పొద్దుటూరి గంగారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొద్దుటూరి గంగారెడ్డి
పొద్దుటూరి గంగారెడ్డి


పార్లమెంట్ సభ్యుడు, 5వ లోక్‌సభ
పదవీ కాలం
మార్చి 1971 – జనవరి 1977
ముందు పొద్దుటూరి గంగారెడ్డి
తరువాత గడ్డం నర్సింహారెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాదు

పార్లమెంట్ సభ్యుడు, 4వ లోక్‌సభ
పదవీ కాలం
మార్చి 1967 – డిసెంబరు 1970
ముందు జి. నారాయణరెడ్డి
తరువాత పొద్దుటూరి గంగారెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1933-06-07)1933 జూన్ 7
తోరత్, నిజామాబాదు, (తెలంగాణ)
మరణం 2008 జనవరి 3(2008-01-03) (వయసు 74)
జాతీయత  India
రాజకీయ పార్టీ కాంగ్రేసు
తల్లిదండ్రులు పొద్దుటూరి రాజారెడ్డి (తండ్రి)
జీవిత భాగస్వామి సుశీలాదేవి
సంతానం ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
నివాసం ఆదిలాబాదు & కొత్త ఢిల్లీ
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తి వ్యవసాయం & రాజకీయ నాయకుడు

పొద్దుటూరి గంగారెడ్డి ( 1933 జూన్ 7 - 2008 జనవరి 03) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున[1][2][3] ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగవ, ఐదవ లోక్‌సభల్లో ప్రాతినిధ్యం వహించాడు.[4]

జననం, విద్య

[మార్చు]

గంగారెడ్డి 1933, జూన్ 7న రాజారెడ్డి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, తోరత్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ, ఎల్.ఎల్.బి. చదివాడు. కొంతకాలం వ్యవసాయదారుడిగా పనిచేశాడు.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గంగారెడ్డికి సుశీలాదేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

రాజకీయ జీవితం

[మార్చు]

గంగారెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు (1967-1970, 1971-1977) ఎంపీగా గెలుపొందాడు. ఆదిలాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశాడు.[5][6][7]

క్రమసంఖ్య ప్రారంభం వరకు స్థానం మెజారిటీ
01 1967 1970 సభ్యుడు, 04వ లోక్‌సభ
02 1971 1977 సభ్యుడు, 05వ లోక్‌సభ 14,950

మరణం

[మార్చు]

గంగారెడ్డి 2008, జనవరి 3న మరణించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Member Profile". www.loksabhaph.nic.in. Lok Sabha website. Archived from the original on 2014-02-02. Retrieved 1 January 2014.
  2. "Election Results 1967" (PDF). Election Commission of India. Retrieved 1 January 2014.
  3. "Election Results 1971" (PDF). Election Commission of India. Retrieved 1 January 2014.
  4. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.
  5. 5.0 5.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 2 February 2014. Retrieved 21 January 2014.
  6. "Election Results 1967" (PDF). Election Commission of India. Retrieved 21 January 2014.
  7. "Election Results 1971" (PDF). Election Commission of India. Retrieved 21 January 2014.
  8. "Former Nizamabad MP Keshpally Gangareddy passes away". Archived from the original on 2017-04-12. Retrieved 2021-11-21.