సీతక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని దాసరి అనసూయ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
సీతక్క (ధనసరి అనసూయ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 - ప్రస్తుతం
నియోజకవర్గం ములుగు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

సీతక్క తెలంగాణ కు చెందిన రాయకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా 2009లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచింది. 2018 లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచింది.

రాజకీయ జీవితం[మార్చు]

2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై గెలిచి రెండవసారి అసెంబ్లీ కి ఎన్నికైంది.[1]

మూలాలు[మార్చు]

  1. BBC Telugu (12 December 2018). "తెలంగాణ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ కూటమి 21 స్థానాల్లో గెలుపు". BBC News తెలుగు. Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 14 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=సీతక్క&oldid=3266308" నుండి వెలికితీశారు