భీమారం మండలం (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమారం
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, భీమారం స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, భీమారం స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, భీమారం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం మంచిర్యాల
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 504204


భీమారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా,భీమారం మండలానికి చెందిన గ్రామం.[1] ఇది పాత మండల కేంద్రమైన జైపూర్ నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంచిర్యాల నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

ఇంతకుముందు భీమారం  గ్రామం అదిలాబాదు జిల్లా మంచిర్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని జైపూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా భీమారం గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా,అదే రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+11 (పన్నెండు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 159 చ.కి.మీ. కాగా, జనాభా 15,493. జనాభాలో పురుషులు 7,749 కాగా, స్త్రీల సంఖ్య 7,744. మండలంలో 4,152 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. రెడ్డిపల్లి
  2. దాంపూర్
  3. బూరుగుపల్లి
  4. పోతన్‌పల్లి
  5. భీమారం
  6. అంకుశాపూర్
  7. పోలంపల్లి
  8. ఆరేపల్లి
  9. మద్దికల్
  10. కొత్తపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. "Reorganisation of Adilabad District into Mancheriyal District" (PDF). Archived from the original (PDF) on 2017-11-07. Retrieved 2019-02-03.
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-27.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]