Jump to content

తాళ్ళపల్లి (నస్పూర్)

అక్షాంశ రేఖాంశాలు: 18°06′57″N 78°34′12″E / 18.11583°N 78.57000°E / 18.11583; 78.57000
వికీపీడియా నుండి
తాళ్ళపల్లి
తాళ్ళపల్లి is located in Telangana
తాళ్ళపల్లి
తాళ్ళపల్లి
తెలంగాణలో ప్రాంతం ఉనికి
తాళ్ళపల్లి is located in India
తాళ్ళపల్లి
తాళ్ళపల్లి
తాళ్ళపల్లి (India)
Coordinates: 18°06′57″N 78°34′12″E / 18.11583°N 78.57000°E / 18.11583; 78.57000
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల జిల్లా
విస్తీర్ణం
 • Total12.08 కి.మీ2 (4.66 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total9,656
 • జనసాంద్రత800/కి.మీ2 (2,100/చ. మై.)
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
504302
Vehicle registrationటిఎస్

తాళ్ళపల్లి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం. ఈ పట్టణం నస్పూర్ పురపాలక సంఘంలో భాగంగా ఉంది.[1] జిల్లా కేంద్రమైన మంచిర్యాల నుండి 7 కి.మీ.ల దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు.[2]

భౌగోళికం

[మార్చు]

తాళ్ళపల్లి పట్టణం 18°06′57″N 78°34′12″E / 18.11583°N 78.57000°E / 18.11583; 78.57000 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఈ పట్టణ విస్తీర్ణం 12.08 కి.మీ2 (4.66 చ. మై) గా ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

సింగాపూర్, నస్పూర్, శ్రీరాంపూర్, రామారావుపేట మొదలైనవి తాళ్ళపల్లికి సమీపంలో ఉన్నాయి.[3]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] తాళ్ళపల్లి పట్టణంలో 10,937 జనాభా ఉంది. ఈ మొత్తం జనాభాలో పురుషులు 52% మంది కాగా, స్త్రీలు 48% మంది ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 56% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 63% కాగా, స్త్రీల అక్షరాస్యత 47%గా ఉంది. తాళ్ళపల్లిలోని జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • హనుమాన్ దేవాలయం
  • భీమన దేవాలయం
  • బీరప్ప దేవాలయం
  • మస్జిద్-ఇ-హబీబియా
  • మదీనా మసీదు

రవాణా

[మార్చు]

ఇక్కడికి సమీపంలోని మంచిర్యాల, రవీంద్రఖని, పెద్దంపేట్ ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాల నుండి తాళ్ళపల్లికి రోడ్డు కనెక్టివిటీ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Thallapally Village , Mancherial Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2021-10-27.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు

[మార్చు]