ఆత్రం సుగుణ
| ఆత్రం సుగుణ | |||
కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ అభ్యర్తి | |||
| నియోజకవర్గం | ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1975 ఆగష్టు 16 పుల్లార, సిర్పూర్ (యు) మండలం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ. | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (INC) | ||
| తల్లిదండ్రులు | కనక రాజు,బుదుబాయి | ||
| జీవిత భాగస్వామి | ఆత్రం భుజంగ్ రావు | ||
| సంతానం | డా.ఆత్రం విప్లవ్,ఆత్రం సాయుధ్ | ||
| నివాసం | ఫకీర్ గుట్ట, ఉట్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ, ఇండియా | ||
ఆత్రం సుగుణ తెలంగాణ రాష్ట్రనికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఆత్రం సుగుణ నియమితులయ్యారు. [1] [2][3][4]
జననం,విద్య
[మార్చు]ఆత్రం సుగుణ 1975 ఆగస్టు 16లో తెలంగాణ రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పుల్లార అనే మారుమూల ఆదివాసి గోండు గూడలో గోండు సామాజిక వర్గానికి చెందిన కనక రాజు, బుదుబాయి దంపతులకు జన్మించింది. తన బాల్య జీవితమంత అమ్మమ్మ వాళ్ళ ఊరైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ లో గడిచింది. పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తపాల్ పూర్ ల్లో చదివి పదమూడవ ఏట అదే మండలం మురిమడుగు కొమ్ముగూడకు చెందిన ఆత్రం భుజంగరావుతో 1992లో వివాహం జరిగినది. ఆ తర్వాత భర్త ప్రోత్సహంతో ఎంఏ, బి.ఇఎడ్, పూర్తి చేసి 2008లో ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైంది.[5][6]
రాజకీయ జీవితం
[మార్చు]ఆత్రం సుగుణ రాజకీయాల మీద ఆసక్తితో రాజకీయ రంగంలో అడుగుపెట్టింది. 2008లో ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. అయితే, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తూ 2024 మార్చి 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తరువాత, ఆమె తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహిళా,శిశు సంక్షేమం, తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)[7], ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1995లో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా జన్నారం మండలంలోని మురిమడుగు ఎంపీటిసీగా గెలిచి సేవలందించింది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, ఆదివాసి మహిళ హక్కుల, పరిరక్షణ కోసం ఆ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించింది.బీడీ కార్మిక సంఘంలోను, అవ్వాల్ కమిటీలోను,ఉట్నూరు సాహితీ వేదికలో కూడా చురుకైన పాత్ర పోషించింది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షురాలిగా, తెలంగాణ యునైటెడ్ ప్రంట్ జిల్లా చైర్మన్ గా, టీపిటీఎఫ్ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలిగా మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా వ్యవహరించింది. సామాజిక కార్యకర్తగా అనేక ప్రజా ఉద్యమాలలో క్రియశీలక పాత్ర పోషించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్తిగా పోటీ చేసే తొలి ఆదివాసీ మహిళగా నిలిచింది.[8][9][10] [11]
2024 జూన్ 4న భారత సార్వత్రిక ఎన్నికల్ల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ చేతిలో అత్రం సుగుణ 4,77,516 ఓట్లు సాధించినా ఓటమి పాలైంది. ఆమె 2025 జూన్ 9న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది.[12][13]
ఆత్రం సుగుణ 2025 నవంబర్ 22న ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితురాలైంది.[14][15]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (28 March 2024). "కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ." the original నుండి 26 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 April 2024.
- ↑ Desk 22, Disha Web (2024-03-21). "కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆత్రం సుగుణ". www.dishadaily.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-06.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sridhar, P. (2024-03-28). "Adivasi rights activist hand-picked by Congress for Adilabad LS seat". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-07.
- ↑ India, The Hans. "Congress to rope in tribal teacher for Adilabad LS seat". The Hans India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-07.
- ↑ Chary, Maheshwaram Mahendra. "Adilabad Congress MP Candidate : నిన్నటి టీచర్, ఇవాళ ఎంపీ అభ్యర్థి - 'ఆత్రం సుగుణ' గురించి ఆసక్తికరమైన విషయాలివే". Hindustantimes Telugu. the original నుండి 2024-04-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-06.
- ↑ "కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ." EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-06.
- ↑ "TS: మంత్రి సీతక్కని కలిసిన ఆత్రం సుగుణ." Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-20. the original నుండి 2024-04-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-27.
- ↑ "TS: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన [[ఆదిలాబాద్]] [[కాంగ్రెస్]] అభ్యర్థి ఆత్రం సుగుణ". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-29. the original నుండి 2024-04-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-06.
{{cite web}}: URL–wikilink conflict (help) - ↑ Velugu, V6 (2024-04-03). "ఆడ బిడ్డగా ముందుకొచ్చా.. ఆదరించండి : అత్రం సుగుణ". V6 Velugu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-06.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Today, Telangana (2024-03-28). "Lok Sabha polls: Clash of teachers in Adilabad". Telangana Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-07.
- ↑ Chary, Maheshwaram Mahendra. "Adilabad Congress MP Candidate : నిన్నటి టీచర్, ఇవాళ ఎంపీ అభ్యర్థి - 'ఆత్రం సుగుణ' గురించి ఆసక్తికరమైన విషయాలివే". Hindustantimes Telugu. the original నుండి 2024-04-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-07.
- ↑ "27 మంది ఉపాధ్యక్షులు.. 69 మంది ప్రధాన కార్యదర్శులు". Eenadu. 10 June 2025. the original నుండి 10 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 June 2025.
- ↑ "పీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయం". Andhrajyothy. 10 June 2025. the original నుండి 10 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 June 2025.
- ↑ "తెలంగాణలోని అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం". Eenadu. 22 November 2025. the original నుండి 22 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2025.
- ↑ "తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీళ్లే." Andhrajyothy. 22 November 2025. the original నుండి 22 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2025.