Jump to content

నస్పూర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°51′32″N 79°29′04″E / 18.858790°N 79.484470°E / 18.858790; 79.484470
వికీపీడియా నుండి
నస్పూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°51′32″N 79°29′04″E / 18.858790°N 79.484470°E / 18.858790; 79.484470
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం నస్పూర్ (మంచిర్యాల)
గ్రామాలు 5
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 504302


నస్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1] మండలం కోడ్:04354.[2] నస్పూర్ మండలం, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[3] దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  5  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు

[మార్చు]

గతంలో నస్పూర్ గ్రామం ఆదిలాబాదు జిల్లా, మంచిర్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని,మంచిర్యాల మండలంలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నస్పూర్ మండలాన్ని కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా, తిరిగి అదే మంచిర్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని, మంచిర్యాల మండలంనుండి 5 గ్రామాలను విడగొట్టి, నస్పూర్ గ్రామాన్ని కొత్త మండల కేంద్రంగా ప్రకటించి, ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 53 చ.కి.మీ. కాగా, జనాభా 76,641. జనాభాలో పురుషులు 39,788 కాగా, స్త్రీల సంఖ్య 36,853. మండలంలో 18,592 గృహాలున్నాయి.[5]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నస్పూర్
  2. సింగాపూర్
  3. తీగలపహాడ్
  4. తాళ్ళపల్లి
  5. సీతరామపల్లి

సమీప పట్టణాలు

[మార్చు]

ప్రయాణ సౌకర్యం

[మార్చు]

నస్పూర్ మండలానికి సమీపంలో మంచిర్యాల,పెద్దంపేట రైల్వే స్టేషన్లు ఉన్నాయి.నస్పూర్ నుండి మంచిర్యాల పట్టణానికి రహదారి అనుసంధానించబడింది

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 http://183.82.4.93:81/dtcp/wp-content/uploads/2017/01/MANCHERIAL_FINAL.pdf[permanent dead link]
  2. "Naspur (CT) Village in Mancherial Mandal, Adilabad, Andhra Pradesh | Google map @VList.in". vlist.in. Archived from the original on 2016-10-17. Retrieved 2020-06-25.
  3. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]