గద్వాల సోమన్న
గద్వాల సోమన్న | |
---|---|
జననం | 10 ఆగస్టు 1970 మొలగవల్లి , కర్నూలు |
నివాస ప్రాంతం | మొలగవల్లి |
వృత్తి | రచయిత |
ఉద్యోగం | గణితోపాద్యాయుడు |
తండ్రి | నాగన్న |
తల్లి | మరియమ్మ |
గద్వాల సోమన్న,కవి, బాలసాహిత్యవేత్త, రచయిత,గణితోపాధ్యాయుడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కర్నూలు జిల్లా, ఆలూరు మండలం,మొలగవల్లి వాస్తవ్యులైన శ్రీ గద్వాల నాగన్న, శ్రీమతి మరియమ్మ దంపతులకు ఏడవ సంతానం,కనిష్ట కుమారుడుగా 1970,ఆగష్టు 10న జన్మించారు.బాల్యంలో గొర్రెలు, గేదెలు మేపుతూ,పొలం పనులకు వెళ్ళేవాడు.అటు పిమ్మట అన్న ఆనంద్ పర్ల గ్రామంలో వార్డెన్ గా పనిచేస్తుండగా అక్కడికి వెళ్లి,అన్నావదినల చెంత ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు.[1]
గద్వాల సోమన్న ప్రాథమిక విద్య,హైస్కూలు, ఇంటర్మీడియట్ పర్ల,ఎమ్మిగనూరు లలో(అన్నావదినలు గద్వాల ఆనంద్,మరియమ్మల దగ్గర),బీఎస్పీ మొదటి సంవత్సరం కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో,మెకానికల్ ఇంజినీరింగ్ పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలులో అభ్యసించాడు .అనంతరం టి.టి.సి (టీచర్ ట్రైనింగ్)డైట్ బుక్కపట్నం,అనంతపురం జిల్లాలో, బీఎస్సీ(అంబేద్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్) ,బి.ఎడ్ ,శాంతి నికేతన్ బి.ఎడ్ కాలేజ్, కోడుమూరు లో చదివాడు.[2]
వృత్తి వివరాలు
[మార్చు]రంగారెడ్డి జిల్లా, ధరూర్ మండలం,అంతారం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా 2000 నియమితులయ్యాడు.2003లో పర్మినెంట్ అయి, సరూర్ నగర్ మండలం, శ్రీరాం కాలనీ, పాఠశాలకు బదిలీపై వెళ్లాడు.పిమ్మట 610 జి.ఓపై సొంత జిల్లా కర్నూలు కు వచ్చి, కల్లూర్ మండలంలో శరీన్ నగర్,చిన్నటేకూర్,ఉల్లిందకొండ ,ప్యాపిలి మండలం పోతుదొడ్డి పాఠశాలలలో పనిచేశారు.2015లో పెద్దకడబూరు మండలం హెచ్. మురవణి పాఠశాలలో పనిచేస్తూ,అచ్చోటే 2020 సంవత్సరంలో పాఠశాల సహాయకులు(గణితోపాధ్యాయుడు)గా పదోన్నతి పొంది, (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్.మురవణి, పెద్దకడబూరు మండలంలో) ప్రస్తుతం పని చేస్తున్నాడు.
కుటుంబ నేపథ్యం
[మార్చు]గద్వాల సోమన్న, సుశీల(గృహిణి).కూతురు గద్వాల ప్రభు రచన ,కుమారుడు గద్వాల రిచర్డ్.
సాహితీ ప్రస్థానం
[మార్చు]గద్వాల సోమన్న హైస్కూలు చదివే రోజులనుండే వారి భాషోపాధ్యాయులు ఈరన్న గారి ప్రోత్సాహంతో రచనారంగం పై ఆసక్తి ఏర్పడింది.. వక్తృత్వం, వ్యాసరచన పోటీలకు స్వయంగా వ్రాసేవాడు.చిత్రలేనంలో ప్రావీణ్యంనూ రాణించేవాడు... అలా అలా కవిత్వం పై అభిలాష పెరిగి కవితలు,గేయాలు,వ్యాసాలు వ్రాయడం ప్రారంభించారు.. సోమన్న గారు వ్రాసిన తొలి వ్యాసం "మానవతా విలువలు " 1983 లో ఆంధ్రభూమి లో ప్రచురితమైంది.సోమన్న గారి సాహిత్య నేపథ్యం గురించి 2018లో "బాల బంధు,సహస్ర కవిరత్న 'గద్వాలసోమన్న' శీర్షికతో కర్నూలు కవనం-ప్రజాశక్తి లో,2018లోనే 'బాల సాహిత్య కవి..పసి హృదయాల్లో రవి..' శీర్షికతో ఈనాడు లో,2020లో 'సాహితీ సేద్యంలో నిత్య కృషివలుడు' అనే శీర్షికతో సాక్షి లో ప్రచురితమయ్యాయి. 1.సాక్షి 2.ఈనాడు,3.ఆంధ్రజ్యోతి, 4.ఆoధ్ర ప్రభ, 5.ఆంధ్రభూమి, 6.ప్రజాశక్తి 7.వార్త,8.విశాలాంధ్ర,9.సూర్య,10.అక్షర సాయంకాలం పత్రిక,11.తెలంగాణ కేక,12.నేటినిజం, 14.నవతెలంగాణ,15.నమస్తే తెలంగాణ, 16.బాలసుధ మాసపత్రిక,17 జనశక్తి, 18.గణేష్,19.జనవారధి, 20.ఎన్కౌంటర్,, 21.ఆంధ్ర ఫోకస్,22.మెట్రో గలుము, 23.ప్రజాకలం, 24.అంకురం,25.అల,26.కస్తూరి(మాసపత్రిక),27.మొలక మాసపత్రిక, 28మొలకన్యూస్(ఆన్లైన్ వెబ్ పేపర్),29..స్వర్ణపుష్పము మాసపత్రిక,30.నగరనిజం ,31.కోస్తాప్రభ ,32.నవ్య మీడియా,33ఫస్ట్ న్యూస్ ,34.తరణం,35.వార్త వీక్లీ ,36.ప్రజాశక్తి వీక్లీ ,37.సేన (అక్షర సైన్యం),38.త్రిశూల్ సమాచార్,38.పల్లెబాట 39హర్షన్యూస్ 40 చిత్తూరు ఫస్ట్ న్యూస్ 41.ప్రజామంటలు 42.ప్రవాహిని 43.తెలుగుప్రభ 44.మరో కిరణాలు 45.పరిమళము.46.జనదీపిక 47సత్తెనపల్లి న్యూస్48.సరికొత్త సమాచారం49.బొబ్బెలి సామ్రాజ్యం..50.వార్తాప్రభ 51.ప్రజానేత్రం52.స్నేహ వార్త53.ఏ.కె తెలుగు మీడియా 54.తెలుగులోకం55.సారథి 56.రాయల కాకతీయ 57. మా వారధి 58.ప్రజాఎస్ప్రెస్ 59.సూర్య ఉదయం60 .నవ భూమి 61.హంస వాయిస్ 62.ప్రజా సంచలనం63.జోర్డార్64.ప్రజా సాక్షి 65.ఆంధ్ర పత్రిక66..తపస్వి.మనోహరం.. వెబ్ పేజీలో 67.అక్షర ఉదయం 68.సాక్షి సండే(వీక్లీ)69.సంచిక వెబ్ పత్రిక70..జయ ధ్వని71.మన జన ప్రగతి72.జనవాదం73.ఉన్నమాట 74.బాధ్యత 75.ప్రజా మలుపు 76.టు డే తెలుగు డైరీ 77.పల్లె సాక్షి 78.నవ తెలంగాణ 79.జన గొంతుక 80.బహు జన వాయిస్ 81.అనంత జనశక్తి 82.జనం సాక్షి83.పల్లె వెలుగు 84.విశాఖ టు డే85.అనంత ప్రభ 86.కలం(ఆన్లైన్ పత్రిక)87.దివిటి 88గో తెలుగు.కామ్ ఆన్లైన్ పేపర్ 89.తెలంగాణ వాణి 90.పబ్లిక్ పల్స్91. విజయానికి అభయము 92.కొత్త తరంగం 93. నేటి గళము 94.నేటి రాయలసీమ 95-చెన్నై తెలుగు న్యూస్ టైమ్స్ 96.దిక్సూచి మాసపత్రిక 97.ఘంటారావమ్98.న్యూస్ రీడర్ 99.జనోదయ100.ప్రకంపన పత్రిక 101.విజయనగరం సమాచార్ 102.పీపుల్స్ లీడర్ 103.కృష్ణ జ్యోతి 104.ప్రభాతదర్శిని.105)ఆంధ్ర సింహం.106)వైజాగ్ ఎక్స్ప్రెస్ 107)మనం 108)కవి పయనం109)టైమ్ టుడే 110)నినాదం111)వార్తాప్రపంచం112)జన వాదం113)ఎక్స్ప్రెస్ డైలీ114)జన ప్రతి ధ్వని115)న్యూస్ ఛానెల్ 116)ఉదయ అక్షర 117)నల్లా సమాచార్ 118)ప్రజాలాపన119)థర్డ్ ఐ 120)సీమ కిరణం మొదలగు దిన, వార,మాసపత్రికలలో (రమారమి 120)గద్వాలసోమన్న పద్యాలు,కవితలు,గేయాలు,కథలు,నానీలు, నానోలు,రెక్కలు,వెన్నెలమ్మ పదాలు,ముత్యాల సరాలు,హైకూలు,గజల్స్ ,వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.
పుస్తకాలు
[మార్చు]1.పసి(డి) హృదయాలు
2.ఓ తెలుగు బాల!
3.వెన్నెల బాల పదాలు
4.గద్వాల మణిపూసలు
5.గద్వాల్ చెప్పిన నీతి కథలు
6.బ్రహ్మవాక్కు శతకం
7.సోమనాఖ్యుని మాట శతకం
8.హృదయ స్పందన శతకం
9.రత్నాల సరాలు
10.జీవిత సత్యాలు-ముత్యాల హారాలు
11.గద్వాల కైతికాలు
12.సుభాషితాలు-ముత్యాల హారాలు
13.విద్యా విజ్ఞాన కుసుమాలు
14.చిట్టి చందమామ
15.అక్షర నక్షత్రాలు
16.అక్షర గేయాలు
17.గుణింత గేయాలు
18.ఒత్తుల గేయాలు
19.సోమన్న మధురిమలు
20కన్న తల్లి-కల్పవల్లి
21.కొత్త చిగురు
22.స్పందన-హృదయ స్పందన శతకం
23.వెన్నెలమ్మ పదాలు-1
24.పర్ణశాల
25.పాలపుంత
26.మహనీయులు
27.జీవ ప్రపంచం
28.వెన్నెలమ్మ పదాలు-2
29.చిట్టి చేతులు-గట్టి రాతలు
30.అభినయ గేయాలు
31.పదాల గేయాలు
32.తేనె ధారలు
33.పాలు తేనెలు
34.తుషార బిందువులు
35.సమత సాహితీ సుమాలు
36.వెన్నెల వాన
37.ఈ-తరం బాలలు
38.అమ్మ ఒడి-ప్రేమ బడి
39. నిండు జాబిలి
40.అమ్ముల పొది-బాల గేయాలు
41.జయహో చంద్రయన్-3 (బాల గేయాలు)
42.ప్రతిబింబాలు (బాల గేయాలు)
పురస్కారాలు
[మార్చు]- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు-2019 పురస్కారం,కర్నూలు
- గురు స్పందన పురస్కారం- (స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండషన్)
- జాతీయ ఉత్తమ బలసేవక్-2017,బలానందం,విజయనగరం
- .ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారం-2017,(ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, విజయనగరం)
- .సహస్ర కవిమిత్ర , సహస్ర కవిరత్న--2018,(తెలుగు కవితావైభవం,హైదరాబాద్)
- .బాలరంజని కవిమిత్ర , బాలసాహితీ భూషణ-2018,(బాలరంజని సంస్థ,శ్రీకాకుళం)
- .ఉత్తమ కవిత సాహితి పురస్కారం-2018,(శ్రీకిరణ్ సాంస్కృతిక సమాఖ్య'హైదరాబాద్)
- మాతృభాషాభివృద్ధి పద్య గాన ప్రక్రియకు-2018,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సత్కారం
- 2018,జిల్లా రచయితల సంఘం ,అనంతరం వారిచే,జాతీయ యువకవి సమ్మేళనంలో సన్మానం
- .కవి శిరోమణి-2019(,కాగ్నా కళాసమితి,తెలంగాణ )
- .గుర్రం జాషువా సాహితీ సేవాపురస్కారం-2019,(తెలుగు సాహితీ వేదిక,చిత్తూరు)
- సాహితీ సేవా పురస్కారం-2019,(చిన్నయ సూరి సాహితీ సమితి,నంద్యాల,కర్నూలు జిల్లా)
- .మెరుపుమిత్ర-2020,(అమ్మానాన్న సాహితీ సేవా సంస్థ,వరంగల్)
- .తెలుగు తేనీయ కవిమిత్ర-2020,(తెలంగాణ )
- .దాశరథి పురస్కారం-2020,(మహతీ సాహతీ)
- .వచన పద సరస్వతీ పుత్రులు,స్వర సరస్వతీ పుత్రులు పురస్కారాలు-2020,(తెలంగాణ)
- కవిశేఖర,వాణిశ్రీ, మధురవాణి కవిరత్న-2020,( తెలుగు కళా నిలయం,తెలంగాణ)
- .పద్మరత్న కవిమిత్ర-2020,(పద్మరత్నాలు సాహితీ వేదిక,కర్నూలు)
- .శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఎస్పీ బాలు సుబ్రమణ్యం,సినారె, సర్ ఆర్థర్ కాటన్ దొర,కైకాల సత్యనారాయణ ,కోడి రామకృష్ణ..
పురస్కారాలు-2020,(పున్నమి పత్రిక)
- .పంచరత్న కవిమిత్ర, కవిరత్న--2020,(తెలుగు సాహిత్య వేదిక,ఖమ్మం)
- .సిరిమాంజరి,రాగ గీతిక కవిమిత్ర,రాగశ్రీ -2020,(ఉషోదయ సాహితీ వేదిక, చిత్తూరు)
- .హరివిల్లు పురస్కారం-2020,(భద్రాద్రి సాహితీ వేదిక,భద్రాద్రి కొత్తగూడెం)
- .రాజశ్రీ పురస్కారం-2020,(అఖిల భారత సాహిత్య పరిషత్,మంచిర్యాల)
- .డా.చింతోజు బ్రహ్మయ్య-బాలమణి పురస్కారం-2020,(రాజన్న సిరిసిల్ల, తెలంగాణ )
- షాడో కవి శేఖర,కవి భూషణ,కవికుల రత్న,కవి తిలక
- పర్యావరణ మిత్ర
- సాహితీ ముత్యాల హారం,ముత్యాల హారం సహస్ర కవిరత్న-(ఆదిలాబాద్)
- వెలుగు దివ్వె పురష్కారం
- ఆంధ్ర కేసరి సేవ రత్న,డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పురష్కారాలు-(ఆదరణ వెల్ఫేర్ సొసైటీ)
- బాల సాహిత్య రత్న -(భానుపురి సాహితీ వేదిక)
- మహాకవి గుర్రం జాషువా సేవా రత్న-(గుడివాడ).
సాంఘీక సేవా కార్యక్రమాలు-సంస్థలకు సేవలు
[మార్చు]అనాథ వృద్దాశ్రమలను సందర్శిస్తూ..అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం,వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందజేయడం వారి ప్రవృత్తి.దైవ చింత కల్గి,ఆధ్యాత్మిక విషయాలు పదిమంది తో పంచుకోవడం వారి నిత్య కృత్యం. 1.చిట్టి చేతులు-1.గట్టి రాతలు(బాలగేయాల సంకలనం)2.బాలరంజ బాలగేయాలు 3.హిస్సార మురవణి బడి పిల్లల కథలు మొదలైన విద్యార్థులు వ్రాసిన రచనలకు పుస్తక రూపం తెచ్చాడు.గురజాడ అంతర్జాతీయ ఫౌండేషన్ కు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా,స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యదర్శిగా, బాలరంజని కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షులుగా, పసి(డి)హృదయాలు బాలసాహిత్యం సమూహానికి ప్రధాన అడ్మిన్ గాను వ్యవహరిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. Retrieved 2023-06-13.
- ↑ "సాహితీ పిపాసి..సోమన్న". EENADU. Retrieved 2024-03-30.