ఉట్నూరు సాహితీ వేదిక
ఉట్నూరు సాహితీ వేదిక (ఉసావే). | |
స్థాపన | 2013 |
---|---|
వ్యవస్థాపకులు | గోపగాని రవీందర్,. డాక్టర్ మెస్రం మనోహర్ |
కేంద్రీకరణ | తెలుగు, గిరిజన సాహిత్య, సాంస్కృతిక సంస్థ |
కార్యస్థానం | |
సేవలు | నూతన కవులను ప్రోత్సాహించడం, పుస్తకాలు ముద్రించడం, |
అధికారిక భాష | తెలుగు,గోండి,లంబాడీ, కొలామి, మరాఠీ, languages = --> |
ముఖ్యమైన వ్యక్తులు | ● రాథోడ్ భీంరావ్,
●కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ●ముంజం జ్ఞానేశ్వర్, ● మర్సుకొల తిరుపతి,. ●మర్సుకొల సరస్వతి,. ●కట్టా లక్ష్మణాచారి,. ● రచయిత శ్రావణ్ రాథోడ్,. ● కొండగుర్ల లక్ష్మయ్య,. ● డా.ఇందల్ సింగ్ బంజారా,. ● తొడసం నాగోరావు, ● మురళీ జాదవ్(భట్టు శ్రీ), ● కుమ్ర లాల్ షావ్ ● గంగా సాగర్ |
ఉట్నూరు సాహితీ వేదిక, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక సాహితీ సంస్థ.[1] [2] [3]
తెలంగాణ రాష్ట్రం,ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలంలో 2013 సంవత్సరంలో ఆదివాసీ, గిరిజన సాహిత్యాన్ని, ఆదిలాబాద్ జిల్లాలో మనుగడ సాగిస్తున్న తెగల అస్థిత్వాన్ని, ప్రాంత విశిష్టతలను,గ్రంథస్తం చేస్తూ,సాహితీ సృజన కల్గిన యువతను ప్రోత్సాహించేందుకు ఏర్పాటైన సాహితీ సంస్థ ఉట్నూరు సాహితీ వేదిక.[4][5][6][7] [8]
స్థాపన
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు కేంద్రంగా సాహితీ కార్యక్రమాలు నిర్వహించడానికి, ప్రాంతం విశేషాలను జనబాహుళ్యం చేయడానికి, నూతన కవులు,కళాకారుల ప్రతిభను ప్రోత్సాహించడానికి ఉట్నూరు మండల కేంద్రంలో కుంరం భీం ప్రాంగణంలో పిటిఆర్సిలో ఉట్నూరు సాహితీ వేదిక (ఉసావే) 8 ఆగస్టు 2013 , గోపగాని రవీందర్, డా.మెస్రం మనోహర్ స్థాపించారు.[9][10]
అధ్యక్షులు వారి వివరాలు
[మార్చు]1. గోపగాని రవీందర్ (2013 -2015)[11]
2. కట్టా లక్ష్మణా చారి (2015-2016 )
3.రాథోడ్ శ్రావణ్ (2017-2018)[12]
4.కొండగుర్ల లక్ష్మయ్య (2018-2022)
5.కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ (2022-...)[13]
కవుల బిరుదులు
[మార్చు]1. కవన కోకిల - జాదవ్ బంకట్ లాల్[14] [15]
2. గురు భక్త కవి -తొడసం నాగోరావ్
3. కవన కోకిల - ఆత్రం మోతీరామ్[16] [17] [18][19][20]
4.సాహిత్య ప్రావీణ్య - రాథోడ్ శ్రావణ్ [21]
కవుల కలం పేర్లు
[మార్చు]1. భట్టుశ్రీ -జాదవ్ మురళీ
2.సేవాశ్రీ - జాదవ్ బంకట్ లాల్
3.మధుర వాణి - కార్కురి మధుకర్
4.గోర్ నాయక్ - రాథోడ్ శ్రావణ్
ప్రముఖులు
[మార్చు]- రాథోడ్ భీంరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి గా విధులు నిర్వహిస్తూ, ఉట్నూర్ సాహితీ వేదిక సంస్థ కు గౌరవ అధ్యక్షుడు గా సాహితీ సేవా చేస్తూ కవులు , కళాకారులకు ప్రోత్సాహకమిస్తూ , సామాజిక సేవా చేస్తున్న గిరిజన అధికారి. [22]
● జననం, విద్య:
నిర్మల్ జిల్లా , సారంగా పూర్ మండలం, పోటియా రాంసింగ్ నాయక్ తాండాలో రాథోడ్ మంగ్యా నాయక్, సామ్నీ బాయి అను లంబాడీ గిరిజన దంపతులకు రాథోడ్ భీంరావు తేది:23.జూన్.1962 జన్మించాడు. దంపతులు వ్యవసాయ కుటుంబ జీవనంతో గ్రామం బొర్ గావ్ , నేరడి గొండ మండలంలో స్థిరపడ్డారు.
ప్రాథమిక విద్యను బొర్ గావ్ వద్ద అభ్యసిస్తూ వ్యవసాయ పనులు చేస్తూ ఇచ్చోడ మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నాలుగువ, ఐదవ తరగతి పూర్తి చేసి తర్వాత నిర్మల్ లోని కస్బ ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివి ఉన్నత చదవుల కోసం పదవ తరగతి ప్రవేశ పరీక్ష రాసి పాసై , నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో నిజామాబాద్ ప్రభుత్వ పాల్ టేక్నిక్ కళాశాల అడ్మిషన్ రావడంతో ఆ కళాశాలలో డిప్లొమా (ఎల్.సి.ఇ) 1983 సంవత్సరంలో పూర్తి చేసిన,తదుపరి ఐటిడిఎ లో ఇంజనీరింగ్ విభాగంలో 1985 సంవత్సరంలో ఆస్టిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరారు. 1996 సంవత్సరంలో ఎ.ఇ పదోన్నతి పొందారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలల్లో గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చారు. తర్వాత 2009 సంవత్సరంలో ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ పదోన్నతి పొందారు. ఇచ్చోడ సబ్ డివిజన్ లో 2011 పని చేసి బదిలీ పై వరంగల్ పర్యవేక్షక ఇంజనీర్ విభాగంలో పనిచేస్తూ ఎటునాగరంలో గిరిజన సంక్షేమ శాఖ విభాగంలో ఈ. ఈ గా బాధ్యతలు చేపట్టారు. తిరిగి ఇచ్చోడ డి.ఇ గా బదిలీయై విధులు నిర్వహించారు. ప్రస్తుతం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలో 2010 నుంచి ఇ. ఇ . గా విధులు నిర్వహిస్తున్నారు.
● విధులు
- ప్రస్తుతం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా 10.7.2020 నుండి బాధ్యతలు స్వీకరించారు.
● పురస్కారం:
- ఉసావే సాహితీ సేవా స్పూర్తి పురస్కారం-2022
● సామాజిక బాధ్యతలు:
1.టి డబ్ల్యు ఇ ఎ రాష్ట్ర అధ్యక్షులు విధులు నిర్వహిస్తున్నారు.
2. ఎఐబియస్ యస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విధులు నిర్వహిస్తున్నారు
3.లయన్స్ క్లబ్ ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడు విధులు కొనసాగుతున్నారు
4.ఉట్నూరు సాహితీ వేదిక శాశ్వత గౌరవ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
5.గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గా నిర్వహించారు.
2.కట్టా లక్ష్మణాచారి
కట్టా లక్ష్మణాచారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కీ.శే కట్టా రుక్కయ్య, కట్టా అమృతమ్మ దంపతులకు 1962 ఎప్రిల్ 12న జన్మించారు. ఉద్యోగ రిత్యా ఉట్నూరు లో స్థిరపడ్డి సాహితీ సేవలో నిమగ్నమై నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
•విద్యాభ్యాసం:-
ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య తన సొంత గ్రామం దండేపల్లిలో అభ్యసించి, మాధ్యమిక విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల లక్షేటిపేటలో పూర్తి చేసారు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఆదిలాబాదు యందు 1982లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తు,1993లో దూర విద్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి ఎమ్. ఏ రాజనీతి శాస్త్రం,2002లో కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ నుండి ఎమ్. ఏ తెలుగు,1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి బి.ఎడ్ పూర్తి చేశారు.ఆ తర్వాత 1997లో తమిళనాడు రాష్ట్రంలోని మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎడ్ చదివి 2004లో అదే అన్నామలై విశ్వవిద్యాలయం మద్రాసు నుంచి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎమ్.ఎస్సీ చదివిన ఉన్నత విద్యావంతుడు.
•ఉద్యోగం :-
తన జీవితంలో ముఫ్ఫై ఆరు సంవత్సరాలు ఆయన విద్యార్థులని తీర్చిదిద్దడానికే అంకితం చేశాడు. విద్యా బోధనలో ఆయన చేసిన కృషికి ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం వచ్చాయి. తన తొలి ఉద్యోగ జీవితాన్ని 1983 లో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉట్నూరు నుండే ప్రారంభించి, ఉట్నూరు లోనే 30 ఎప్రిల్ 2020లో పదవీ విరమణ పొందారు. దాదాపు 36 సంవత్సరాలు 10 నెలలు 6 రోజులు పని చేసి ఎంతో మంది విద్యార్థులకు భావిభారత పౌరులుగా తీర్చి దిద్దారు. ఉట్నూరు జిల్లా పరిషత్తు పాఠశాలతో పాటు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉట్నూరు, ప్రాథమికోన్నత పాఠశాల లక్కారాం, ప్రాథమికోన్నత పాఠశాల ఉట్నూరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్నూరు మండలంలోని భీంపూరు చివరికి తను తొలి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉట్నూరులో సాంఘిక శాస్త్ర సహా ఉపాధ్యాయుడుగా పదవీ విరమణ పొందందాడు.
•కుటుంబ నేపధ్యం :-
కవి, రచయిత, రిటైర్డ్ ఉపాధ్యాయుడు కట్టా లక్ష్మణాచారిది నిరుపేద రైతు కుటుంబం.వీరికి అన్నదమ్ములు, ఇద్దరుచెల్లెళ్ళు తల్లితండ్రులకు మూడు ఎకరాల పొలం ఉండేది. అమ్మనాన్న పొలం పనులు, కులవృత్తులు చేస్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో కష్టపడి కొడుకులను చదివించారు.నా కొడుకులు ఒక మంచి స్థాయిలో ఉండాలనే తపన ఉండేది. చిన్ననాటి నుండి చదువులో రాణిస్తూ తెలుగు భాషలో మంచి పాండిత్యాన్ని సంపాదించి గొప్ప కవిగా రచయితగా పేరు తెచ్చుకున్నారు. కట్టా లక్ష్మణా చారి విజయ దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కుమారుడు కట్టా సాయి చంద్ర సాప్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగ రీత్యా హైదరాబాదులో విధులు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు కూతుళ్ళుఅల్లుళ్ళు, బిజ్జారపు అర్చన చంద్రప్రకాష్,గిన్నెల అనుష కృష్ణ కూమార్,బెజ్జంకి స్వాతి-ప్రణీత్ కుమార్ మొదలగు వీరి కుటుంబం.
•సేవ కార్యక్రమాలు :-
సమాజ పురోగతే మానవ ప్రగతి అనే నినాదంతో సమాజ సేవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తాను పుట్టిన కులానికి సేవచేయాలనే ఉద్దేశంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో కుల సంఘంలో సేవలు అందించారు. గతంలో ఉట్నూరు బ్రహ్మంగారి మందిరం అధ్యక్షుడిగా ప్రస్తుతం సలహాదారుగా కొనసాగుతున్నారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండే కట్టా లక్ష్మణా చారి ఉపాధ్యాయ సంఘమైన టి ఆర్ టియు సంఘానికి 2016-2017 లో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించి ఖాళీ సమయంలో సంఘం కోసం పని చేసేవాడు.ప్రస్తుతం పదవి విరమణ పొందిన తర్వాత కూడా పిఆర్ టియు సంఘానికి జిల్లా గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
•సాహితీ సేవా :- 1988లో ఉట్నూరు పట్టణ ప్రాంతాల్లో చందనగిరి దేవయ్య గారు స్థాపించిన చందనగిరి సాహితీ సంస్థలో కార్యదర్శిగా పని చేస్తు, కవి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించే వారు.కొన్ని వసంతాల తరువాత 2013లో ఉట్నూరు పట్టణంలో ఉట్నూరు సాహితీ వేదికను స్థాపించినప్పుడు వ్వవస్తాపక కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తు 2015-2016లో ఉట్నూరు సాహితీ వేదికకు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సాహిత్యం పై మక్కువ చూపుతు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో జరిగే అనేక కవి సమ్మేళనం సాహితీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019 డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించినాడు. 2020 జూన్ 28న తాను రచించిన కాలజ్ఞాన కైతికాలు పుస్తకావిష్కరణ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ గారి చేతుల మీదుగా స్థానిక మండల సమావేశమందిరంలో జరిగింది.
•పురస్కారాలు :-
2014 సెప్టెంబర్ 14న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయు పురస్కారం జిల్లా పాలనాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. 2019 అక్టోబర్ 10న భారత కల్చరల్ అకాడమీ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో విశిష్ట కవిరత్న పురస్కారాన్ని ఆసిఫాబాద్ శాసన సభ్యులు ఆత్రం సక్కు కుంరం భీం లఘు చిత్రం డైరెక్టర్ సురేష్ బాబు గార్ల చేతుల మీదుగా అందుకున్నారు. 2020 జనవరి 23 న గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం లభించింది.2020 ఫిబ్రవరి 08 న గ్రీన్ ఇండియా సోసైటి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రొఫెసర్ సి.రాంరెడ్డి దూర విద్యా ఆడిటోరియం తార్నాక హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ బి.జ్యోతి రెడ్డి గారి చేతుల మీదు గా రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచింగ్ ఇనిస్పిరేషన్ అవార్డు ప్రదానం చేశారు.2020 ఫిబ్రవరి 16న మంచిర్యాల జిల్లా రచయితల సంఘం మరియు జాతీయ బహు భాషా కవి సమ్మేళనం కార్యక్రమంలో కళాత్మ బిరుదు తో పాటు భాష శ్రీ పురస్కారను అధ్యక్షులు బొడ్డు మహేందర్ చేతులు మీదుగా అందుకున్నారు. 2020 ఎప్రిల్ 11న జ్ఞాన సరస్వతీ దేవి జాతీయ సేవా పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా అచ్చలనంద ఆశ్రమ తోటపల్లి మఠంలో జ్ఞాన సరస్వతీ దేవి చారటిబుల్ ట్రస్ట్ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు.2020 జూలై 07 లో భువన సాహిత్య వేదిక హుజురాబాద్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కైతిక కవి మిత్ర పురస్కారం అధ్యక్షులు గోష్కుల రమేశ్ చేతుల మీదుగా అందుకున్నారు.2020 అక్టోబర్ 20న వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తాను రచించిన పుస్తకం కాలజ్ఞాన కైతికాలుకు చోటు లభించింది.2021 ఎప్రిల్ 3న 75వ అజాదీకా అమృత మహోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐఎఎస్ అధికారిణి చేతుల మీదుగా ఉత్తమ కవి పురస్కారం లభించింది.2022 ఆగష్టు 21 న జిల్లా ఫిల్మ్ భవన కరీంనగర్ లో జిల్లా సంయుక్త పాలన అధికారితో సన్మానం అందుకున్నారు.2022 సెప్టెంబర్ 18 న విశ్వకర్మ సేవా ఫౌండేషన్ హైదరాబాద్ తెలంగాణ వారు వరంగల్ వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా విశ్వకర్మ జాతీయ పురస్కారంతో సత్కరించింది గౌరవించారు.
ప్రచురించిన పుస్తకాలు
[మార్చు]1. చెరగని సంతకం - గోపగాని రవీందర్
2. జ్ఞానేశ్వరా!శతకం - ముంజం జ్ఞానేశ్వర్
3.దండారి కైతికాలు- ఆత్రం మోతీరామ్[23] [24][25][26] [27][28]
4.వనాంజలి-జాదవ్ బంకట్ లాల్
5. సద్గుణ శతకం -తొడసం నాగోరావు[29]
6.మధురవాణి(కైతికాలు)-మురళీ జాదవ్(భట్టు శ్రీ)[30]
7.దేశభక్తి కైతికాలు- రచయిత-రాథోడ్ శ్రావణ్[31]
8. జీవనయానం- డా.జాదవ్ ఇందల్ సింగ్
9.తొలి మెట్టు - కార్కురి మధుకర్
10.జ్ఞాన భోద-కైతిక సుధ- గాలి రోహిత్[32] [33]
11.కథాంతరంగం- గోపగాని రవీందర్
12.జీవన సాక్ష్యాత్కృతి (కైతికాలు) - ఎస్.ప్రశాంత్ కుమార్[34] [35]
13. కాల జ్ఞాన కైతికాలు - కట్టా లక్ష్మణాచారి
14. బతుకు చిత్రం - కొండగుర్ల లక్ష్మయ్య
15.మోతిరాము శతకం - ఆత్రం మోతీరామ్[36] [37][38]
16.విరోంకి వీరతా - డా.ఇందల్ సింగ్ బంజరా
17.పండుగలు ముత్యాలహారాలు (ముత్యాల హారం ప్రక్రియ) - రచయిత శ్రావణ్ రాథోడ్
కవితా సంకలనాలు
[మార్చు]1.ఉట్నూరు కవిత-2013
2. ఉట్నూరు సాహితీ సంచిక
3.ఉట్నూరు సాహితీ కెరటాలు
4. కవిత్వ పరిమళాలు- బాల కవితా సంకలనం[39][40][41]
5.విద్య కుసుమాలు- బాల కవితా సంకలనం
6.ఆకు పచ్చని సంతకాలు- బాల కవితా సంకలనం[42]
7.అమర వీరులకు అక్షర నివాళి-కవితాల సంకలనం
8.హరితాభివందనం- అంతర్జాల కవుల సంచిక
9.రోడ్డు భద్రత-మన భవిత -అంతర్జాల కవుల సంచిక
10.కరోన పై కవనం- కవితాల సంకలనం
11.గురుభ్యోనమః - కవితాల సంకలనం
12.హరితాహారానికి ముత్యాలహారం-(ప్రక్రియ సంకలనం),-సంపాదకులు శ్రావణ్ రాథోడ్.
13. హిందీ భాష దివోస్ - హిందీ కవితాల సంకలనం
14.బతుకమ్మ -తెలంగాణ కవుల సంకలనం[43]
15. అజాదీ కా అమృత్ మహోత్సవ్ - కవితాల సంకలనం[44]
పురస్కారాలు
[మార్చు]● ఉట్నూరు సాహితీ వేదిక, సాహితీ సంస్థ కోసం వచన,రచన, ఆర్థిక, సాహితీ సేవా కార్యక్రమాల్లో భాగమైన కవులకు, ప్రజలకు గౌరవార్థకంగా 'ఉసావే సాహితీ సేవా స్పూర్తి' పురస్కారాన్ని 2022 సంవత్సరం నుండి అందిస్తుంది.
● 'ఉసావే సాహితీ సేవా పురస్కార స్పూర్తి' గ్రహీతలు: _________________________________
1.గోపగాని రవీందర్
2.డా. మెస్రం మనోహర్
3. రాథోడ్ భీంరావ్
4.కవన కోకిల జాదవ్ బంకట్ లాల్,
5.ముంజం జ్ఞానేశ్వర్,
6. మర్సుకొల తిరుపతి,.
7.మర్సుకొల సరస్వతి,.
8.కట్టా లక్ష్మణాచారి,.
9. శ్రావణ్ రాథోడ్,.
10. కొండగుర్ల లక్ష్మయ్య,.
11.ఇందల్ సింగ్ బంజారా,.
12. తొడసం నాగోరావు,
13. మురళీ జాదవ్(భట్టు శ్రీ),
14. గంగా సాగర్,
15.పవార్ వినోద్ కుమార్
16. చౌహన్ గోవింద్ నాయక్
17.చౌహన్ పరమేశ్వర్
18. ధరమ్ సింగ్
19.ముంజం మల్లికార్జున్
20. పెందుర్ మధువ్ రావు
21.ఆత్రం మోతీరామ్[45]
22. కే. సాయి కుమార్[46]
సాహితీ ముత్యాలహర పురస్కార గ్రహీతల జాబితా
[మార్చు]● ముత్యాలహారం ప్రక్రియలో నూరు ముత్యాహారాలు రచించిన తెలుగు రాష్ట్రాల కవులకు ఉట్నూరు సాహితీ వేదిక ద్వారా 'సాహితీ ముత్యాలహర పురస్కారం' అంతర్జాలం ద్వారా అందించడం జరుగుతుంది.
1) పూజితా చార్య - విజయవాడ
2.)ఆరెకటిక నాగేశ్వరరావు - కర్నూల్
3)కుందారపు గురుమూర్తి- కడప
4.),ఉట్నూరి రాంబాబు - ఆదిలాబాద్
5.) మేకల విజయలక్ష్మి - గోదావరి ఖని
6.) ధనాశి ఉషారాణి - చిత్తూరు జిల్లా
7.)సౌదరి మోహన్ గౌడ్మ-హబూబ్ నగర్ జిల్లా
8.) షేక్ జహిదా బేగం -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
9)మీసాల సుధాకర్ గారు- జనగామ జిల్లా
10)షేక్ బడా షైదా- ఊటుకూరు గుంటూరు జిల్లా.
11) సత్యం మొండ్రేటి- హైదరాబాద్
12.) షేక్ సాజీదా బేగం- ఖమ్మం జిల్లా
13) మక్కువ అరుణకుమారి-విజయనగరం జిల్లా
14) పి ప్రసాద్- నారాయణపురం రాంబిల్లి వైజాగ్
15)అంథోల్ పుష్పలీల రేవతి - కూకట్ పల్లి హైదరాబాద్
16)టి వి ఆర్ మోహన్ రావు - భధ్రాది కొత్త గూడెం జిల్లా
17) గాజుల భారతి శ్రీనివాస్ - ఖమ్మం జిల్లా.
18) మార్గం కృష్ణమూర్తి- సంగారెడ్డి హైదరాబాద్
19) గుడిపూడి రాధికారాణి- కృష్ణా జిల్లా
20)అద్దంకి లక్ష్మీ,- ముంబై మహారాష్ట్ర
21) చైతన్యభారతి పోతుల-హైదరాబాద్.
22)తో.వే.శ్రీ రాహుల్ అంతర్వేది గూడెం- పశ్చిమగోదావరి జిల్లా
23) నిరంజనుడు -వికారాబాద్ జిల్లా
24)రావుల.చంద్రకళ -ఖానాపూర్, నిర్మల్ జిల్లా
25)గద్వాల సోమన్న ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా
26) రాథోడ్ సురేష్ దౌనేల్లితండా- నిర్మల్ జిల్లా
27) గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా
28) డా. జి. నిర్మాలాదేవి -జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
29) పసుమర్తి నాగేశ్వరరావు- కర్నూల్
30)డాక్టర్ మరుదాడు అహల్యా దేవి-హైదరాబాద్
31) విస్లావత్ సావిత్రి -జడ్పీ హెచ్ యస్ నెరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా
32) విస్లావత్ శైలజ -జడ్పీ హెచ్ యస్ నెరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా
33) నెనావత్ మౌనిక -జడ్పీ హెచ్ ఎస్ నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.
34) బి. పావని - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్
35) జక్కని గంగాధర్- ముంబై మహారాష్ట్ర
36)పాత్లావత్ పురందాస్ - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.
37)ధవళే వివేక్ - కెరమెరి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా
38)కాట్రావత్ దివ్య - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా
39) మేకల లింగమూర్తి- ఖానాపూర్ నిర్మల్ జిల్లా.
40)శనగపల్లి ఉమామహేశ్వరరావు.- తెనాలి గుంటూరు జిల్లా.
41) సభావట్ చంటి - నేరళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.
42) కుసునూరు భధ్రయ్య- బోరబండ హైదరాబాద్.
43) డాక్టర్ సూర్యదేవర రాధారాణి
44) పాత్లావత్ వినోద్- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.
45) రేణుకుంట్ల శ్రీదేవి- కురవి మహబుబాబాద్ జిల్లా
46ఈయ్యణి పార్థసారథి అయ్యంగార్ -పాయకరావుపేట అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్
47.బానోత్.చెన్నారావు- పాల్వంచ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా
48.కాటేగారు పాండురంగ విఠల-హైదరాబాద్
49. జ్యోతి వైద్య -విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్
50. జుక్కల శివ -ఇంటర్ విద్యార్థి చుండురు నల్గొండ జిల్లా.
51.దామర్ల నాగేశ్వర రావు
52. యం .రాజశేఖర్
కార్యక్రమాలు
[మార్చు]● ప్రతి నెల రెండో ఆదివారం మండల కేంద్రం పరిధిలో కవి సమ్మేళనం - కవుల జయంతుల కార్యక్రమం నిర్వహణ ఉంటుంది.[47]
● పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు
మూలాలు
[మార్చు]- ↑ ABN (2021-02-15). "సమాజ వికాసానికి సాహిత్యం దోహదపడాలి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-09.
- ↑ epaper, Eenadu. "Clip from Eenadu epaper". Eenadu Epaper (in ఇంగ్లీష్). Retrieved 2024-04-09.
- ↑ నమస్తే తెలంగాణ (2019-12-27), మహా సభలకు హాజరైన రచయితలు, retrieved 2024-04-13
- ↑ ABN (2021-08-02). "కవులు సమాజాన్ని మేల్కొల్పాలి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-09.
- ↑ "సాహితీ వనంలో వికసించిన గోపగాని 'శతారం '". telugu.asianetnews.com. Retrieved 2024-04-09.
- ↑ ఈనాడు (2021-08-19), మన్యంలో మకరందాల జల్లు, retrieved 2024-04-10
- ↑ మన తెలంగాణ (2020-06-02), ఉట్నూరు సాహితీ వేదిక కవులకు సన్మానం, retrieved 2024-04-13
- ↑ నమస్తే తెలంగాణ (2022-08-08), కవిత్వాలతో సమాజంలో మార్పు తేవాలి, retrieved 2024-04-13
- ↑ ఈనాడు (2021-04-14), ప్రపంచ తెలుగు రచయితలమహా సభలో ఉసావే కవులు, retrieved 2024-04-12
- ↑ ఆంధ్రప్రభ (2023-10-22), ఏజెన్సీ కవులకు గుర్తింపు వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు, retrieved 2024-04-29
- ↑ ఈనాడు (2024-02-21), అమ్మ మాట ...వరాల మూట, retrieved 2024-04-29
- ↑ ఈనాడు (2024-08-29), అధ్యాపకుడు బహుభాషా కోవిదుడు, retrieved 2024-08-29
- ↑ నమస్తే తెలంగాణ (2021-07-20), ఉట్నూరు కవులకు అవార్డులు, retrieved 2024-04-10
- ↑ https://archive.org/details/img-20240410-211251
- ↑ సాక్షి (2021-02-21), గిరి కవన కోకిల లు, retrieved 2024-04-12
- ↑ Enadu, సాహితీ వనంలో ఆదివాసీ సుమం, retrieved 2024-04-09
- ↑ ఈనాడు (2021-03-07), సాహితీ వనంలో గిరి యువకుడు, retrieved 2024-04-13
- ↑ Eenadu (2017-08-10), వ్యాస రచన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ, retrieved 2024-04-29
- ↑ ఈనాడు (2019-09-16), అట్టహాసంగా దండారి పుస్తకావిష్కరణ (in english-handwritten), retrieved 2024-05-09
{{citation}}
: CS1 maint: unrecognized language (link) - ↑ సాక్షి (2020-08-08), కైతిక కవి మిత్ర పురస్కారానికి మోతీరాం ఎంపిక, retrieved 2024-05-13
- ↑ Enadu (2021-08-14), అట్టహాసంగా దేశ భక్తి [[కైతికాలు]] పుస్తకావిష్కరణ, retrieved 2024-04-10
{{citation}}
: URL–wikilink conflict (help) - ↑ telugu, NT News (2022-11-22). "గిరి గ్రామాలకు రహదారి". www.ntnews.com. Retrieved 2024-05-24.
- ↑ సాక్షి (2023-05-19), అడవి రాసిన కవిత్వం, retrieved 2024-04-10
- ↑ Eenadu (2023-05-07), కొలాం కలం వీరుడు మోతీరామ్, retrieved 2024-04-10
- ↑ ఈనాడు (2023-04-14), యువ చైతన్యం, retrieved 2024-04-29
- ↑ ఈనాడు (2019-09-16), అట్టహాసంగా దండారి పుస్తకావిష్కరణ (in english-handwritten), retrieved 2024-05-09
{{citation}}
: CS1 maint: unrecognized language (link) - ↑ సాక్షి దినపత్రిక (2019-09-16), సాహిత్య రంగంలో రాణించాలి (in english-handwritten), retrieved 2024-05-09
{{citation}}
: CS1 maint: unrecognized language (link) - ↑ నమస్తే తెలంగాణ (2019-09-16), రచనలతో సమాజలో చైతన్యం తేవాలి (in english-handwritten), retrieved 2024-05-09
{{citation}}
: CS1 maint: unrecognized language (link) - ↑ ఈనాడు (2021-08-01), సద్గుణ శతకం పుస్తకావిష్కరణ, retrieved 2024-04-10
- ↑ ఆంధ్రప్రభ (2021-06-26), కవుల కవిత్వాలు సమాజాన్ని మేల్కొ ల్పాలి, retrieved 2024-04-13
- ↑ ఈనాడు (2021-08-14), అట్టహాసంగా దేశ భక్తి [[కైతికాలు]] పుస్తక ఆవిష్కరణ, retrieved 2024-04-12
{{citation}}
: URL–wikilink conflict (help) - ↑ నమస్తే తెలంగాణ (2021-02-14), సాహిత్యంతోనే సమాజ వికాసం, retrieved 2024-04-10
- ↑ ఈనాడు (2022-08-02), కైతికాల రచనలో రో 'హిట్', retrieved 2024-04-13
- ↑ సాక్షి (2021-06-24), జీవన సాక్ష్యాత్కృతి ఆవిష్కరణ, retrieved 2024-04-12
- ↑ నమస్తే తెలంగాణ (2021-03-14), జాతీయ అవార్డుకు ఎంపిక, retrieved 2024-04-12
- ↑ ఈనాడు (2022-03-06), సాహిత్య వికాశంతోనే చైతన్యం, retrieved 2024-04-12
- ↑ సాక్షి (2024-02-24), యువ కవులకు సన్మానం, retrieved 2024-04-29
- ↑ ABN (2021-03-07). "మోతీరాం శతకం ముద్రణకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-12.
- ↑ సాక్షి (2021-11-14), విద్యార్థుల సాహిత్య పరిమళాలు, retrieved 2024-04-10
- ↑ నమస్తే తెలంగాణ (2021-11-15), కవిత్వ పరిమళాలు పుస్తకావిష్కరణ, retrieved 2024-04-13
- ↑ ఈనాడు (2024-04-02), పుస్తక పఠనం భవితకు మార్గ నిర్దేశనం, retrieved 2024-04-28
- ↑ ఈనాడు (2022-09-14), అట్టహాసంగా ఆకు పచ్చని సంతకాలు పుస్తకావిష్కరణ, retrieved 2024-04-12
- ↑ నమస్తే తెలంగాణ (2020-10-10), బతుకమ్మ అంతర్జాల సంచిక విడుదల, retrieved 2024-04-13
- ↑ ఆంధ్రప్రభ (2021-08-07), అజాదీకా అమృత్ మహోత్సవ్ పుస్తకావిష్కరణ, retrieved 2024-04-13
- ↑ సాక్షి (2018-11-12), కొలాం కవికి సన్మానం, retrieved 2024-05-19
- ↑ సాక్షి (2024-02-17), కేంద్ర సాహిత్య అకాడమీ సదస్సుకు ఆహ్వానం, retrieved 2024-05-27
- ↑ ఆంధ్రజ్యోతి (2021-09-09), ఘనంగా కాళోజి జయంతి వేడుకలు, retrieved 2024-05-15