Jump to content

మంచిర్యాల రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
మంచిర్యాల రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల

మంచిర్యాల రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మంచిర్యాల జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం మంచిర్యాలలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

గణాంకాలు

[మార్చు]

ఈ డివిజన్ పరిధిలో మొత్తం 6,58,101 జనాభా ఉంది.

పరిపాలన

[మార్చు]

మంచిర్యాల డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం మంచిర్యాల రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 లక్సెట్టిపేట మండలం 21 రెవెన్యూ గ్రామాలు
2 మంచిర్యాల మండలం 2 రెవెన్యూ గ్రామాలు
3 నస్పూర్ మండలం 5 రెవెన్యూ గ్రామాలు
4 హాజీపూర్ మండలం 21 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
5 దండేపల్లి మండలం 30 రెవెన్యూ గ్రామాలు
6 జన్నారం మండలం 26 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)

గమనిక:గతంలో ఈ రెవెన్యూ డివిజనులో 11 మండలాలు ఉండేవి. చెన్నూరు, జైపూర్‌, భీమారం, కొత్తపల్లి, మందమర్రి మండలాలను ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన చెన్నూరు రెవెన్యూ డివిజనులో విలీనమయ్యాయి.[5][6]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 27 January 2022.
  3. "REVENUE DIVISION | Mancherial District | India". www.mancherial.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-28. Retrieved 2022-02-22.
  4. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-02-22.
  5. Today, Telangana (2023-10-04). "Chennur is new revenue division". Telangana Today. Retrieved 2023-12-31.
  6. "Chennur Revenue Division | రెవెన్యూ డివిజన్‌గా చెన్నూరు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం-Namasthe Telangana". web.archive.org. 2023-12-31. Archived from the original on 2023-12-31. Retrieved 2023-12-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)