుగుదేశం పార్టీ తరపున 8వ లోక్‌సభకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు.[6][7][8][9]

తన రాజకీయ జీవితంలో, మాధవరెడ్డి అనేక రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నాడు. సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలలో సభ్యుడిగా ఉన్నాడు.[10]

క్రమసంఖ్య నుండి వరకు స్థానం వ్యాఖ్యలు
01 1952 1957 సభ్యుడు, 1వ లోక్ సభ సోషలిస్టు పార్టీ సభ్యుడిగా
02 1962 1967 సభ్యుడు, 3వ అసెంబ్లీ
03 1984 1989 సభ్యుడు, 8వ లోక్‌సభ టీడీపీ సభ్యుడిగా

పదవులు[మార్చు]

  • 1952-57లో 1వ లోకసభకు, 1984-89లో 8వ లోకసభకు ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.[11]
  • సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ (1962-67)
  • చైర్మన్, రాష్ట్ర ప్రజా సోషలిస్టు పార్టీ (1952-56)
  • చైర్మన్, APSSIDC లిమిటెడ్ (1968-73)
  • డైరెక్టర్, NSIC, న్యూఢిల్లీ (1970-72)
  • చైర్మన్, ప్రభుత్వ, జాయింట్ వెంచర్ కంపెనీలు

రచనలు[మార్చు]

  • హైదరాబాద్ లో స్వాతంత్ర్య పోరాటం (ఉర్ధూ రచన)

ఇతర వివరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Member Profile". Lok Sabha website. Archived from the original on 11 October 2016. Retrieved 17 January 2014.
  2. "Election Results 1951" (PDF). Election Commission of India. Retrieved 17 January 2014.
  3. "Election Results 1984" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 17 January 2014.
  4. "లోకసభ జాలగూడు". Archived from the original on 2016-10-11. Retrieved 2014-01-26.
  5. "Member Profile". Lok Sabha website. Archived from the original on 11 October 2016. Retrieved 17 January 2014.
  6. "Member Profile". Lok Sabha website. Archived from the original on 11 October 2016. Retrieved 17 January 2014.
  7. "Election Results 1951" (PDF). Election Commission of India. Retrieved 17 January 2014.
  8. "Election Results 1984" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 17 January 2014.
  9. "Third Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 7 December 2013. Retrieved 17 January 2014.
  10. "Member Profile". Lok Sabha website. Archived from the original on 11 October 2016. Retrieved 17 January 2014.
  11. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.