రాథోడ్ బాపు రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాథోడ్ బాపు రావు
రాథోడ్ బాపు రావు


పదవీ కాలం
2014–2018, 2018–2023
నియోజకవర్గం బోథ్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 12, 1962
ఆదిలాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వందన
నివాసం బోథ్
మతం హిందూ మతం

రాథోడ్ బాపు రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున బోథ్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

బాపురావు 1962, మార్చి 12న నారాయణ - తారాబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, నార్నూర్ మండలం, నార్నూర్ గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివాడు.[3]

ఉద్యోగం

[మార్చు]

1987 నుంచి 2009 వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేశాడు.[4][5]

వివాహం

[మార్చు]

వందనతో బాపురావు వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

2009లో రాజకీయ ప్రవేశం చేసిన బాపురావు, 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేశాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్‌పై 26వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[6][7] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల లో టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోయం బాబు రావు పై 6వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[8][9][10]

2023లో నవంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని అనిల్ జాదవ్‌ను అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన అక్టోబర్ 18న భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేశాడు.[11] రాథోడ్‌ బాపూరావు నవంబర్ 01న ఢిల్లీలో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరాడు.[12][13]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.
  2. "Rathod Bapu Rao(TRS):Constituency- BOATH(ADILABAD) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-10-27.
  3. Telangana Legislature (2018). "Member's Profile – Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  4. Sakshi (26 October 2023). "'ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఒకప్పుడు ఉపాధ్యాయులే..'". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  5. Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.
  9. Namasthe Telangana (8 May 2021). "సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత". Namasthe Telangana. Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
  10. "Boath Assembly Election result 2018: TRS' Bapu Rao Rathod wins". www.timesnownews.com. Retrieved 2021-10-27.
  11. Sakshi (18 October 2023). "బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే బాపూరావు గుడ్‌బై". Archived from the original on 18 October 2023. Retrieved 18 October 2023.
  12. V6 Velugu (1 November 2023). "బీజేపీలో చేరిన బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు". Retrieved 2 November 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  13. Sakshi (1 November 2023). "బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.