గోదాం న‌గేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోదాం న‌గేశ్
గోదాం న‌గేశ్
In office
2014 – 2019
అంతకు ముందు వారురమేష్ రాథోడ్
తరువాత వారుసోయం బాపూరావు
నియోజకవర్గంఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
In office
1994 – 1999, 1999 - 2004, 2009 - 2014
అంతకు ముందు వారుసోయం బాపూరావు
తరువాత వారురాథోడ్ బాపూరావు
నియోజకవర్గంబోథ్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1964-10-21) 1964 అక్టోబరు 21 (వయసు 58)
జాతర్ల, బజార్‌హథ్నూర్‌ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీభారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామిల‌త‌
సంతానం1 కుమారుడు, 1 కుమార్తె
తల్లిదండ్రులురామారావు - భీమాబాయి

గోదాం న‌గేశ్ (జననం 21 అక్టోబరు 1964),[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. గోండు వర్గానికి చెందిన నగేశ్[2][3] బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు (1994 – 1999, 1999 - 2004, 2009 - 2014) శాసనసభ్యుడిగా, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 2014 నుడి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశాడు.

జననం, విద్య[మార్చు]

నగేశ్ 1964, అక్టోబరు 21న రామారావు - భీమాబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హథ్నూర్‌ మండలంలోని జాతర్ల గ్రామంలో జన్మించాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నగేష్ 1994 అసెంబ్లీ ఎన్నికలలో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[2][4] ఆయన తండ్రి రామారావు టిడిపి పార్టీ రెండుసార్లు బోథ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రిగా కూడా పనిచేశాడు.[5] 51,593 ఓట్లు (నియోజకవర్గంలో 65.27% ఓట్లు) సాధించిన[4] నాగేశ్, శాసనసభలో అతి పిన్న వయస్కుడైన శాసనసభ్యులలో ఒకడిగా ఉన్నాడు.[2] ఎన్నికల తర్వాత టిడిపి రాష్ట్ర ప్రభుత్వంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా నియమించబడ్డాడు.[3][6][7][8][9]

1999 ఎన్నికలలో 49,155 ఓట్లు (56.17%) సాధించి గెలుపొందాడు.[10] 2004లో జరిగిన ఎన్నికలలో 41,567 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[11] 2004 ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని తండ్రి వ్యతిరేకించినట్లు సమాచారం.[5] 2009 శాసనసభ ఎన్నికలలో 64,895 ఓట్లను (55.92%) సాధించి గెలుపొందాడు.[12] ఆదిలాబాద్ టీడీపీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా,[13] గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేశాడు. [5]

2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీడీపీని పార్టీకి రాజీనామా చేసి 2014, మార్చి 3న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు[14] సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[13] టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున బోథ్ శాసనసభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నాగేశ్, ఆదిలాబాద్ లోక్ సభ ఎంపీ సీటు కోరగా,[15] 2014, ఏప్రిల్ 8న ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు.[16] ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేశ్ జాదవ్ పై 17,1093 ఓట్ల మెజారీటితో 16వ లోక్ సభకు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు.[17] 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోయం బాపూ రావు చేతిలో 58,560 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. "Godam Nagesh Profile: Telangana Politician". News. Hyd. 19 May 2016.
  2. 2.0 2.1 2.2 Frontline, Vol. 12, Eds. 1-8. S. Rangarajan for Kasturi & Sons. January 1995. p. 23.
  3. 3.0 3.1 University of Madras (2003). Electoral politics and nation building in South Indian states. University of Madras. p. 95.
  4. 4.0 4.1 Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1994 TO THE LEGISLATIVE ASSEMBLY OF ANDHRA PRADESH
  5. 5.0 5.1 5.2 The Hindu. TDP may find the going tough
  6. India Today, Vol. 23. Thomson Living Media India Limited. 1998. p. 9.
  7. R. J. Rajendra Prasad (2004). Emergence of Telugu Desam: And an Overview of Political Movements in Andhra. Master Minds. p. 112.
  8. N. K. Chowdhry (1995). Assembly Elections, 1994–95: An Analysis and Results. Shipra Publications. p. 31. ISBN 978-81-85402-73-4.
  9. The Journal of Parliamentary Information, Vol. 41. Lok Sabha Secretariat. 1995. p. 30.
  10. Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1999 TO THE LEGISLATIVE ASSEMBLY OF ANDHRA PRADESH
  11. Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2004 TO THE LEGISLATIVE ASSEMBLY OF ANDHRA PRADESH
  12. Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2009 TO THE LEGISLATIVE ASSEMBLY OF ANDHRA PRADESH
  13. 13.0 13.1 The Hindu. Suspense over candidates continues in Adilabad
  14. The Hindu. Two TDP MLAs join TRS
  15. The Hindu. Boath MLA seeks TRS nomination from Adilabad
  16. The Hindu. TRS announces 45 more candidates
  17. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-15. Retrieved 2021-11-20.