కైతికాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కైతికాలు అనేవి 6 పాదాల నూతన సాహిత్య వచన గేయ కవిత ప్రక్రియ.దీనిని కరీంనగర్ జిల్లా,హుజూరాబాద్ కు చెందిన తెలుగు ఉపాధ్యాయులు గోస్కుల రమేష్ రూపొందించాడు.

కైతికాల ఆవిర్భావం (kaithikaalu):[మార్చు]

గోస్కుల రమేష్ తాను 2000 వ సంవత్సరం నుండి సాహిత్యం లో ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 400 వచన కవితలు రాసాడు. పలు పుస్తకాలు కూడా ముద్రించాడు. తన శ్రీమతి శ్రీలత సలహా మేరకు కొత్త మార్గం ఏర్పాటు చేసుకోవాలనుకొన్నారు. వేమన పద్యాన్ని, రవీంద్ర నాథ్ ఠాగూర్, శ్రీ.శ్రీ , కాళోజీ నారాయణరావు, అలిశెట్టి ప్రభాకర్ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కవిత్వం ఇష్ట పడే అతను అదే కోవలో అంటే సామాజిక జీవన విధానం పై స్పందించే లాగా ఉండే ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అందులో వ్యంగ్యం తో పాటు సకారాత్మకత గోచరించే ఆరు పాదాలతో రాసి మామూలు ప్రజలు మాట్లాడే భాషలో, సూక్ష్మంలో మోక్షం లాగా ప్రజల భాష వాడడం వలన కవిత్వంకు వికృతి పదమైన కయిత ఆ కయితకు రూపాంతరం కైతికంగా ఉన్న పేరును ఏర్పర్చుకొని అక్టోబర్ 18 విజయ దశమి 2018లో ప్రారంభం చేశాడు. దానికి తగ్గట్టు గానే వందలమంది కవులు ఈ ప్రక్రియ నెంచుకొని అందులో తమ సాహితీ ప్రతిభను పెంచుకున్నారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు ఏ మాత్రం నేర్చుకోవాలనే తపన ఉన్నను ఈ ప్రక్రియ నెంచుకొని వందల సంఖ్యలో కైతికాలు రాస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మాధ్యమాలు వేదికలుగా ప్రస్తుతం ఎలా మారరంటే కొత్తగా కవిత్వం ప్రజల సమస్యలపై స్పందించాలంటే కైతికాలు ప్రక్రియలో చేరండి అనే స్థితికి వచ్చినది. ఈ ప్రక్రియ దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక పత్రికలో విశ్లేషణ వ్యాసం గానో, కవిత్వం గానో ప్రముఖ దిన పత్రికలు ఈనాడు,వార్త, ఆంధ్ర భూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ,మనం,మన తెలంగాణా, నవతెలంగాణ,ఆదాబ్ హైదరాబాద్, నమస్తే, నమస్తే తెలంగాణ,నేటి నిజం లాంటి జాతీయ దినపత్రికలు, తెలంగాణ కేక,అల,రిపోర్టర్, గణేష్, తెలుగు వెలుగు లాంటి పత్రికలలో రోజు ఎదో ఓ పత్రికలో దర్శనమిస్తుంది.

కైతికాల ప్రాముఖ్యం :[మార్చు]

సంవత్సరంలో పొందిన ప్రత్యేకత

  1. మొత్తం 150 మంది కవులతో కైతికాలు రాయబడుతూ 78 మంది కవులలో కొందరు 1000 కి పైగా కైతికాలు రాసిన వారు, 500కి పైగా రాసిన వారు, 100కి పైగా రాసిన కవులు, 100వరకు కైతికాలు రాస్తున్న కవులు కూడా ఉన్నారు.
  2. 50 పుస్తకాలకు పైన ముద్రణకు సిద్ధమైనవి.
  3. నూతన కవుల నుండి ప్రముఖ కవుల వరకు,12 సంవత్సరాల పిల్లల నుండి 85 సంవత్సరాల వయస్సు కలిగిన వారు కూడా రాస్తున్న ప్రక్రియ.
  4. కఠిన చందోబద్ద నియమాలకు విరుద్ధంగా గుర్తింపబడి అలవోకగా అందరిని ఆకర్షించిన ప్రక్రియ.
  5. 175 దేశాల్లోని సమాచారాన్ని నమోదు చేసే వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన నూతన కవితా ప్రక్రియ కైతికాలు ప్రారంభించిన 365 రోజుల్లో 50 కి పైగా పుస్తకాలు ముద్రింపబడిన ఏకైక కవితా ప్రక్రియ.

కైతికాలపై సాహితీ ప్రముఖులు వాక్యాలు:[మార్చు]

1) అలతి అలతి పదాలతో అద్భుతమైన భావాలను సమకాలీన సంఘటనలపై ముక్కుసూటిగా ప్రకటించడానికి కైతికాలు ఓ వాహికగా నిలబడడం ఆహ్వానింపదగిన పరిణామం.

-- దాస్యం సేనాధిపతి, కవి, విమర్శకులు.

2) ఓ సందర్భం ఒక చమత్కారం. లయాత్మక నేపథ్యం శబ్ధం అర్థం దర్శనంతో కూడిన తెలుగు సాహిత్య సరికొత్త ప్రక్రియ.

-- పొట్లూరి హరి కృష్ణ సాహితీవేత్త ఆంధ్రప్రదేశ్ జానపద అకాడమీ అధ్యక్షులు.

3) విరుద్ధ భావావేశాలను ఏక కాలంలో ధ్వనింపచేస్తూ, అంతరంగిక వైరుధ్య కోణాలను ఆవిష్కరిస్తూ అల్లిగోరి నిర్మాణాన్ని సహజంగా తనలో ఇముడ్చుకున్న ప్రక్రియ కైతికాలు. మెటాఫర్ సిమిలిలను చివరి పాదాలలో నిర్మాణాత్మకంగా ప్రయోగించే అవకాశం ఉన్న ప్రక్రియ.ఆరు పాదాల కైతికంలోని ఆత్మ అయిదవ పాదంలో ఊపిరి పోస్తూ కైతిక స్థాయిని నిర్దేశిస్తుంది.పై నాలుగు పాదాలకు జీవం పోస్తూనే ఆరవ పాదం లోని ముగింపుకు సర్వకాలీనత అద్దగలుగుతుంది. వ్యంగ్యత్వం, విరుద్ధ భావ జాల కోణంతో కలిసి అస్పష్టత లోంచి స్పష్టతలోకి ఆలోచన ప్రవాహం పొరలు విప్పుకుంటూ, వాస్తవికంగా సాగే అక్షర ప్రయాణ గమనమే కైతికం

-- పరవస్తు విష్వక్సేన సమీక్షకులు

గేయ,పద్య స్వరూప స్వభావాన్ని మిళితం చేసుకొని తెలుగు లో మాత్ర చంధస్సు గజల్ రూపాంతరంగానే మరింత సరళంగా వచ్చిన ఆధునిక కవితా స్వరూపం కైతికాలు.

     మాత్రా ఛందస్సు వాడడంలో కొంత సరళంగా ఉండి నియమాలు ఆటంకం కాకుండా సాహిత్యం బాగుపడాలనే తపన,రూపపరమైన నవ్యత్వంలో, ఆలోచన తో సృష్టించిన కైతికాలు గొప్ప కవిత్వ శక్తిని కలిగి ఉద్యమ రూపం సంతరించుకున్నదనుటకు సంతోషిస్తూ గోస్కుల రమేశ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను
      ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,ప్రోఫెసర్, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్


కాలంతో పాటు వస్తున్న సాహిత్యప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ఏ సాహిత్య ప్రక్రియ లైనా,రూపాలైన, కవిత్వం,కథ, వ్యాసం మొదలైనవి ఏవైనా అప్పుడున్న సాహితీ ప్రియులు, ముందు తరాలు కూడా అమోదించే విధంగా, ఆకర్షించేలా ఉండాలి.అందులో ముఖ్యంగా లక్షణాలు ప్రారంభం,కొనసాగింపు,ఎత్తుగడ,అరుపు,చరుపు, కొస మెరుపు వంటి మొదలైన కవితా లక్షణాలు పొందుపరుచుకుని ఉండాలి.అప్పుడే ఆ ప్రక్రియలు మారుతున్న కాలంతో బాటు తన ఉనికిని కూడా నిలబెట్టుకుంటాయి.ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రక్రియ ఇటువంటి లక్షణాలు కలిగిన 'కైతికాలు'ను పరిశీలించి చూసినప్పుడు పైలక్షణాలు చాలా స్పష్టంగా కనబడుతుంటాయి. మంచి సాహిత్యాన్ని సృజియించడానికి ఇది ఒక మంచి మార్గంలా ఉంటుంది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు మాత్రలకనుగుణంగా చిన్న చిన్నగా ఉన్న ఆరు పాదాలలోనే ఎంతో విషయాన్ని చెప్పడానికి వీలున్న ప్రక్రియ అని అనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు.

శ్రీలతరమేశ్ గోస్కుల.

కవయిత్రి, వ్యాసకర్త.


కైతికాల నియమాల ఆత్మను సక్రమంగా అవగాహన చేసుకున్నట్లైతే మంచి సాహిత్యాన్ని సృష్టించడానికి తోడ్పడుతుంది,ఆరుపాదాల మినీ కవితగానే కాకుండా అరవై పాదాల వచన కవిత్వం లా ఆరువందల పాదాలతో దీర్ఘ కవిత లాగా కూడా రాయడానికి అవకాశం ఉండడం వల్ల ఈ ప్రక్రియ భవిష్యత్తు లో మనగలగడానికి అవకాశం ఉంది.


ప్రముఖ బాల సాహితీ వేత్త బహుగ్రంథ కర్త శ్రీమతి గుడిపూడి రాధికా రాణి గారిచే రాయబడిన వ్యాసం నుండి

     సిరిమల్లె ఆన్లైన్ పత్రికలో ప్రచురితమైన వ్యాసం నుండి సేకరణ

నూతన పుస్తకాలు:[మార్చు]

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో భాగంగా లో ఒకే చోట విడుదల అవుతున్న కైతికాల ప్రక్రియ లో వస్తున్న పుస్తకాల వివరాలు

1) కైతికాలు సంకలనం రమేశ్ గోస్కుల

2) చైతన్య వీచికలు తాడూరి కపిల మేడం

3) కైతికాల మెరుపులు మంచి కట్ల శ్రీనివాస్

4) స.రా కృతులు ఉడుత సంపత్ రాజ్

5) వెన్నెల వన్నెలు మార విజయ లక్ష్మి

6) అక్షర సేద్యం ఐరేణి క్రిష్ణ వేణి

7) విద్యా కుసుమాలు 35 మంది ఉట్నూర్ విద్యార్థుల సంకలనం

8) సామాజిక సుమాలు తాళ్ళ సత్యనారాయణ

9) దండారి ఆత్రం మోతిరామ్

10) నిజ దర్పణం జాదవ్ పుండలిక్ రావు

11) జీవిత సత్యాలు కైతికాలు గుడీపూడి రాధికారాణి

12) చైతన్య దీప్తులు గడ్డం శంకర్

13) మారవోయి మనిషి కోడెం సాంబయ్య

14) జే గంటలు యం.వి.ఉమాదేవి మేడం

15)బతుకు చిత్రం కొండగుర్ల లక్ష్మయ్య

16) గునుక పూలు అల్లాడి శ్రీనివాస్

17) ఎద సవ్వడి తాటికొండ రమాదేవి మేడం

18) గద్వాల కైతికాలు గద్వాల సోమన్న

19) ఆశల విరులు ఉదయ శ్రీ ప్రభాకర్

20) జ్ఞాన బోధ కైతిక సుధ గాలి రోహిత్

21) ఉదయ కిరణాలు డాక్టర్ వి.జలందర్

22) మామిడి వారి మధుర ఫలాలు కైతికాలు మామిడి రమేశ్

23) నడిచే నక్షత్రాలు మంచికట్ల భాస్కర్

24) జీవిత చక్రాలు బోయశేఖర్

25) చైతన్యం కల్వల రాజశేఖర్ రెడ్డి

26) వనాంజలి జాదవ్ బంకట్ లాల్

27) అర్జునాస్త్రం ముంజం మల్లికార్జున్

28) శ్రావ్య కైతికాలు పెద్దింటి శ్రావ్య

29) హృదయ గీతికలు ఎలిగేటి శ్రీనివాస్

30) సత్యవాక్కు నలమాసు విజయ ప్రసాద్

31) జీవన సౌరభం అయిత అనిత మేడం

32) స్వతంత్ర భారతికి బాలల కైతిక హారతి 40 మంది గొడిశాల పాఠశాల విద్యార్థులు

33) అక్షర దివిటీలు కైతికాలు గోస్కుల శ్రీలత

34) నివురుగప్పిన నిజాలు చిగుర్ల రామలక్ష్మి

35) మనో నేత్రాలు క్రిష్ణ నాయక్

36) కైతిక కదంబమాలిక ముడుంబై శేశఫణి

37) అక్షర తుటాలు వినాయకం ప్రకాష్

38) కృష్ణ శతకం కైతికాలు శైలజ శ్రీనివాస్

39) మనోగత రథ కైతికాలు సంధ్యారాణి

40) కాల జ్ఞాన కైతికాలు లక్ష్మణ చారి ఉట్నూర్

41) కైతిక క్షేత్రం కడారి ధశరథం

42) నిత్య సత్యాలు వి.టి.ఆర్ మోహన్ రావు

43) మేలుకొలుపు కైతికాలు పాక అశోక్

44) చైత్ర గీతాలు మాధవీలత మేడం

45) ముత్యాల కైతికాలు ముత్యాల రఘుపతి

46) చదువు కైతికాలు కుడుముల హనుమంతు గౌడ్

47) మురళీ నాదం కైతికాలు మోర్లే మురళీ కృష్ణ

48) పాలకంకులు విన్ను శ్రీ 9.వతరగతి విద్యార్థి

49) హృదయాంజలి కోడెం శ్రీనివాస్

50) చీకటిలో చిరుదీపం గోస్కుల రమేశ్

51) బడి అమ్మ ఒడి సంకలనం మంచి కట్ల శ్రీనివాస్ సంపాదకీయం

52) సీర హరి ప్రసాద్ గారి కైతికాల సంకలనం సుమ సరాలు

53) కాంతి కిరణాలు డాక్టర్ దివిటీ అంజనీ మేడం

54) యం.టి.స్వర్ణలత మేడం వారవ్వా ప్రకృతి వందనాలు నీకు

సంవత్సరం తరువాత వచ్చిన పుస్తకాలు

55) కరోనా పై కైతికాల రణం భువన సాహిత్య విజ్ఞాన వేదిక భద్రాద్రి కొత్త గూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 56)సాకీవార్ ప్రశాంత్ జ్ఞానస్మృతి కైతికాలు

57) దాసరి తిరుపతయ్య గారి కైతికాల సంకలనం

58) బండి శ్రీనివాస్ గారి తాత్త్విక దర్శనం కైతికాలు

కైతిక ప్రక్రియ లక్షణాలు:[మార్చు]

మాత్ర ఛందస్సులో రాయాలి

  • 1,2,3,4,పాదాలలో 9 నుండి 12 మాత్రలు ఉండాలి
  • 2,4 పాదాలలో అంత్యానుప్రాసలో ఉండాలి
  • 5 పాదంలో "వారెవ్వా" లేదా పై నాలుగు పాదాలను బలపరిచే మకుటం ,లేదా  సరైన పదము గానీ వాడాలి.
  • 6 వ పాదంలో కవితాత్మక వాక్యం ,నూతన పదబంధం లేదా జాతీయం ,కొసమెరుపులా ఉండాలి.
  • 5,6పాదాలలో మాత్ర ఛందస్సు నియమం అవసరం లేదు.కాని సరితూగే అక్షరాలు ఉండాలి.పెద్ద వాక్యాల రూపంలో ఉండకూడదు

ఉదాహరణలు:[మార్చు]

లఘవు=1,గురువు=2 మాత్రలు

1) పూ ల న్ని  ప ర వ శిం చే

     2   2  1   1  1 1  2   2 =12 మాత్రలు

2) అం ద మై న పం డ గ

     2   1  2   1  2   1  1  =10

3) అ మ్మా యి లం ద రు

     2   2    1    2   1  1  =9

4) ఆ డి పా డు మెం డు గ

     2  1  2   1   2    1  1 =10

5) మా ఊరి బతుకమ్మ

6) సిరి సంపదలివ్వమ్మ


తీ రొ క్క పూ ల తో

2  2  1   2   1  2  =10

తీ ర్చి ది ద్దు వ ని త లు

2   1  2  1  1  1  1  1= 10

బ తు క మ్మ  పా ట ల తో

1   1  2  1    2   1  1  2=11

నా ట్య మా డు  ప ల్లె లు

2   1    2    1    2  1  1=  10

మా ఊరి బతుకమ్మ

చిరు నప్వుల పువ్వమ్మ

అ మ్మ లే ని ఇం టి లో

2   1   2  1  2    1  2  =11

అ ను రా గం మూ ల న

1   1   2  2    2    1  1==10

క న్న త ల్లి లే కుం టే

2  1  2  1  2  2   2==12

జీ వి తం లో  రో ద న

2  1   2   2   2  1  1 =11

కనిపించే దేవత

కన్నతల్లే ఇలలోన

నా  దే శం నీ దై న

2   2  2   2  2 1=11

నీ  దే  శం  నా దై న

2   2   2    2   2   1=11

ఎ వ రై న  నే ల పై నే

1  1  2  1 2  1  2  2=12

ఎం దు కు  ఈ  హై రా న

2    1   1    2   2   2  1=11

మారవోయి ఓ మనిషి

ఉగ్రవాదాన్ని వదిలేసి


మరు జన్మ కు ముందుగా

కన్నతల్లి కడుపులో

మరణానికి ముగింపుగా

పుడమితల్లి కడుపులో

నిద్రకు నిద్రకు మధ్య

నిరీక్షణమే జీవితంముక్కారు శ్రమించి

బంగారం పండిస్తరు

ఆఖరికి మిగిలింది

అర్ధాకలితో చస్తరు

వారేవ్వా రైతులు

చితికి నట్టి బతుకులు


కోలాటాలు వచ్చే

చప్పట్లు తగ్గిపాయె

డిజే సాంగుల తోటి

నోటి పాట మూగబాయె

వారెవ్వా బతుకమ్మ

మొత్తానికి బతికావమ్మ


కరచాలనం చేస్తూ

కత్తులను దువ్వుతరు

వెన్నంటి ఉంటూనే

గోతిలొ తోసేస్తరు

వారేవ్వా వీరులు

గోముఖ వ్యాఘ్రాలు


నొచ్చుకున్న గుచ్చుకున్న

ఒక్క మాట చెబుతున్నా

ఆడమనసు మెత్తనన్న

ఎన్నడు నొప్పించకన్నా

వారేవ్వా బాలికలు

మమతలకు మూలికలు


ఎదుటి వారి నెంచ

సిద్ధహస్తులు వీరు

తమను తామెంచ

సాహసించ లేరు

వారేవ్వా కొందరు

గురివింద గింజలు


నేటి మహిళ మదిలో

సంద్రమంత వేదన

ఎంతస్థాయి నందిన

చిన్న చూపు మదిలోన

మారవోయి మనిషి

సమన్యాయం కల్పించి


తరువు పెంచువాడు

తరముల కాపాడు

నరికివేయు వాడు

నరకము నిలుపును

వారేవ్వా మానులు

మహిళోన మణులు


ప్రగాఢమైన ప్రేమ

తల్లి దండ్రుల బంధము

ఆత్మీయమైన ప్రేమ

తోబుట్టువు బంధం

వారేవ్వా దేహం నీవు

చనిపొనింట నుంతురే


నవధాన్య లక్ష్ములు

నెలువైన లోగిలిలో

అహంకారమీడిచేయు

ఆవు పేడ వేడుకలో

వారేవ్వా సంక్రాంతి

అందరికారోగ్య క్రాంతి


కష్టాల తిమిరాలు

సుఖాల చుట్టితే

కన్నీటి మేఘాలు

మనుసును కమ్మితే

వారేవ్వా జీవితం

నిండు నరకయాతనం

గోస్కుల రమేష్ ,కైతికాల సృష్టికర్త రచించిన కొన్ని కైతిక ఉదాహరణలు

1

గాయానికి భయపడి

గమనాన్ని విడుతువా!

తీరం దాటేసినాక

వ్యర్థ వ్యధను పడుతువా

జాగోమని అడుగేస్తే

జయం గడప నుండదా

2

మూర్ఖులతో  స్నేహాన

మంచి వారు చెడుదురా

మురికి గుంటన తామర

ముత్యం లా వెలుగురా

ఆశావాదం నుండగా

ముళ్ళు పూలుగా మారవా

3

ప్రతిభ తోడ వెలిగేవు

ప్రయత్నాన్ని మొదలెడితే

శిల వలెనే మిగిలేవు

అది చూసి భయపడితే

మొదలెట్టీ  మానవా

మోహన్ డై నిలవవా

4

అనుమానం వీడరా

ఆకాశం హద్దురా

జడివానై కురవరా

జగమంతా నిండరా

సెలయేరాలోచనైతే

చంద్రుని కన్న వెలుగు వురా

5

కనుగాంచని మోక్తికం

కప్పల పాలే కదా

గుణమును గుర్తించ కున్న

పాలు పసి కడుగే కదా

ఓ హోహొ మానవా

ప్రతిభను పసిగట్టి నడువు

6

చుట్టు ముళ్ళున్న వని

సుమ సౌరభ మాపునా

రెక్కలు పలుచనని

తేటి పరుగు లాపునా

సహజత్వం ఎలాగుంటే

సాటి తత్త్వమలాగుండు

7

నాది నీదనే దేమి

లోకంలో నుండురా

చచ్చి కాలి బూడిదైనా

నీట కలిసి పోవురా

నన్నయ్య తిక్కన ల

తీపి చెదిరి పోయేనా

8

ప్రయత్నిస్తే చరితలో

పరిమళమై నిలవొచ్చు

బాధ బురదన చిక్కితే

మన్నే పోగేయ వచ్చు

వారేవ్వా మానవా

కవన సిరులు నిలపవా

9

సౌజన్యమే పెట్టుబడి

మనిషి తనమే రాబడి

ప్రయత్నించి విఫలమైన

పునాది మిగులుబడి

అనుమానం వీడవోయీ

అణువణువు నీదేనోయీ [1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు:[మార్చు]

  1. కైతిక ఉదాహరణలు

వెలుపలి లంకెలు[మార్చు]

  • పత్రికల్లో వచ్చిన వ్యాసాల ఆధారంగా, కైతకాల పుస్తకం ద్వారా
"https://te.wikipedia.org/w/index.php?title=కైతికాలు&oldid=3877741" నుండి వెలికితీశారు