కె.ఆశన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందుల ఆశన్న

నియోజకవర్గము ఆదిలాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1923-05-11) 1923 మే 11 (వయస్సు: 96  సంవత్సరాలు)
ఆదిలాబాదు, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి లక్ష్మిబాయి
సంతానము ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు
మతం హిందూ

కందుల ఆశన్న గారు భారత జాతీయ కాంగ్రెసు తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1957లో ఎన్నికయ్యారు. ఈయన ఆదిలాబాదులో 1923 మే 11న జన్మించారు. ఈయన తండ్రి పేరు నర్సింహులు.[1]

చదువు[మార్చు]

మాధ్యమిక విద్య అన్వరులు-లూమ్ పాఠశాలలో, కళాశాల విద్యను చాదర్ ఘాట్ కళాశాలలో చదివారు. 1954 (హైదరాబాదు) లో ప్లీడర్ షిప్ డిప్లమా చేశారు

వివాహం[మార్చు]

11, మే 1946 లక్ష్మిబాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు.

ఇతరములు[మార్చు]

గ్రామీణ అభివృద్ధి, గిరిజన సంక్షేమ మరియు వెనుకబడిన తరగతులకు అభివృద్ధి పరచటం,

పదవులు[మార్చు]

 • 1957లో 2వ లోకసభకు ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.
 • సంయుక్త కార్యదర్శి, హైదరాబాదు రెడ్డి హాస్టల్ (1944)
 • ఉపాధ్యక్షులు, చాదర్ ఘాట్ కాలేజ్ సంఘం (1944)
 • ప్రతినిధి, హైదరాబాదు లోని అన్ని విద్యార్థుల సంఘం (1945)
 • కార్యదర్శి, తాలూకా కాంగ్రెస్ కమిటీ, ఆదిలాబాద్ (1948)
 • ప్రతినిధి, హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ (1949)
 • సభ్యులు, జిల్లా ఆహార మండలి (1951)
 • సభ్యులు, వ్యవసాయ క్రయ విక్రయాల సంఘం (1950-53)
 • కార్యదర్శి, భారత సమావేశ సోషల్ వర్క్ (1950-51 )
 • సభ్యులు, హైదరాబాదు కేంద్రీయ పంపిణి సంస్థ (1952-53)
 • సభ్యులు, తాలూకా కౌలు సంఘం (1952-54)
 • సభ్యులు, భారత జాతీయ కాంగ్రెస్, 58 వ సమావేశాలు ఆదరణ కమిటీ ననల్ నగర్, హైదరాబాదు (1953)
 • ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఆదిలాబాద్
 • ఉపాధ్యక్షులు, జిల్లా సంఘం, ఆదిలాబాద్
 • సభ్యులు, జిల్లా ప్రణాళిక మరియు అభివృద్ధి సంఘం, ఆదిలాబాద్
 • సంయుక్త కార్యదర్శి, ఆదిలాబాద్ బార్ అసోసియేషన్

ఓట్ల వివరాలు[మార్చు]

ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు పోలైన ఓట్లు - 4,28,092,

 1. కె.ఆశన్న (భారత జాతీయ కాంగ్రెసు) 91,287
 2. సి.మాధవరెడ్డి 85,375

వనరులు[మార్చు]

 1. లోకసభ జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=కె.ఆశన్న&oldid=2687497" నుండి వెలికితీశారు